కొత్త టెక్నాలజీతో ‘లవ్‌బర్డ్స్‌’ మళ్లీ వచ్చేస్తోంది!

ఎలక్ట్రిక్‌ కార్లకు డిమాండ్‌ బాగా పెరిగింది. అనేక కంపెనీలు విదేశీ సాంకేతికతను ఉపయోగించి ఇప్పుడిప్పుడే బ్యాటరీ కార్లను తయారు చేస్తున్నాయి. అయితే కేరళలోని ఓ కార్ల కంపెనీ మాత్రం 20 ఏళ్ల క్రితమే విద్యుత్తు కార్లను తయారు చేసి భారతదేశ సాంకేతికతను ప్రపంచానికి చాటి చెప్పిందంటే నమ్ముతారా? ఇప్పుడు మరోసారి తన సత్తా చాటేందుకు మళ్లీ ప్రయత్నాలు మొదలు పెట్టింది. కేరళలోని త్రిసూర్‌ జిల్లా చలక్కుడిలోని ‘ఎడ్డీ కరెంట్‌ కంట్రోల్స్‌ ఇండియా లిమిటెడ్‌’ అనే సంస్థ 1971లోనే […]

కొత్త టెక్నాలజీతో ‘లవ్‌బర్డ్స్‌’ మళ్లీ వచ్చేస్తోంది!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Jul 28, 2019 | 5:28 AM

ఎలక్ట్రిక్‌ కార్లకు డిమాండ్‌ బాగా పెరిగింది. అనేక కంపెనీలు విదేశీ సాంకేతికతను ఉపయోగించి ఇప్పుడిప్పుడే బ్యాటరీ కార్లను తయారు చేస్తున్నాయి. అయితే కేరళలోని ఓ కార్ల కంపెనీ మాత్రం 20 ఏళ్ల క్రితమే విద్యుత్తు కార్లను తయారు చేసి భారతదేశ సాంకేతికతను ప్రపంచానికి చాటి చెప్పిందంటే నమ్ముతారా? ఇప్పుడు మరోసారి తన సత్తా చాటేందుకు మళ్లీ ప్రయత్నాలు మొదలు పెట్టింది. కేరళలోని త్రిసూర్‌ జిల్లా చలక్కుడిలోని ‘ఎడ్డీ కరెంట్‌ కంట్రోల్స్‌ ఇండియా లిమిటెడ్‌’ అనే సంస్థ 1971లోనే విద్యుత్తు కార్లను తయారు చేసింది.

1993లో ‘లవ్‌బర్డ్స్‌’ అనే విద్యుత్తు కార్లను రూపొందించింది. అప్పట్లో ఇది అందరికీ నచ్చిన కార్లలో ఒకటి. కేవలం ఇద్దరకి మాత్రమే అనువైన ఈ కారు బ్యాటరీతో పనిచేస్తుంది. ఎనిమిది గంటలు ఛార్జి చేస్తే 60 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. గంటకు అరవై కి.మీ వేగంతో కారు నడుస్తుంది. కార్లకు అంతగా గిరాకీ లేని కాలంలోనే ఈ కార్లు 25 అమ్ముడు పోయాయి. అయితే  ప్రభుత్వం రాయితీలు ఎత్తివేయడంతో ఈ కార్ల ఉత్పత్తి నిలిపివేశారు. తాజాగా దీనికి మరింత సాంకేతికత జోడించి కొత్త రకం మోడల్‌ తయారీకి శ్రీకారం చుట్టారు.