Best Smartphones Under 25K: మార్కెట్లోకి ఐకూ జెడ్7 ప్రో గ్రాండ్ ఎంట్రీ.. అదే బడ్జెట్లో అంతకుమించి అనేలా ఉన్నా ఈ ఫోన్ల గురించి తెలుసా?
ఐకూ జెడ్7 ప్రో ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7200 చిప్ సెట్ తో వస్తుంది. 8జీబీ ర్యామ్ ఉంటుంది. కర్వ్ డ్ డిస్ ప్లేతో పాటు వెనుకవైపు గ్లాప్ ప్యానల్ వస్తోంది. స్లిప్ డిజైన్ తో లైట్ వెయిట్ తో వస్తోంది. దీనిలో 64ఎంపీ ప్రధాన కెమెరాతో పాటు 2ఎంపీ సెన్సార్ వెనుకవైపు ఉంటుంది. ముందు వైపు 16ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంటుంది. 6.78 అంగుళాల అమోల్డ్ డిస్ ప్లే ఉంటుంది.

లేటుగా వచ్చినా లేటెస్ట్ వస్తానన్న రేంజ్ లో కొంతకాలం క్రితమే మార్కెట్లో అడుగుపెట్టని బ్రాండ్ ఐకూ(iQOO). ఈ కంపెనీ నుంచి ఇటీవలే ఓ స్మార్ట్ ఫోన్ లాంచ్ అయ్యింది. అనువైన బడ్జెట్లో మిడ్ రేంజ్ ధరలో రూ. 25,000లోపులోనే ఆవిష్కరించింది. ఇది ఇప్పటికే మార్కెట్లో ఉన్న టాప్ బ్రాండ్లకు కూడా కఠినమైన పోటీని ఇస్తోంది. వాటిల్లో వన్ ప్లస్, రియల్ మీ, రెడ్ మీ, మోటోరోలా వంటి బ్రాండ్లు ఉన్నాయి. ఈ ఫోన్ పేరు ఐకూ జెడ్7 ప్రో. ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 7200 చిప్ సెట్ తో వస్తుంది. 8జీబీ ర్యామ్ ఉంటుంది. కర్వ్ డ్ డిస్ ప్లేతో పాటు వెనుకవైపు గ్లాస్ ప్యానల్ వస్తోంది. స్లిప్ డిజైన్ తో లైట్ వెయిట్ తో వస్తోంది. దీనిలో 64ఎంపీ ప్రధాన కెమెరాతో పాటు 2ఎంపీ సెన్సార్ వెనుకవైపు ఉంటుంది. ముందు వైపు 16ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంటుంది. 6.78 అంగుళాల అమోల్డ్ డిస్ ప్లే ఉంటుంది. 66వాట్ల ఫాస్ట్ చార్జింగ్ సపోర్టు ఉంటుంది. ఇది ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్ అమెజాన్ లో ఈ సెప్టెంబర్ 5 నుంచి విక్రయాలకు రానుంది. దీని ప్రారంభ ధరను రూ. 21,000గా అమెజాన్ ప్రకటించింది. కాగా ఐకూ మాత్రం దీని ధరను రూ. 23,999(128జీబీ వేరియంట్), రూ, 24,999(256జీబీ వేరియంట్)గా ప్రకటించింది.
ఇప్పుడు ఇదే రూ. 25,000లోపు బడ్జెట్లో అందుబాటులో ఉన్న ఇతర బ్రాండ్లకు చెందిన స్మార్ట్ ఫోన్లను ఇప్పుడు చూద్దాం..
వన్ ప్లస్ నార్డ్ సీఈ 3లైట్.. ఇది కూడా అనువైన ధరలోనే లభ్యమవుతోంది. 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ను రూ. 19,999కే కొనుగోలు చేయొచ్చు. అలాగే 8జీబీ ర్యామ్, 256జీబీ వేరియంట్ ధర రూ. 21,999గా ఉంది. ఇది 6.72 అంగుళాల ఫుల్ హెచ్ డీ ప్లస్ ఎల్సీడీ డిస్ ప్లే ఉంటుంది. 120హెర్జ్ రిఫ్రెష్ తో వస్తుంది. స్నాప్ డ్రాగన్ 695 చిప్ సెట్ ఉంటుంది. ఆండ్రాయిడ్ 13 ఆధారంగా పనిచేస్తుంది. దీనిలో 5000ఎంఏహెచ్ సామర్థ్యంతో కూడిన బ్యాటరీతో పటు 67 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ సపోర్టు ఉంటుంది. వెనుకవైపు 108ఎంపీ ప్రధాన కెమరా తో పాటు 2ఎంపీ మాక్రో సెన్సార్, 2ఎంపీ డెప్త్ కెమెరా ఉంటుంది. ముందువైపు 16ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంటుంది.




రెడ్ మీ 11 ప్రో.. మన దేశ మార్కెట్లో ఐకూ జెడ్ 7ప్రో స్మార్ట్ ఫోన్ పోటీ ఇవ్వనున్న మరో టాప్ ఫోన్ రెడ్ మీ 11 ప్రో. దీనిలో 6.7 అంగుళాల ఫుల్ హెచ్ డీ ప్లస్ అమోల్డ్ డిస్ ప్లే, 120హెర్జ్ రిఫ్రెష్ రేట్ తో వస్తోంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7050 చిప్ సెట్ ఉంటుంది. 5,000ఎంఏహెచ్ సామర్థ్యంతో బ్యాటరీ ఉంటుంది. 67 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ ఫీచర్ ఉంది. ఆండ్రాయిడ్ 13 ఆధారంగా పనిచేస్తుంది. ఈ ఫోన్లో వెనుకవైపు 100ఎంపీ ప్రధాన కెమెరాతో పాటు 2ఎంపీ డెప్త్ సెన్సార్ ఉంటుంది. 5,000ఎంఏహెచ్ సామర్థ్యంతో పాటు 67వాట్ల ఫాస్ట్ చార్జింగ్ సపోర్టు ఉంటుంది. 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 23,999గా ఉంది. 8జీబీ ర్యామ్, 256జీబీ వేరియంట్ ధర రూ. 24,999, 12జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 27,999గా ఉంది.
రెడ్ నోట్ 12 ప్రో.. ఈ ఫోన్ నాలుగు వేరియంట్లలో లభ్యమవుతోంది. 6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 23,999, 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 24,999, 8జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 26,999, 12జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 28,999గా ఉంది. ఈ ఫోన్ 6.7 ఫుల్ హెచ్ డీ ప్లస్ అమోల్డ్ డిస్ ప్లే 120హెర్జ్ రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. మీడియా టెక్ డైమెన్సిటీ 1080ఎస్ఓసీ చిప్ సెట్, ఆండ్రాయిడ్ 13 ఆధారంగా పనిచేస్తుంది. 5000ఎంఏహెచ్ బ్యాటరీ, 67 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ సపోర్టుతో వస్తుంది. వెనుక వైపు 50ఎంపీ ప్రధాన సెన్సార్, 8ఎంపీ అల్ట్రా వైడ్ యాంగిల్, 2ఎంపీ మాక్రో సెన్సార్ ఉంటుంది. ముందువైపు 16ఎంపీ సెల్పీ కెమెరా ఉంటుంది.
- వీటితో పాటు మోటోరోలా ఎడ్జ్ 30, వన్ ప్లస్ నార్డ్ సీఈ 3 లైట్, పోకో ఎక్స్ 5 వంటి స్మార్ట్ ఫోన్లు కూడా ఇదే బడ్జెట్లో ఐకూ జెడ్ 7 ప్రో స్మార్ట్ ఫోన్ రేంజ్ లో మార్కెట్లో అందుబాటులో ఉంది.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..