Apple Watch: యాపిల్ స్మార్ట్‌వాచ్‌తో ప్రెగ్నెన్సీ టెస్ట్.. ఈ అద్భుతమైన ఫీచర్‌తో సాధ్యమంటున్న మహిళ!
ప్రస్తుతం టెక్నాలజీ పెరిగిపోతోంది. రోజురోజుకు దూసుకుపోతోంది. టెక్నాలజీ పెరుగుతున్న కొద్ది అన్ని రంగాలలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇక స్మార్ట్ వాచ్‌ను తీసుకుంటే..

ప్రస్తుతం టెక్నాలజీ పెరిగిపోతోంది. రోజురోజుకు దూసుకుపోతోంది. టెక్నాలజీ పెరుగుతున్న కొద్ది అన్ని రంగాలలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇక స్మార్ట్ వాచ్‌ను తీసుకుంటే రోజుకో కొత్త వాచ్‌లు మార్కెట్లోకి వస్తోంది. ఈ స్మార్ట్ వాచ్‌లలో అత్యాధునిక ఫీచర్స్‌ను జోడిస్తూ విడుదల చేస్తున్నాయి. టెక్నాలజీ పుణ్యమా అని వైద్యరంగంలో కూడా మెరుగైన అభివృద్ధి జరుగుతోంది. ఇక ఆపిల్ కంపెనీ.. దీని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆపిల్ కంపెనీ ప్రపంచంలోనే ఒక అద్భుతమైన బ్రాండ్‌ను ఏర్పర్చుకుంది. ఈరోజుల్లో స్మార్ట్‌వాచ్‌లకు డిమాండ్ ఎక్కువగానే ఉందని చెప్పాలి. ఎందుకంటే ఈ స్మార్ట్‌వాచ్‌లలో రకరకాల ఫీచర్స్ ఉంటున్నాయి. బీపీ చెక్ చేసుకోవడం, స్లిపింగ్ మోడ్, పల్స్‌రేటు స్టెప్‌కౌంటింగ్ తదితర ఫీచర్స్ ఉంటున్నాయి.
ఇలా స్మార్ట్ వాచ్‌లు హెల్త్ ట్రాకింగ్ ఫీచర్స్ కలిగి ఉండటంతో చాలా మంది ఈ వాచ్‌లపై ఆసక్తి చూపుతున్నారు. ఇక తాజాగా ఆపిల్ కంపెనీ నుంచి కూడా అద్భుతమైన స్మార్ట్ వాచ్‌లు అందుబాటులో ఉన్నాయి. ఈ స్మార్ట్‌వాచ్‌లు శరీరంలో జరిగే మార్పులను సైతం గుర్తించే విధంగా ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఆపిల్ స్మార్ట్ వాచ్ ద్వారా మహిళల ప్రెగ్నెన్సీ టెస్ట్ కూడా చేసుకోవచ్చు. మహిళలు గర్భం దాల్చితే ఈ విషయాన్ని కూడా ఈ స్మార్ట్ వాచ్ గుర్తిస్తోంది. తాను గర్భం దాల్చినట్లు తెలుసుకోకముందు ఆపిల్ వాచ్ గుర్తించిందని సదరు మహిళ పేర్కొంది. 34 సంవత్సరాలున్న మహిళ తన ఆపిల్ వాచ్ కొన్ని రోజుల వ్యవధిలో తన హృదయ స్పందన రేటులో గణనీయమైన పెరుగుదలను సూచించినట్లు గమనించింది.
సాధారణంగా విశ్రాంతి హృదయ స్పందన రేటు 57 నుంచి 72కి పెరిగిందని, ఇలా రేటు గణనీయంగా పెరగడంతో ఆమెకు అనుమానం వచ్చింది. తనకు కోవిడ్ ఉందేమోనని భావించింది. పరీక్షలు చేసుకోగా, ప్రతికూల ఫలితాలు వచ్చాయి. తాను గర్భం దాల్చిన మొదటి వారాలలో వేగవంతమైన హృదయ స్పందన రేటును గమనించానని ఆమె తెలిపింది. తర్వాత ప్రెగ్నెన్సీ టెస్ట్ కోసం ఆస్పత్రికి వెళ్లగా, నాలుగు వారాల గర్భవతి అని నిర్ధారణ అయినట్లు తెలిపింది. ఇలా నాకు తెలియకుండానే గర్భం దాల్చినట్లు వాచ్ తెలిపిందని ఆమె వెల్లడించింది. అయినప్పటికీ ఆపిల్ వాచ్‌కు గర్బాన్ని గుర్తించాడనికి అధికారిక ఫీచర్ లేదు. ఇది సగటు హృదయ స్పందన రేటులో మార్పు ద్వారా శరీరంలో జరుగుతున్న అసాధారణ విసయాలను గుర్తించగలదు. ఇందులో ఐఓఎస్16 అప్డేట్‌తో ఆపిల్ వాచ్ మహిళల కోసం ఒక ముఖ్యమైన ఫీచర్‌ను తీసుకువచ్చింది. అదే సైకిల్ ట్రాకింగ్ యాప్. ఈ ఫీచర్ మహిళల రుతుచక్రం గురించి వివరాలను రికార్డు చేయడానికి, దానిని ట్రాక్ చేయడంలో వారికి సహాయపడుతుంది. ఆపిల్ వాచ్ సిరీస్ 8, ఆపిల్ వాచ్ అల్ట్రాతో శరీర ఉష్ణోగ్రత సెన్సార్‌ను తీసుకువచ్చింది. ఇది పిరియడ్ అంచనాలను ట్రాక్ చేయగలదు.




మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి