Nokia 4G: ఎవర్‌ గ్రీన్‌ స్నేక్‌ గేమ్‌తో.. నోకియా నుంచి రెండు కొత్త ఫీచర్‌ ఫోన్‌లు..

ఒకప్పుడు ఫీచర్ ఫోన్లకు పెట్టింది పేరైనా నోకియా.. తాజాగా మళ్లీ మార్కెట్లోకి కొత్త ఫీచర్ ఫోన్ లను తీసుకొస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా మార్కెట్లోకి రెండు కొత్త ఫోన్ లను తీసుకొచ్చారు. నోకియా 108, 125 పేర్లతో ఈ ఫోన్ ను తీసుకొచ్చారు. ఇంతకీ ఫోన్లలో ఎలాంటి ఫీచర్లు ఉండనున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..

Nokia 4G: ఎవర్‌ గ్రీన్‌ స్నేక్‌ గేమ్‌తో.. నోకియా నుంచి రెండు కొత్త ఫీచర్‌ ఫోన్‌లు..
Nokia Phones
Follow us

|

Updated on: Nov 01, 2024 | 4:55 PM

ఫీచర్స్‌ ఫోన్‌లకు పెట్టింది పేరు నోకియా. ఈ కంపెనీ నుంచి వచ్చిన ఫీచర్‌ ఫోన్‌లకు అప్పట్లో ఫుల్‌ క్రేజ్‌ ఉందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పుడు నోకియా మళ్లీ ఫీచర్‌ ఫోన్‌లను తీసుకొస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా మరో రెండు ఫోన్‌లను తీసుకొస్తోంది. నోకియా క్లాసిక్‌ గేమ్‌ అయిన స్నేక్‌ గేమ్‌తో ఈ ఫోన్‌ను తీసుకొస్తుండడం విశేషం. నోకియా 108, 125 పేరుతో ఈ రెండు కొత్త ఫీచర్‌ ఫోన్‌లను తీసుకొస్తున్నారు. ఇంతకీ ఈ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉండనున్నాయి? ఇప్పుడు తెలుసుకుందాం..

ఫీచర్ల విషయానికొస్తే ఈ రెండు ఫీచర్‌ ఫోన్‌లలోనూ వైర్‌లెస్ FM రేడియో, MP3 ప్లేయర్‌ వంటి అధునాతన ఫీచర్లను అందించారు. హెచ్‌ఎమ్‌డీ కంపెనీ ఈ ఫోన్‌లను రూపొందిచింది. గతంలో తీసుకొచ్చిన HMD 105 4G, Nokia 110 4G రీబ్రాండ్‌ వెర్షన్స్‌గా తీసుకొస్తున్నారు. నోకియా 108 4G ఫోన్‌ను బ్లాక్‌, సియాన్‌ రంగుల్లో తీసుకొచ్చారు. అదేవిధంగా నోకియా 125 4G ఫోన్‌ను బ్లూ, టైటానియం కలర్స్‌లో లాంచ్‌ చేశారు.

ఇక ఈ ఫోన్స్‌లో 64 జీబీ, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీని అందించారు. మైక్రో ఎస్డీ కార్డు ద్వారా అదనంగా స్టోరేజ్‌ని విస్తరించుకోవచ్చు. డిస్‌ప్లే విషయానికొస్తే ఈ రెండు ఫోన్‌లలోనూ 2 ఇంచెస్‌తో కూడిన డిస్‌ప్లేను అందించారు. వైర్డ్‌, వైర్‌లెస్‌ ఎఫ్‌ఎమ్‌ రేడియో ఫీచర్‌ను ఇచ్చారు. ఇ ఈ రెండు ఫోన్స్‌లో 2000 కాంటాక్టులను సేవ్‌ చేసుకోవచ్చు. ఇంటర్నల్‌గా MP3 ప్లేయర్‌ను అందించారు.

ఇక ఈ రెండు ఫోన్లు కూడా నానో సిమ్ కార్డ్ సపోర్ట్ చేస్తాయి. అలాగే నోకియా క్లాసిక్‌ గేమ్‌ అయిన స్నేక్‌ గేమ్‌ను అందించారు. బ్యాటరీ విషయానికొస్తే వీటిలో 1450 ఎమ్‌ఏహెచ్‌ కెసాపిటీ గల బ్యాటరీని అందించారు. ఈ ఫోన్స్‌ను ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే ఏకంగా 15 రోజుల స్టాండ్‌బై ఇస్తుంది. అయితే కంపెనీ ఈ ఫోన్‌ ధరకు సంబంధించిన ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..

స్నేక్‌ గేమ్‌తో.. నోకియా నుంచి రెండు కొత్త ఫీచర్‌ ఫోన్‌లు..
స్నేక్‌ గేమ్‌తో.. నోకియా నుంచి రెండు కొత్త ఫీచర్‌ ఫోన్‌లు..
కిరణ్ అబ్బవరంను ట్రోల్ చేసి అవమానించిన సినిమా ఇదే..
కిరణ్ అబ్బవరంను ట్రోల్ చేసి అవమానించిన సినిమా ఇదే..
ఇలా క్లీన్ చేస్తే వాటర్ బాటిల్స్ లోపలి నుంచి కూడా శుభ్రపడతాయి..
ఇలా క్లీన్ చేస్తే వాటర్ బాటిల్స్ లోపలి నుంచి కూడా శుభ్రపడతాయి..
ఆస్ట్రేలియా పర్యటనకు టీమిండియా.. ఆ మ్యాచ్‌ రద్దు చేసిన బీసీసీఐ
ఆస్ట్రేలియా పర్యటనకు టీమిండియా.. ఆ మ్యాచ్‌ రద్దు చేసిన బీసీసీఐ
ప్రపంచంలోనే ఎత్తైన బుర్జ్‌ ఖలీఫాపై 'దీపావళి' వెలుగులు.. కలర్ ఫుల్
ప్రపంచంలోనే ఎత్తైన బుర్జ్‌ ఖలీఫాపై 'దీపావళి' వెలుగులు.. కలర్ ఫుల్
ఈ చిన్న గింజలు బాదం, వాల్‌నట్స్‌ కంటే రెట్టింపు ప్రయోజనం.!ఎముకలకు
ఈ చిన్న గింజలు బాదం, వాల్‌నట్స్‌ కంటే రెట్టింపు ప్రయోజనం.!ఎముకలకు
జీఎస్టీ రిటర్న్స్ దాఖలు చేయలేదా..?కొత్త నిబంధన తెలుసుకోవాల్సిందే
జీఎస్టీ రిటర్న్స్ దాఖలు చేయలేదా..?కొత్త నిబంధన తెలుసుకోవాల్సిందే
ఇండస్ట్రీని ఏలేసిన స్టార్ హీరోయిన్.. ఇప్పుడు రాజకీయాల్లో ఫేమస్..
ఇండస్ట్రీని ఏలేసిన స్టార్ హీరోయిన్.. ఇప్పుడు రాజకీయాల్లో ఫేమస్..
ఈ నూనెతో వంటలు చేస్తే మీరు ఊహించని లాభాలు..
ఈ నూనెతో వంటలు చేస్తే మీరు ఊహించని లాభాలు..
వేర్వేరు రంగుల్లో నంబర్‌ ప్లేట్స్‌ ఎందుకు ఉంటాయి? అర్థం ఏంటి?
వేర్వేరు రంగుల్లో నంబర్‌ ప్లేట్స్‌ ఎందుకు ఉంటాయి? అర్థం ఏంటి?