Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Boult Sterling Pro: బౌల్ట్ నుంచి సరికొత్త స్మార్ట్ వాచ్.. స్టన్నింగ్ లుక్.. సూపర్ ఫీచర్లు.. అనువైన ధరలోనే..

బౌల్ట్ ఆడియో కొత్త స్మార్ట్ వాచ్ ను లాంచ్ చేసింది. బౌల్ట్ స్టెర్లింగ్ ప్రో బ్లూటూత్ కాలింగ్ వాచ్ పేరిట మార్కెట్లోకి ఈ కొత్త వాచ్ వచ్చింది. గత నెలలో బౌల్ట్ క్రౌన్ ఆర్ తర్వాత కంపెనీ నుంచి వస్తున్న ఉత్పత్తి ఇదే. ఈ స్మార్ట్ వాచ్ లో వృత్తాకార డైల్ ఉంటుంది. మెటాలిక్ ఫ్రేమ్, మెటాలిక్ స్ట్రాప్స్ తో ఇది అందుబాటులో ఉంటుంది. రెండు కలర్ ఆప్షన్లలో లభ్యమవుతుంది. ఈ వాచ్ గురించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

Boult Sterling Pro: బౌల్ట్ నుంచి సరికొత్త స్మార్ట్ వాచ్.. స్టన్నింగ్ లుక్.. సూపర్ ఫీచర్లు.. అనువైన ధరలోనే..
Boult Sterling Pro Smartwatch
Follow us
Madhu

|

Updated on: Sep 04, 2023 | 5:00 PM

యూత్ మళ్లీ రిస్ట్ వాచ్ ల మీద పడింది. అత్యాధునిక ఫీచర్లతో అందుబాటులోకి వస్తున్న స్మార్ట్ వాచ్ లను అందరూ ధరించాలని కోరుకుంటున్నారు. దీంతో వాటి వినియోగం గణనీయంగా పెరిగింది. కంపెనీలు కూడా ఈ డిమాండ్ కు అనుగుణంగా పెద్ద సంఖ్యలో స్మార్ట్ వాచ్ లను లాంచ్ చేస్తున్నాయి. అందులో భాగంగానే బౌల్ట్ ఆడియో కొత్త స్మార్ట్ వాచ్ ను లాంచ్ చేసింది. బౌల్ట్ స్టెర్లింగ్ ప్రో బ్లూటూత్ కాలింగ్ వాచ్ పేరిట మార్కెట్లోకి ఈ కొత్త వాచ్ వచ్చింది. గత నెలలో బౌల్ట్ క్రౌన్ ఆర్ తర్వాత కంపెనీ నుంచి వస్తున్న ఉత్పత్తి ఇదే. ఈ స్మార్ట్ వాచ్ లో వృత్తాకార డైల్ ఉంటుంది. మెటాలిక్ ఫ్రేమ్, మెటాలిక్ స్ట్రాప్స్ తో ఇది అందుబాటులో ఉంటుంది. రెండు కలర్ ఆప్షన్లలో లభ్యమవుతుంది. ఇప్పుడు ఈ బౌల్ట్ స్టెర్లింగ్ ప్రో బ్లూ టూత్ కాలింగ్ వాచ్ గురించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

డిజైన్ అండ్ డిస్ ప్లే ఇలా..

బౌల్ట్ స్టెర్లింగ్ ప్రో బ్లూ టూత్ కాలింగ్ వాచ్ లో 1.43 అంగుళాల ఎప్పుడూ ఆన్ లో ఉండే అమోల్డ్ డిస్ ప్లే ఉంటుంది. రిజల్యూషన్ 466*466 పిక్సల్స్ ఉంటుంది. దీనిలో ఇన్ బిల్ట్ మైక్రోఫోన్, స్పీకర్ ఉంటుంది. బ్లూ టూత్ కాలింగ్, వాయిస్ అసిస్టెంట్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి. 150కి పైగా వాచ్ ఫేసెస్ ఉంటాయి. నాలుగు యూఐ థీమ్స్ అందుబాటులో ఉంటాయి. రోటేటింగ్ క్రౌన్, కస్టమైజబుల్ షార్ట్ కట్ బటన్ ఉంటుంది.

హెల్త్ ఫీచర్లు ఇవి..

ఈ స్మార్ట్ వాచ్ లో పలు హెల్త్ ఫీచర్లు కూడా ఉన్నాయి. వాటిల్లో హార్ట్ రేట్ మోనిటర్, ఎస్పీఓ2 ట్రాకింగ్, స్లీప్ మోనిటరింగ్, మహిళల రుతు చక్ర ట్రాకింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. 100కు పైగా స్పోర్ట్స్ మోడ్లు ఉంటాయి. ఐపీ68 రేటింగ్ తో వాటర్ రెసిస్టెంట్ ఉంటుంది. స్మార్ట్ నోటిఫికేషన్లను అందిస్తుంది. ఏఐ అసిస్టెంట్ సపోర్టు, సెడెంటరీ రిమైండర్, డ్రింక్ వాటర్ రిమైండర్, వెదర్ డిటైల్స్, ఫైండ్ ఫోన్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఫిట్ నెస్ ట్రాకింగ్ కోసం గూగుల్ ఫిట్, యాపిల్ హెల్త్ యాప్ లకు సపోర్టు చేస్తుంది.

ఇవి కూడా చదవండి

ధర, లభ్యత..

బౌల్ట్ స్టెర్లింగ్ ప్రో బ్లూ టూత్ కాలింగ్ వాచ్ బ్లాక్, సిల్వర్ కలర్ వేరింయట్లలో లభ్యమవుతుంది. కంపెనీ వెబ్ సైట్ తో పాటు ఫ్లిప్ కార్ట్ లో కూడా కొనుగోలు చేయొచ్చు. దీని ధర రూ. 2,499గా ఉంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గాల్లో ఉండగానే పైలట్‌కు గుండెపోటు..విమానంలో ప్రయాణికులు వీడియో
గాల్లో ఉండగానే పైలట్‌కు గుండెపోటు..విమానంలో ప్రయాణికులు వీడియో
బ్రిటిషర్లను భయపెట్టిన రోటీ.. చరిత్రను మలుపుతిప్పిన చపాతీ ఉద్యమం.
బ్రిటిషర్లను భయపెట్టిన రోటీ.. చరిత్రను మలుపుతిప్పిన చపాతీ ఉద్యమం.
అమెరికన్లపై చైనీయుల మీమ్స్‌ వీడియో
అమెరికన్లపై చైనీయుల మీమ్స్‌ వీడియో
రూ. 300 కోట్ల బంగ్లా.. లగ్జరీ కార్లు..వావ్‌ వాటే లైఫ్‌ వీడియో
రూ. 300 కోట్ల బంగ్లా.. లగ్జరీ కార్లు..వావ్‌ వాటే లైఫ్‌ వీడియో
అయ్యో చేప ఎంతపని చేసింది.. వీడియోలో మీరే చూడండి!
అయ్యో చేప ఎంతపని చేసింది.. వీడియోలో మీరే చూడండి!
దూసుకెళ్తున్ బస్సు..భయం భయంగా ప్రయాణికులు..ఏం జరిగిందంటే.. వీడియో
దూసుకెళ్తున్ బస్సు..భయం భయంగా ప్రయాణికులు..ఏం జరిగిందంటే.. వీడియో
రెస్టారెంట్‌ వింత ఆఫర్‌.. ఎంత బక్కగా ఉంటే అంత డిస్కౌంట్ వీడియో
రెస్టారెంట్‌ వింత ఆఫర్‌.. ఎంత బక్కగా ఉంటే అంత డిస్కౌంట్ వీడియో
మైక్రోసాఫ్ట్‌ బాస్‌లను ప్రశ్నించి..రచ్చ చేసిన మహిళ .. ఎందుకంటే..
మైక్రోసాఫ్ట్‌ బాస్‌లను ప్రశ్నించి..రచ్చ చేసిన మహిళ .. ఎందుకంటే..
ఫై ఓవర్‌ నుంచి ఊడిపడ్డ కాంక్రీట్‌ బీమ్‌ ..కారులోకి చొచ్చుకెళ్లి బ
ఫై ఓవర్‌ నుంచి ఊడిపడ్డ కాంక్రీట్‌ బీమ్‌ ..కారులోకి చొచ్చుకెళ్లి బ
నకిలీ డాక్టర్ మాజీ స్పీకర్‌ని చంపేసాడా? వీడియో
నకిలీ డాక్టర్ మాజీ స్పీకర్‌ని చంపేసాడా? వీడియో