AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ask QX AI Tool: చాట్‌జీపీటీ పోటీగా ఆస్క్ క్యూఎక్స్.. 100 భాషల్లో మాట్లాడేస్తుంది.. పూర్తి వివరాలు

ఓ కొత్త ఏఐ టూల్ చాట్ జీపీటీకి సవాలు విసిరేందుకు సిద్ధమైంది. ఇది మీ మనస్సును అర్థం చేసుకొని మీతో మాట్లాడగలుగుతుంది. దాదాపు 100 విభిన్న భాషలలో ఇది మాట్లాడగలుగుతుంది. అందులో మన భారతీయ భాషలు 12 ఉన్నాయి. మనం ఏదైనా ప్రశ్నిస్తే తిరిగి ప్రతిస్పందిస్తుంది. ఇంతకీ ఈ టూల్ పేరు చెప్పలేదు కదా.. ఈ కొత్త ఏఐ టూల్ పేరు ఆస్క్ క్యూఎక్స్(AskQX). ఇది కొత్త ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టూల్. దీనిని క్యూఎక్స్ ల్యాబ్ ఏఐ రూపొందించింది.

Ask QX AI Tool: చాట్‌జీపీటీ పోటీగా ఆస్క్ క్యూఎక్స్.. 100 భాషల్లో మాట్లాడేస్తుంది.. పూర్తి వివరాలు
Ask Qx Ai Tool
Madhu
|

Updated on: Feb 05, 2024 | 8:22 AM

Share

ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతతో వచ్చిన చాట్‌జీపీటీ.. గ్లోబల్ వైడ్‌గా సృష్టించిన సంచలనం అందరికీ తెలిసిందే. దీనికి పోటీగా గూగుల్ తో పాటు అనేక టెక్ దిగ్గజాలు ప్రయత్నిస్తున్నప్పటికీ సాధ్యం కావడం లేదు. ఈ క్రమంలో ఓ కొత్త ఏఐ టూల్ చాట్ జీపీటీకి సవాలు విసిరేందుకు సిద్ధమైంది. ఇది మీ మనస్సును అర్థం చేసుకొని మీతో మాట్లాడగలుగుతుంది. దాదాపు 100 విభిన్న భాషలలో ఇది మాట్లాడగలుగుతుంది. అందులో మన భారతీయ భాషలు 12 ఉన్నాయి. మనం ఏదైనా ప్రశ్నిస్తే తిరిగి ప్రతిస్పందిస్తుంది. ఇంతకీ ఈ టూల్ పేరు చెప్పలేదు కదా.. ఈ కొత్త ఏఐ టూల్ పేరు ఆస్క్ క్యూఎక్స్(AskQX). ఇది కొత్త ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టూల్. దీనిని క్యూఎక్స్ ల్యాబ్ ఏఐ రూపొందించింది. ఫిబ్రవరీ రెండో తేదీన మ్యాజెస్టిక్ మ్యజియమ్ ఆఫ్ ఫ్యూచర్లో లాంచింగ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఏఐ యాప్ ఆండ్రాయిడ్ వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది. త్వరలోనే ఐఓఎస్ వినియోగదారులకు అం దుబాటులో ఉంటుందని కంపనీ ప్రకటించింది.

వంద భాషల్లో మాట్లాడుతుంది..

Ask QX 100 వంద భాషల్లో ప్రతిస్పందిస్తుంది. హిందీ, బెంగాలీ, తెలుగు, మరాఠీ, తమిళం, ఉర్దూ, గుజరాతీ, కన్నడ, మలయాళం, ఒడియా, పంజాబీ, అస్సామీలతో సహా 12 భారతీయ భాషలలో మట్లాడగలుతుంది.. ఇంగ్లీష్‌తో పాటు, ఆస్క్ క్యూఎక్స్ అరబిక్, ఫ్రెంచ్, స్పానిష్, జపనీస్, జర్మన్, ఇటాలియన్, కొరియన్, పోర్చుగీస్, రష్యన్, సింహళం వంటి వివిధ ప్రపంచ భాషలలో కూడా అందుబాటులో ఉంటుంది.

AskQX ప్లాట్‌ఫారమ్ వినియోగదారులను టెక్స్ట్, ఆడియో ఫార్మాట్‌లలో సమాచారాన్ని యాక్సెస్ చేయడానికి అనుమతిస్తుంది. 2024 మొదటి త్రైమాసికంలో, వినియోగదారులు ఇమేజ్‌లు, వీడియోలతో ఇంటరాక్ట్ అయ్యేలా అదనపు ఫీచర్‌లను పరిచయం చేయాలని వారు ప్లాన్ చేస్తున్నారు. Ask QX ఇప్పటికే ప్రజాదరణ పొందింది. దాని ప్రారంభ ప్లాట్‌ఫారమ్ ప్రారంభించినప్పటి నుంచి 8 మిలియన్ల మంది వినియోగదారులను ఆకర్షిస్తోంది.

ఇవి కూడా చదవండి

ఆస్క్ క్యూఎక్స్ భాషా నమూనా..

ఆస్క్ క్యూఎక్స్ అనేది భారతదేశంలోని ప్రజలకు స్మార్ట్ లాంగ్వేజ్ టూల్ లాంటిది. ప్రధానంగా ఆంగ్లంలో పని చేసే ఇతర పెద్ద భాషా సాధనాల మాదిరిగా కాకుండా, 100 భాషలకు పైగా అర్థం చేసుకోవడానికి, కమ్యూనికేట్ చేయడానికి రూపొందింది. ఇది రెండు అంశాల సమ్మేళనమైన ప్రత్యేక సాంకేతికతను ఉపయోగిస్తుంది. ఒక భాగం పెద్ద భాషా నమూనాల వలే ఉంటుంది. మరొక భాగం ఒక రకమైన న్యూరల్ నెట్‌వర్క్. ఈ కలయిక ఆస్క్ క్యూఎక్స్‌ని భాషలను అర్థం చేసుకోవడంలో వినియోగదారులతో పరస్పర చర్య చేయడంలో ఉపయోగపడుతుంది.

ఆస్క్ క్యూఎక్స్ ఉచితమేనా..

ఆస్క్ క్యూఎక్స్ వినియోగదారుల కోసం సబ్‌స్క్రిప్షన్ ఎంపికల వంటి విభిన్న ప్లాన్‌లను కలిగి ఉంది. మీకు అదనపు ఫీచర్లు కావాలంటే, సాధారణ వినియోగదారుల కోసం (బీ2సీ) చెల్లింపు వెర్షన్ ను కలిగి ఉంది. ఇది న్యూరల్ నెట్‌వర్క్ అని పిలువబడే కూల్ టెక్నాలజీని ఉపయోగిస్తుంది. ఇతర సారూప్య ప్లాట్‌ఫారమ్‌ల కంటే తక్కువ ధరతో ఉంటుంది. ప్రాథమిక యాక్సెస్ కోసం ఆస్క్ క్యూఎక్స్ జెన్ ఏఐ న్యూరల్ ఇంజిన్ని ఉచితంగా వినియోగించే వెర్షన్ కూడా ఉంటుంది. ఇది ప్రస్తుతం ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉంది. వెబ్, మొబైల్ అప్లికేషన్‌ల వంటి వివిధ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా యాక్సెస్ చేయవచ్చు. ఐఓఎస్ వెర్షన్ త్వరలో యాప్ స్టోర్‌లో విడుదల కానుంది. మీరు Ask QX సామర్థ్యాలను తెలుసుకోవాలంటే https://qxlabai.com/లో తెలుసుకోవచ్చు.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..