Tech News: షాకింగ్ నిర్ణయం తీసుకున్న మైక్రోసాఫ్ట్.. 28 ఏళ్ల సేవలకు ఇక సెలవు.. విండోస్ ఓఎస్‌లో ఇకపై ఆ యాప్ కనిపించదు..
మైక్రోసాఫ్ట్ తీసుకొచ్చిన విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ లో వర్డ్ ప్యాడ్ చాలా కాలం నుంచి అందుబాటులో ఉంది. విండోస్ 95 వెర్షన్ అప్పటి నుంచి కూడా సేవలందిస్తోంది. అంటే 28ఏళ్లుగా ఈ యాప్ వినియోగదారులకు అందుబాటులో ఉంది. ఇప్పటి వరకూ విండోస్ ఓఎస్ లో ఎన్ని అప్ డేట్లు వచ్చినా వర్డ్ ప్యాడ్ కొనసాగింది. అయితే త్వరలో రానున్న విండోస్ కొత్త అప్ డేట్లో ఈ ఉచిత వర్డ్ ప్రాసెసింగ్ యాప్ ఉండదని మైక్రోసాఫ్ట్ పేర్కొంది.

ప్రముఖ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది. ఆ సంస్థ ప్రారంభం నుంచి అందుబాటులో ఉన్న వర్డ్ ప్యాడ్ ను ఇక నిలిపివేయనున్నట్లు ప్రకటించింది. ఈ యాప్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ లో దాదాపు 28 ఏళ్లుగా ఉంటోంది. వినియోగదారులకు బహుముఖ ప్రయోజనాలను అందిస్తోంది. విండోస్ వినియోగించచే ప్రతి వినియోగదారుడికి వర్డ్ ప్యాడ్ పై అవగాహన ఉండి ఉంటుంది. ఉచితంగా దీనిని యాక్సెస్ చేసుకొనే అవకాశం వినియోగదారులకు అందుబాటులో ఉండేది. అయితే ఇకపై దానిని పూర్తిగా నిలిపివేయనున్నట్లు మైక్రోసాఫ్ట్ ప్రకటించింది. అయితే అది ఎప్పటి నుంచి అనేది ఇంకా ప్రకటించలేదు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
28ఏళ్లుగా సేవలు..
మైక్రోసాఫ్ట్ తీసుకొచ్చిన విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ లో వర్డ్ ప్యాడ్ చాలా కాలం నుంచి అందుబాటులో ఉంది. విండోస్ 95 వెర్షన్ అప్పటి నుంచి కూడా సేవలందిస్తోంది. అంటే 28ఏళ్లుగా ఈ యాప్ వినియోగదారులకు అందుబాటులో ఉంది. ఇప్పటి వరకూ విండోస్ ఓఎస్ లో ఎన్ని అప్ డేట్లు వచ్చినా వర్డ్ ప్యాడ్ కొనసాగింది. అయితే త్వరలో రానున్న విండోస్ కొత్త అప్ డేట్లో ఈ ఉచిత వర్డ్ ప్రాసెసింగ్ యాప్ ఉండదని మైక్రోసాఫ్ట్ పేర్కొంది. అయితే ఎప్పటి నుంచి ఈ అప్ డేట్ అందుబాటులోకి వస్తుంది అనేది ఇంకా ప్రకటించలేదు. ఇక్కడ గమనించాల్సిందేమిటి అంటే మైక్రోసాఫ్ట్ కి ఇప్పటికే ఆప్షనల్ వర్డ్ ప్యాడ్ అందుబాటులో ఉంది. అది విండోస్ 10 నుంచి అందుబాటులో ఉంది. ఇప్పుడు వినియోగదారులు కావాలంటే దీనిని మైక్రోసాఫ్ట్ ఆప్షనల్ ఫీచర్ల కంట్రోల్ ప్యానల్ లోకి వెళ్లి ఇన్ స్టాల్ చేసుకోవచ్చు.
ప్రత్యామ్నాయ యాప్స్ ఇవే..
మైక్రోసాఫ్ట్ వర్డ్ ప్యాడ్ లేకపోతే అందుకు ప్రత్యామ్నాయంగా లైబర్ ఆఫీస్, జోహో డాక్స్, డబ్ల్యూపీఎస్ ఆఫీస్, లు థర్డ్ పార్టీ వర్డ్ ప్రాసెసింగ్ యాప్స్ కూడా ఉన్నాయి.




వినియోగదారులపై ప్రభావం ఇలా..
వర్డ్ ప్యాడ్ ను తొలగించడం వల్ల వినియోగదారులకు పెద్దగా ప్రభావమేమి ఉండదు. ఎందుకంటే ఇప్పటికీ దానిని వినియోగిస్తున్నవారు చాలా తక్కువ. ఇప్పటికే ఇతర అడ్వాన్స్ డ్ యాప్ లకు వినియోగదారులు మళ్లిపోయారు. లేదా థర్డ్ పార్టీ యాప్ లను ఎక్కువగా వాడుతున్నారు. ఈ నేపథ్యంలో మైక్రోసాఫ్ట్ వర్డ్ ప్యాడ్ ను ఇప్పటికిప్పుడు తొలగించడం వల్ల వినియోగదారులకు వచ్చిన ఇబ్బందేమి ఉండదని నిపుణులు చెబుతున్నారు. పైగా ఇటీవల కాలంలో వర్డ్ ప్యాడ్ ని వినియోగిస్తున్న వారి సంఖ్య కూడా తగ్గిందని చెబుతున్నారు.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..