RuPay Debit Card: రూపే డెబిట్‌ కార్డు, భీమ్‌ యూజర్లకు గుడ్‌న్యూస్‌.. ప్రోత్సాహకాలు ప్రకటించిన కేంద్రం

RuPay Debit Card: రూపే డెబిట్ కార్డ్ వినియోగానికి ప్రోత్సాహకాలు ప్రకటిస్తూ కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. రూ. 2,000 కంటే తక్కువ విలువ లావాదేవీలకు భీమ్-..

RuPay Debit Card: రూపే డెబిట్‌ కార్డు, భీమ్‌ యూజర్లకు గుడ్‌న్యూస్‌.. ప్రోత్సాహకాలు ప్రకటించిన కేంద్రం
Follow us
Subhash Goud

|

Updated on: Dec 15, 2021 | 7:07 PM

RuPay Debit Card: రూపే డెబిట్ కార్డ్ వినియోగానికి ప్రోత్సాహకాలు ప్రకటిస్తూ కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. రూ. 2,000 కంటే తక్కువ విలువ లావాదేవీలకు భీమ్-యూపీఐ ఉపయోగించే వారికి కూడా ప్రోత్సాహకాలు అందిస్తోంది. ఈ ప్రత్యేక స్కీమ్‌కు బుధవారం కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపినట్లు మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ తెలిపారు. డిజిటల్ లావాదేవీలు, చెల్లింపుల్లో బ్యాంకింగ్ వ్యవస్థ బలోపేతం చేయనుంది. దీంతో డిజిటల్‌ చెల్లింపులు మరింతగా పెరగనుంది.

బ్యాంకు సేవలు అందుకోలేనివారు.. దిగువ వర్గాలకు డిజిటల్‌ చెల్లింపులు అందుబాటులో ఉండనున్నాయి. అయితే కేంద్ర కేబినెట్‌ నిర్ణయంతో రూ. 1,300 కోట్ల ఆర్థిక భారం పడనుంది. అలాగే నవంబర్లో రూ.7.56 లక్షల కోట్ల విలువైన 423 కోట్ల డిజిటల్‌ లావాదేవీలు జరిగాయని తెలిపారు. ఈ పథకం వచ్చే ఏడాది మార్చి 31 వరకు అమల్లో ఉంటుందని తెలిపారు.

ఇవి కూడా చదవండి:

Jio Prepaid Recharge: త్వరలో వాట్సాప్‌ ద్వారా జియో ప్రీపెయిడ్ రీఛార్జ్

iMobile Pay App: మీ ఫోన్‌లో ఒక్క యాప్‌ ఉంటే చాలు.. ఏ బ్యాంకు క్రెడిట్‌ బిల్లు అయినా చెల్లింవచ్చు!