జింగ్ జింగ్ బ్రేస్‌లెట్‌.. మొబైల్ ఫోన్..!

ఈ బ్రేస్‌లెట్ ఫోన్ చూస్తే అందరూ.. జింగ్ జింగ్.. అమేజింగ్..‌ అనక తప్పదు. దీన్ని చూస్తే మీరు కూడా అలానే అంటారు. ఎందుకంటే.. ఈ ఫోన్ ఫీచర్ అలాంటిది మరి..! టచ్‌స్క్రీన్‌ మొబైల్స్ చేతితో పట్టుకుని.. ఉపయోగించి అలసిపోయినవాళ్లకి ఇది భలే మంచి ఆఫర్ అని చెప్పొచ్చు. టెక్నాలజీ.. ఎప్పటికప్పుడు కొత్తగా రూపాంతరం చెందుతూనే ఉంది. తాజాగా.. మొబైల్ ఫోన్స్‌లలో మరో కొత్త రకం ఫోన్ వచ్చేసింది. దీన్ని ఎక్కడైనా.. ఎలాగైనా వాడొచ్చు. స్విమ్మింగ్ చేస్తూ.. స్నానం […]

  • Tv9 Telugu
  • Publish Date - 1:21 pm, Wed, 21 August 19
జింగ్ జింగ్ బ్రేస్‌లెట్‌.. మొబైల్ ఫోన్..!

ఈ బ్రేస్‌లెట్ ఫోన్ చూస్తే అందరూ.. జింగ్ జింగ్.. అమేజింగ్..‌ అనక తప్పదు. దీన్ని చూస్తే మీరు కూడా అలానే అంటారు. ఎందుకంటే.. ఈ ఫోన్ ఫీచర్ అలాంటిది మరి..! టచ్‌స్క్రీన్‌ మొబైల్స్ చేతితో పట్టుకుని.. ఉపయోగించి అలసిపోయినవాళ్లకి ఇది భలే మంచి ఆఫర్ అని చెప్పొచ్చు.

టెక్నాలజీ.. ఎప్పటికప్పుడు కొత్తగా రూపాంతరం చెందుతూనే ఉంది. తాజాగా.. మొబైల్ ఫోన్స్‌లలో మరో కొత్త రకం ఫోన్ వచ్చేసింది. దీన్ని ఎక్కడైనా.. ఎలాగైనా వాడొచ్చు. స్విమ్మింగ్ చేస్తూ.. స్నానం చేస్తూ.. డ్యాన్స్ చేస్తూ.. ఎప్పుడైనా.. ఈ ఫోన్‌ను మనం ఉపయోగించుకునే విధంగా దీన్ని తయారు చేశారు.

చేతికి బ్రెస్‌లెట్ రూపంలో దీన్ని తయారు చేశారు. చేతిని అటూ.. ఇటూ జస్ట్ మూవ్ చేస్తే చాలు.. మన చేతి మీద హోమ్ పేజ్ ఓపెన్ అవుతుంది. అలా ఓపెన్ అయిన తరువాత.. మనం నార్మల్ ఫోన్‌ని ఎలా అయితే యూజ్‌ చేస్తామో.. దీన్ని కూడా అలానే ఉపయోగించవచ్చు. కాల్స్ మాట్లాడొచ్చు, ఫ్రెండ్స్‌తో చాటింగ్‌ చెయ్యొచ్చు.. ఇలా వాట్సాప్, ఫేస్‌బుక్, వీడియో కాల్స్‌ అన్ని రకాలుగా వాడుకోవచ్చు. అంతేకాకుండా.. మెయిల్స్ చదవడం, వెదర్ రిపోర్ట్, ఇంటర్నెట్ బ్రౌజింగ్ ఇలా అన్నీ చేసుకోవచ్చు. అంతేకాదండోయ్.. ఇందులో కెమెరా కూడా ఉంది. ఈ కెమెరాలోని ఫొటోస్ హెచ్‌డీ క్వాలిటీని తలపించేలా ఉంటాయి. కాగా.. దీన్ని సీక్రెట్ బ్రెస్‌లెట్‌గా మార్కెట్‌లోకి ఓ శాంపిల్ పీస్‌లా విడుదల చేశారు.

Mobile Phone on your Wrist Cicret Bracelet

నిజానికి ఈ సీక్రెట్ బ్రేస్‌లెట్ కాస్ట్ $400లు. కానీ.. దీన్ని మరింత డెవలప్ చేయడానికి $810,000 ఖర్చు అవుతున్నాయి. ఒక శాంపిల్ తయారు చేయడానికి $340,000 డాలర్స్ ఖర్చు అవుతుంది. ఒకవేళ ఇది సక్సెస్ అయితే. . ఈ సీక్రెట్ బ్రేస్‌లెట్ ఫోన్ 10 రంగుల్లో రెండు పరిమాణాల్లో 32 జీబీతో మార్కెట్‌లోకి రానుంది. అసలు దీన్ని ఎలా ఉపయోగిస్తారో.. కింద వీడియో మీద ఓ లుక్కేసేయండి..!