Facebook: ఇదేం సమస్యరా బాబు.. ఫేస్‌బుక్‌లో ప్రొఫైల్ చూస్తే చాలు ఆటోమెటిక్‌గా ఫ్రెండ్ రిక్వెస్ట్..

. ముఖ్యంగా యువతను తమ స్నేహితులతో కనెక్ట్ అయ్యేలా వివిధ ఫీచర్లను ఫేస్‌బుక్ పరిచయం చేసింది. అందువల్ల సంతోషమైనా.. బాధ అయినా అందరూ ఫేస్‌బుక్‌లో పంచుకోవడం పరిపాటిగా మారింది. అయితే ఇటీవల ఓ సమస్య ఫేస్‌బుక్ యూజర్లకు చిరాకు తెప్పించింది.

Facebook: ఇదేం సమస్యరా బాబు.. ఫేస్‌బుక్‌లో ప్రొఫైల్ చూస్తే చాలు ఆటోమెటిక్‌గా ఫ్రెండ్ రిక్వెస్ట్..
Facebook
Follow us

|

Updated on: May 17, 2023 | 3:43 PM

ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్‌ఫోన్ వినియోగం విపరీతంగా పెరిగింది. స్మార్ట్‌ఫోన్‌లోని వివిధ యాప్స్ యువతను ఎక్కువగా ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా ఫేస్‌బుక్ యువత ఎక్కువగా వాడుతున్నారు.  సోషల్ ‌మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో ఫేస్‌బుక్ తనదైన మార్క్‌ను చూపుతుంది. యువతను ఆకట్టుకునేలా యాప్‌లో వివిధ ఫీచర్లు ఉండడంతో అందరూ ఫేస్‌బుక్ వాడకంలో బిజీ అయ్యారు. ముఖ్యంగా యువతను తమ స్నేహితులతో కనెక్ట్ అయ్యేలా వివిధ ఫీచర్లను ఫేస్‌బుక్ పరిచయం చేసింది. అందువల్ల సంతోషమైనా.. బాధ అయినా అందరూ ఫేస్‌బుక్‌లో పంచుకోవడం పరిపాటిగా మారింది. అయితే ఇటీవల ఓ సమస్య ఫేస్‌బుక్ యూజర్లకు చిరాకు తెప్పించింది. ప్రొఫైల్ చెక్ చేస్తే ఆటోమెటిక్‌గా ఫ్రెండ్ రిక్వెస్ట్ వెళ్లిపోవడంతో చాలా మంది గందరగోళానికి గురయ్యారు. దీంతో చాలా మంది యూజర్లు ఈ సమస్యను ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. మరి ఫేస్‌బుక్ ఈ సమస్య గురించి ఎలా స్పందించిందో? ఓ సారి తెలుసుకుందాం.

కొత్తగా ఫేస్‌బుక్‌లో వచ్చిన ఈ సమస్య ఓ బగ్ కారణంగా వస్తుందని తేలింది. ఇటీవల చాలా మంది వినియోగదారులు ఫేస్‌బుక్ వారు సందర్శించిన ప్రొఫైల్‌లకు అభ్యర్థనలను ఆటోమెటిక్‌గా సెండ్ అవుతున్నాయని ఫిర్యాదు చేశారు. కొంతమంది వినియోగదారులు వారి గోప్యత గురించి ఆందోళన చెందుతుండగా మరికొందరు దాని గురించి జోక్ చేశారు. ముఖ్యంగా ఈ సమస్య బంగ్లాదేశ్, ఫిలిప్పీన్స్, శ్రీలంక దేశాలకు చెందిన వినియోగదారులకే వచ్చిందని పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. అయితే ఈ సమస్యపై ఫేస్‌బుక్ స్పందించింది. ముఖ్యంగా ఈ గ్లిచ్‌ని త్వరగా గమనించి దానికి క్షమాపణలు చెప్పిందిటెక్ దిగ్గజం ది డైలీ బీస్ట్‌‌లో ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. ఇటీవల యాప్ అప్‌డేట్‌కు సంబంధించిన బగ్‌ను పరిష్కరించినట్లు వివరించింది. ఈ సమస్యను పరిష్కరించకముందు కొన్ని ఫేస్‌బుక్ స్నేహితుల అభ్యర్థనలు పొరపాటుగా పంపిందని మెటా ప్రతినిధి పేర్కొన్నారు. ప్రస్తుతం సమస్యను పరిష్కరించామని వినియోగదారులు నిరంతరాయంగా ఫేస్‌బుక్ సేవలను పొందవచ్చని వివరించారు. ఈ మేరకు మెటా కంపెనీ ప్రతినిధి వినియోగదారులకు క్షమాపణ చెప్పారు. 

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!