AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Flipkart diwali sale 2022: ఫ్లిప్‌కార్ట్‌ దీవాళీ సేల్ వచ్చేస్తోంది.. కళ్లు చెదిరే ఆఫర్లు, భారీ డిస్కౌంట్లు..

ఆన్‌లైన్‌ ఈ కామర్స్‌ సైట్స్‌ పండుగ సీజన్‌ను క్యాష్‌ చేసుకునే పనిలో పడ్డాయి. ఇప్పటికే దసరా పురస్కరించుకొని ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌లు సేల్స్‌ను నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా దీపావళి పండుగను పుస్కరించుకొని ఫ్లిప్‌కార్ట్‌ దీవాళీ సేల్‌ను తీసుకొస్తోంది...

Flipkart diwali sale 2022: ఫ్లిప్‌కార్ట్‌ దీవాళీ సేల్ వచ్చేస్తోంది.. కళ్లు చెదిరే ఆఫర్లు, భారీ డిస్కౌంట్లు..
Flipkart Diwali Sale 2022
Narender Vaitla
|

Updated on: Oct 09, 2022 | 10:33 AM

Share

ఆన్‌లైన్‌ ఈ కామర్స్‌ సైట్స్‌ పండుగ సీజన్‌ను క్యాష్‌ చేసుకునే పనిలో పడ్డాయి. ఇప్పటికే దసరా పురస్కరించుకొని ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌లు సేల్స్‌ను నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా దీపావళి పండుగను పుస్కరించుకొని ఫ్లిప్‌కార్ట్‌ దీవాళీ సేల్‌ను తీసుకొస్తోంది. అక్టోబర్‌ 11 నుంచి 16 వరకు అందుబాటులో ఉండనున్న ఈ సేల్‌లో భాగంగా అదిరిపోయే ఆఫర్లను అందిస్తోంది. అన్ని రకాల ప్రాడక్ట్‌లపై భారీ డిస్కౌంట్‌లను అందిస్తోంది. ఇక ఫ్లిప్‌కార్ట్ ప్లస్‌ సభ్యులకు ఒక రోజు ముందు నుంచే అంటే.. అక్టోబర్‌ 10వ తేదీన సేల్‌ ప్రారంభం కానుంది.

కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, ఎస్‌బీఐతో కొనుగోలు చేసే వారికి ప్రత్యేకంగా 10 శాతం ఇన్‌స్టాంట్‌ డిస్కౌంట్‌ ఇవ్వనున్నారు. అలాగే పేటీఎంతో కొనుగోలు చేసిన వారికి కూడా 10 శాతం క్యాష్‌బ్యాక్‌ పొందే అవకాశం కల్పించారు. సేల్‌లో భాగంగా ఎంపిక చేసిన కొన్ని ప్రాడక్ట్‌లపై ఏకంగా 80 శాతం వరకు తగ్గింపు పొందొచ్చు. అలాగే ప్రింటర్లు, మానిటర్లపై ప్రత్యేకంగా 70 శాతం డిస్కౌంట్‌ను అందించనున్నారు. ఫ్లిప్‌కార్ట్‌ ఈ సేల్‌లో టీవీలపై భారీ డిస్కౌంట్‌ను అందిస్తోంది. 4కే అల్ట్రా హెచ్‌డీ టీవీ ధర రూ. 17,249 నుంచి ప్రారంభం కానుందని తెలిపింది.

ఇక కెమెరాలపై కూడా భారీగా డిస్కౌంట్‌ ఇవ్వనున్నారు. వాషింగ్‌ మెషీన్ల ధర రూ. 6,990 నుంచి ప్రారంభంకానుంది. అలాగే ఏసీలపై కూడా 55 శాతం డిస్కౌంట్‌ అందించనున్నారు. ఎలక్ట్రానిక్‌ గ్యాడ్జెట్స్‌తో పాటు ఫ్యాషన్‌ ప్రాడక్డులపై కూడా భారీ డిస్కౌంట్ ఇవ్వనున్నారు. వీటిపై ఏకంగా 60 నుంచి 80 శాతం తక్కువ ధరకు వస్తువులు లభించనున్నాయి. అలాగే బ్యూటీ, ఫుడ్ ,టాయ్స్ ధర రూ.99 నుంచి ప్రారంభం అవుతోంది. మ్యాట్రసెస్‌.. సోఫా, సోఫా సెట్స్‌పై 50 శాతం డిస్కౌంట్‌ లభించనుంది. ఇక చైర్స్ అండ్ టేబుల్స్‌పై 80 శాతం వరకు డిస్కౌంట్ ఇవ్వనున్నారు.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్