AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SMS ఛార్జీలు, మినిమం బ్యాలెన్స్‌ ఫైన్‌లతో బ్యాంకులు ఎన్ని వేల కోట్లు సంపాదించాయో తెలుసా? కళ్లు బైర్లుకమ్మే నిజం..!

ప్రభుత్వ రంగ బ్యాంకులు SMS అలర్ట్‌లు, పొదుపు ఖాతాలో కనీస బ్యాలెన్స్ నిర్వహించనందుకు వసూలు చేసే ఛార్జీల ద్వారా గత మూడు ఆర్థిక సంవత్సరాల్లో వేల కోట్ల రూపాయలు ఆర్జించాయి. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SMS ఛార్జీల ద్వారా అత్యధిక ఆదాయాన్ని పొందింది.

SMS ఛార్జీలు, మినిమం బ్యాలెన్స్‌ ఫైన్‌లతో బ్యాంకులు ఎన్ని వేల కోట్లు సంపాదించాయో తెలుసా? కళ్లు బైర్లుకమ్మే నిజం..!
Bank Earnings
SN Pasha
|

Updated on: Feb 10, 2026 | 9:00 PM

Share

నేటి డిజిటల్ యుగంలో దాదాపు అన్ని బ్యాంకులు బ్యాంకింగ్‌ సమాచారం మొబైల్ ఫోన్లలో SMS ద్వారా ఇస్తున్నాయి. ఖాతా బ్యాలెన్స్ గురించి, డబ్బు ఎప్పుడు జమ చేయబడింది లేదా విత్‌డ్రా చేసింది, ATM లావాదేవీ పూర్తయిందా అనే దాని గురించి సమాచారాన్ని వీటి ద్వారా ఎప్పటికప్పుడు అందిస్తున్నాయి. అయితే ఈ సౌలభ్యం కోసం చాలా బ్యాంకులు కస్టమర్ల నుండి ఛార్జీలు వసూలు చేస్తాయి. ఇంకా పొదుపు ఖాతాలో కనీస బ్యాలెన్స్ నిర్వహించనందుకు ప్రత్యేక జరిమానా కూడా విధిస్తాయి. పార్లమెంటులో సమర్పించబడిన తాజా ప్రభుత్వం డేటా ప్రకారం.. దేశంలోని ప్రభుత్వ రంగ బ్యాంకులు గత మూడు ఆర్థిక సంవత్సరాల్లో మినిమం బ్యాలెన్స్‌ ఫైన్‌, ఎస్‌ఎంఎస్‌ ఛార్జీల నుంచి వేల కోట్ల రూపాయలు సంపాదించాయి.

లోక్‌సభలో అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి మాట్లాడుతూ.. 2022-23, 2023-24, 2024-25 ఆర్థిక సంవత్సరంలో కనీస బ్యాలెన్స్ నిర్వహించకపోవడం, SMS సౌకర్యాలను అందించినందుకు జాతీయం చేసిన బ్యాంకులు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విధించే ఛార్జీల పూర్తి వివరాలను అందించామని అన్నారు. SMS ఛార్జీల ద్వారా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అత్యధిక ఆదాయాన్ని ఆర్జించింది. యూనియన్ బ్యాంక్ SMS ఆదాయం గత మూడు సంవత్సరాలుగా క్రమంగా వృద్ధి చెందింది, 2024-25 ఆర్థిక సంవత్సరంలో దాదాపు రూ.500 కోట్లకు చేరుకుంది.

కనీస బ్యాలెన్స్ ఫైన్‌లతో ఎంత సంపాదించాయంటే.. (కోట్లలో)

బ్యాంక్ ఆర్థిక సంవత్సరం 2022-23 ఆర్థిక సంవత్సరం 2023-24 ఆర్థిక సంవత్సరం 2024-25
బ్యాంక్ ఆఫ్ బరోడా 387.52  443.30  441.35 
బ్యాంక్ ఆఫ్ ఇండియా 174.99  194.25  170.83 
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర 131.77  143.69  152.86 
కెనరా బ్యాంకు 390.85  358.67  277.71 
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 150.81  135.31  97.19 
ఇండియన్ బ్యాంక్ 295.23  367.66  503.38 
ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ 13.00 15.06 15.55 
పంజాబ్ అండ్‌ సింధ్ బ్యాంక్ 19.02 42.53  48.57 
పంజాబ్ నేషనల్ బ్యాంక్ 486.16  674.04  417.67 
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 211.47  302.95  418.40 
యూకో బ్యాంక్ 18.30 43.43  53.56 
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 128.70  188.21  178.84 

SMS ఛార్జీలతో..

బ్యాంక్ ఆర్థిక సంవత్సరం 2022-23 ఆర్థిక సంవత్సరం 2023-24 ఆర్థిక సంవత్సరం 2024-25
బ్యాంక్ ఆఫ్ బరోడా 176.81  13.52  12.09
బ్యాంక్ ఆఫ్ ఇండియా 58.77  58.89  66.12 
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర 54.44  29.98  33.44 
కెనరా బ్యాంకు 176.59  135.82  193.87 
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 134.02  114.74  59.96 
ఇండియన్ బ్యాంక్ 43.38  53.66  85.45 
ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ 85.22  31.79  87.88 
పంజాబ్ అండ్‌ సింధ్ బ్యాంక్ 0.96  5.85  12.96 
పంజాబ్ నేషనల్ బ్యాంక్ 127.30  104.97  128.18 
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 0.00  0.00  0.00 
యూకో బ్యాంక్ 34.55  35.47  43.25 
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 301.15  392.59  494.40 

SBI మాత్రం కాస్త డిఫరెంట్‌..

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2020 జనవరి 1 నుండి SMS అలర్ట్ ఛార్జీలను పూర్తిగా మాఫీ చేసింది. అందుకే పైన ఉన్న పట్టికలో SBI SMS ఛార్జీలు మూడు సంవత్సరాలకు ఎలాంటి సంపాదన పొందలేదు. జన్ ధన్ యోజన, బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ ఖాతాల వంటి జీరో-బ్యాలెన్స్ ఖాతాలకు కనీస బ్యాలెన్స్ అవసరాలు లేవని ఆర్థిక మంత్రిత్వ శాఖ పేర్కొంది. సాధారణ పొదుపు ఖాతాలకు ఛార్జీలు బ్యాంక్ బోర్డు నిర్దేశించిన విధానం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జారీ చేసిన మార్గదర్శకాలకు లోబడి ఉంటాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి