Jio Download Speed: దూసుకుపోతున్న రిలయన్స్‌ జియో.. 4జీ డౌన్‌లోడ్‌ స్పీడ్‌లో ఆగ్రస్థానం: ట్రాయ్‌ వెల్లడి

Jio Download Speed: టెలికాం రంగంలో రిలయన్స్‌ జియో దూసుకుపోతోంది. డౌన్‌లోడ్ విషయంలో వేగం పుంజుకుంది. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI)..

Jio Download Speed: దూసుకుపోతున్న రిలయన్స్‌ జియో.. 4జీ డౌన్‌లోడ్‌ స్పీడ్‌లో ఆగ్రస్థానం: ట్రాయ్‌ వెల్లడి
Follow us
Subhash Goud

|

Updated on: Dec 15, 2021 | 7:56 PM

Jio Download Speed: టెలికాం రంగంలో రిలయన్స్‌ జియో దూసుకుపోతోంది. డౌన్‌లోడ్ విషయంలో వేగం పుంజుకుంది. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) ప్రచురించిన తాజా డేటా ప్రకారం.. నవంబర్‌లో 4G సర్వీస్ ప్రొవైడర్లలో అత్యధిక సగటు డేటా డౌన్‌లోడ్ వేగం సెకనుకు 24.1 మెగాబిట్‌తో రిలయన్స్ జియో తన అగ్ర స్థానాన్ని నిలుపుకుంది.

ఇక వొడాఫోన్ ఐడియా (VIL) మరియు భారతీ ఎయిర్‌టెల్ నెట్‌వర్క్‌లు కూడా ఈ నెలలో సగటు 4G డౌన్‌లోడ్ స్పీడ్‌లో పెరుగుదలను నమోదు చేశాయి. జియో నెట్‌వర్క్ సగటు 4G డేటా డౌన్‌లోడ్ వేగంలో 10 శాతం పెరుగుదలను నమోదైనట్లు ట్రాయ్‌ వెల్లడించింది. అయితే వొడాఫోన్‌ ఐడియా, ఎయిర్‌టెల్ నెట్‌వర్క్‌లలో వేగం గత నెలతో పోలిస్తే వరుసగా 8.9 శాతం మరియు 5.3 శాతం పెరిగింది.

అక్టోబర్‌లో 4G డేటా అప్‌లోడ్ వేగం విషయంలో వొడాఫోన్‌ ఐడియా తన నాయకత్వాన్ని కొనసాగించింది. కంపెనీ నెట్‌వర్క్ 8 mbps అప్‌లోడ్ స్పీడ్‌ను నమోదు చేసింది. ఇది గత ఐదు నెలల్లో అత్యధికం.డౌన్‌లోడ్ వేగం వినియోగదారులకు ఇంటర్నెట్ నుండి కంటెంట్‌ను యాక్సెస్ చేయడంలో సహాయపడుతుంది. అయితే అప్‌లోడ్ వేగం డేటాను పంపడంలో లేదా ఫోటోలు, వీడియోలను భాగస్వామ్యం చేయడంలో సహాయపడుతుంది. ఎయిర్‌టెల్ మరియు జియో నెట్‌వర్క్ కూడా నవంబర్‌లో తమ ఐదు నెలల హై అప్‌లోడ్ స్పీడ్‌ను వరుసగా 5.6 mbps,7.1 mbps నమోదు చేశాయని ట్రాయ్‌ తెలిపింది.

Jio 1

ఇవి కూడా చదవండి:

Jio Prepaid Recharge: త్వరలో వాట్సాప్‌ ద్వారా జియో ప్రీపెయిడ్ రీఛార్జ్

RuPay Debit Card: రూపే డెబిట్‌ కార్డు, భీమ్‌ యూజర్లకు గుడ్‌న్యూస్‌.. ప్రోత్సాహకాలు ప్రకటించిన కేంద్రం