Smart planter: మొక్కలు నాటే కుండీలు కూడా స్మార్ట్‌గా మారిపోయాయ్.. వామ్మో ఎన్ని ఫీచర్లో..
ప్రస్తుతం అంతా స్మార్ట్ యుగం నడుస్తోంది. గ్యాడ్జెట్ల నుంచి టూత్ బ్రష్ వరకు అంతా స్మార్ట్‌గా మారిపోతున్నాయి. మారుతోన్న టెక్నాలజీకి అనుగుణంగా వస్తువుల పనితీరు కూడా మారిపోతోంది. అన్ని స్మార్ట్‌గా మారిపోతున్నప్పుడు పూల కుండీలు ఎందుకు మారకూడదనుకున్నారో ఏమో...
ప్రస్తుతం అంతా స్మార్ట్ యుగం నడుస్తోంది. గ్యాడ్జెట్ల నుంచి టూత్ బ్రష్ వరకు అంతా స్మార్ట్‌గా మారిపోతున్నాయి. మారుతోన్న టెక్నాలజీకి అనుగుణంగా వస్తువుల పనితీరు కూడా మారిపోతోంది. అన్ని స్మార్ట్‌గా మారిపోతున్నప్పుడు పూల కుండీలు ఎందుకు మారకూడదనుకున్నారో ఏమో కానీ లెట్‌పాట్ అనే ఓ సంస్థ కుండీలను సైతం స్మార్ట్‌గా మార్చేశాయి. ‘ఎల్‌పీహెచ్ మ్యాక్స్’ పేరుతో రూపొందించిన ఈ స్మార్ట్ పూల కుండీ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇందులో ఉన్న ఫీచర్లు ఔరా అనిపించేలా ఉన్నాయి. ఇంతకీ ఈ పూల కుండీలో ఉన్న ప్రత్యేకతుల ఏంటంటే..
ఈ పూల కుండీని ఇంట్లోనే ఏర్పాటు చేసుకోవచ్చు. సూర్యకాంతి ఉండదు కదా ఎలా అనుకుంటున్నారా.? సూర్యకాంతి అవసరమైన సమయంలో దీనిపై ఉన్న రూఫ్‌లో అమర్చిన ఎల్‌ఈడీ లైట్లు వెలుగుతాయి. ఇదే సూర్యాకాంతిలా ఉపయోగపడుతుంది. ఫుల్ ఆటోమేటిక్‌గా పనిచేసే ఈ కుండీలో ఒకేసారి ఏకంగా 21 మొక్కలను పెంచుకునే అవకాశం ఉంటుంది. ఈ కుండీలో మట్టి వేయాల్సిన అవసరం ఉండదు, కేవలం నీటితోనే మొక్కలు పెరుగుతాయి. అవసరమైనప్పుడల్లా దానంతటదే నీటిని తీసుకుంటుంది.
ఇక ఈ కుండీని స్మార్ట్‌ఫోన్‌తోనే ఆపరేట్ చేయొచ్చు. మొక్కలు ఎలా ఉన్నాయి, నీరు ఎంత ఉంది లాంటి వివరాలను ఫోన్ ద్వారా తెలుసుకోవచ్చు. పూల మొక్కలు, ఆకుకూరలు లాంటి మొక్కలను పెంచుకోవచ్చు. ఈ కుండీకి ముందు ఒక ఎల్‌సీడీ ప్యానెల్ ఉంటుంది. దీని ద్వారా కుండీలో ఎంత నీరు ఉంది.? లాంటి వివరాలను తెలుసుకోవచ్చు. ఈ స్మార్ట్ పూల కుండీ ధర రూ. 27 వేలుగా ఉంది.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..