గుడ్‌న్యూస్ !! రూ.99 వేలకే ఎలక్ట్రిక్ కారు

గుడ్‌న్యూస్ !! రూ.99 వేలకే ఎలక్ట్రిక్ కారు

Phani CH

|

Updated on: Sep 04, 2023 | 9:07 PM

ఆధునిక యుగంలో బైక్ కొనాలంటే కనీసం ఒక లక్ష రూపాయలు పెట్టాల్సిందే! ఇక కారు కొనాలంటే లక్షలు వెచ్చించాల్సిందే! అయితే కేవలం 99 వేల రూపాయలకే ఎలక్ట్రిక్ కారు అందుబాటులోకి రాబోతుంది. నమ్మశక్యంగా లేదు కదూ! ఇది నిజం.. చైనాకు చెందిన అలీబాబా కంపెనీ ఈ ఎలక్ట్రిక్ కారుని తయారు చేసింది. ముందు భాగంలో పులి ఆకారంలో ఉన్న ఈ కారులో కేవలం ఇద్దరు మాత్రమే ప్రయాణించేలా రెండు సీట్లను ఏర్పాటు చేశారు.

ఆధునిక యుగంలో బైక్ కొనాలంటే కనీసం ఒక లక్ష రూపాయలు పెట్టాల్సిందే! ఇక కారు కొనాలంటే లక్షలు వెచ్చించాల్సిందే! అయితే కేవలం 99 వేల రూపాయలకే ఎలక్ట్రిక్ కారు అందుబాటులోకి రాబోతుంది. నమ్మశక్యంగా లేదు కదూ! ఇది నిజం.. చైనాకు చెందిన అలీబాబా కంపెనీ ఈ ఎలక్ట్రిక్ కారుని తయారు చేసింది. ముందు భాగంలో పులి ఆకారంలో ఉన్న ఈ కారులో కేవలం ఇద్దరు మాత్రమే ప్రయాణించేలా రెండు సీట్లను ఏర్పాటు చేశారు. ఎలక్ట్రిక్ వెహికల్ ఆఫ్ ది వీక్ పేరిట సేల్ నిర్వహించిన అందులో ఈ కారుని 1199 డాలర్లకు విక్రయించినట్లు సమాచారం. అంటే ఇండియన్ కరెన్సీ ప్రకారం దీని విలువ సుమారు 99,000 రూపాయల వరకు ఉంటుంది. చూడటానికి చిన్నగా ఉన్నప్పటికీ ఇది గంటకు 120 కిలో మీటర్ల వేగంతో ప్రయాణిస్తుందని కంపెనీ తెలిపింది. పట్టణ ప్రాంతాల్లో రోజువారీ వినియోగానికి ఇది చాలా అనుకూలంగా ఉంటుంది. కానీ ఈ కారుని చైనాలో తప్పా ఇతర దేశాలకు తీసుకెళ్లే ఛాన్స్ లేదట. మొత్తానికి ఇది టాటా నానో కారుకంటే తక్కువ ధరకే లభించిందని తెలిసిపోతోంది. కారు చిన్నగా ఉండటం వల్ల పార్కింగ్ కోసం తంటాలు పడాల్సిన అవసరం లేదు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ట్రాఫిక్ చలాన్ మెసేజ్ వచ్చిందా ?? అయితే లైట్ తీస్కోండి

రాజస్థాన్‌లో అమానవీయ ఘటన.. యువతిని కొడుతూ నగ్నంగా ఊరేగించిన భర్త,

3 పెళ్ళిళ్ళు.. మరో ముగ్గురితో సంబంధాలు.. కాలనీవాసులు ఏం చేశారో తెలుసా ??

మసాలా దోసె… ఫిల్టర్ కాఫీకి.. చంద్రయాన్ సక్సెస్‌కి ఏంటి సంబంధం ??

వ్యూస్‌ కోసం కొత్తగా ట్రై చేశారు.. జైలు పాలయ్యారు.. ఏం జరిగిందంటే ??