Jio Prepaid Recharge: త్వరలో వాట్సాప్ ద్వారా జియో ప్రీపెయిడ్ రీఛార్జ్
Jio Prepaid Recharge: టెలికం రంగంలో రిలయన్స్ జియో సంచలనం సృష్టిస్తోంది. రకరకాల ఆఫర్లతో అతి తక్కువ సమయంలో కస్టమర్లకు చేరువైంది. నెలనెలా అధిక సంఖ్యలో..
Jio Prepaid Recharge: టెలికం రంగంలో రిలయన్స్ జియో సంచలనం సృష్టిస్తోంది. రకరకాల ఆఫర్లతో అతి తక్కువ సమయంలో కస్టమర్లకు చేరువైంది. నెలనెలా అధిక సంఖ్యలో కస్టమర్లు వచ్చి చేరుతున్నారు. ఈ నేపథ్యంలో రిలయన్స్ జియో కస్టమర్లకు త్వరలో వాట్సాప్‌ను ఉపయోగించి ప్రీపెయిడ్ రీఛార్జ్ చేసుకునే సదుపాయం రానున్నట్లు రిలయన్స్ జియో-మెటా బుధవారం ప్రకటించాయి. వాట్సాప్-జియో భాగస్వామ్యంతో ప్రీపెయిడ్ రీఛార్జ్ సదుపాయాన్ని మరింత సులభతరం అవుతుందని, కస్టమర్లకు మరిన్ని సేవలు అందించేందుకు జియో-మెటా సంస్థలు పరస్పర సహకారంతో కలిసి పని చేస్తున్నట్లు జియో లిమిటెడ్ డైరెక్టర్ ఆకాశ్ అంబానీ తెలిపారు. ముంబైలో జరిగిన ప్యూయెల్ ఫర్ ఇండియా ఈవెంట్‌లో ఆయన మాట్లాడుతూ.. వాట్సాప్ కమ్యూనికేషన్, చెల్లింపుల ప్లాట్‌ఫామ్‌తో ఇండియాలో మెరుగైన షాపింగ్ అనుభవాన్ని అందిస్తాయని తెలిపారు. అయితే ఈ వాట్సాప్ ఫీచర్ 2022లో విడుదల కానుంది.
అయితే దేశంలో అతిపెద్ద ఈ-కామర్స్ సంస్థగా అవతరించిన మెటాతో సహకారం తీసుకుంటున్న రిలయన్స్.. రిటైల్ సేవలు అందించేందుకు జియో మార్ట్ సేవలను వాట్సాప్‌లో ప్రారంభించి.. ట్యాప్ అండ్ చాట్ ఆప్షన్ ద్వారా వాట్సాప్ ద్వారా కిరాణ వస్తువులను ఆర్డర్ చేయవచ్చని అన్నారు. ఎలాంటి ఛార్జీలు లేకుండా ఉచితంగా డెలివరీ చేయనున్నట్లు తెలిపారు. వాట్సాప్‌ను ఉపయోగించి వస్తువులను ఆర్డర్ చేసుకోవచ్చని అన్నారు.
కాగా, సెప్టెంబర్ 2021 త్రైమాసికం చివరి నాటికి రిలయన్స్ జియోకు 429.5 మిలియన్ల మంది వినియోగదారులు ఉన్నారు. 2020-ఏప్రిల్‌లో జియోలో రూ.43,574 కోట్లు పెట్టుబడి పెడుతున్నట్లు మెటా ప్రకటించింది. వాట్సాప్ కమ్యూనికేషన్, చెల్లింపుల ప్లాట్‌ఫారమ్‌ను ఉపయోగించడం ద్వారా JioMartతో కలిసి పని చేయడం ద్వారా భారతదేశంలో మెరుగైన షాపింగ్ మరియు వాణిజ్య పరంగా మరిన్ని సదుపాయాలను అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం జియోమార్ట్‌లో అర మిలియన్లకు పైగా రిటైలర్లు ఉన్నారని, వారి సంఖ్య మరింత పెరుగుతోందన్నారు. మెటాతో మా భాగస్వామ్యం వాట్సాప్ టీమ్ సహకారంతో మరిన్ని సేవలు అందిస్తున్నామన్నారు.
ఇవి కూడా చదవండి: