AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నోట్లపై గాంధీజీ బొమ్మ తీసేస్తున్నారా.. ఆర్బీఐ ఏం చెప్పింది..? అసలు సాధ్యమేనా..

కరెన్సీ నోటు అంటేనే గాంధీజీ బొమ్మ.. కానీ నోట్ల డిజైన్ విషయంలో సోషల్ మీడియాలో ఎప్పుడూ ఏదో ఓ చర్చ జరుగుతూనే ఉంటుంది. నిజంగానే గాంధీజీ ఫొటోను మారుస్తున్నారా..? దీనిపై ఆర్బీఐ ఏం చెప్పింది..? అసలు ఒక నోటు మీద ఫోటోను మార్చాలంటే ఉండే నిబంధనలేంటి? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..

నోట్లపై గాంధీజీ బొమ్మ తీసేస్తున్నారా.. ఆర్బీఐ ఏం చెప్పింది..? అసలు సాధ్యమేనా..
Will Gandhi Photo Be Removed From Indian Currency
Krishna S
|

Updated on: Feb 10, 2026 | 6:25 PM

Share

భారతీయ కరెన్సీ నోటు అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది జాతిపిత మహాత్మా గాంధీ చిరునవ్వుతో ఉన్న ఫోటో. అయితే గత కొన్నేళ్లుగా ఈ ఫోటో స్థానంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్, రవీంద్రనాథ్ ఠాగూర్ లేదా ఛత్రపతి శివాజీ వంటి మహానుభావుల ఫోటోలను చేర్చాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. కేంద్రంలో మోదీ ప్రభుత్వం వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో ఈ చర్చ మళ్ళీ తెరపైకి వచ్చింది. అసలు నోట్లపై ఫోటోను మార్చడం సాధ్యమేనా? దానికి ఉన్న నిబంధనలు ఏంటి?

ఫోటో మార్పుపై ఆర్‌బీఐ క్లారిటీ

సాంకేతికంగా నోట్లపై మార్పులు చేయడం సాధ్యమే అయినప్పటికీ ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం గానీ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గానీ అలాంటి ప్రతిపాదన ఏదీ చేయలేదు. కరెన్సీ డిజైన్‌లో మార్పులు చేసే ఆలోచన లేదని ఆర్‌బీఐ పలుమార్లు స్పష్టం చేసింది. అయినప్పటికీ ప్రజల నుండి, వివిధ వర్గాల నుండి అప్పుడప్పుడు డిమాండ్లు వస్తూనే ఉన్నాయి.

నోటుపై బొమ్మను మార్చే అధికారం ఎవరికి ఉంటుంది?

భారతీయ కరెన్సీ నిర్వహణ అంతా ఆర్బీఐ చట్టం 1934 ప్రకారం జరుగుతుంది. ఇందులో రెండు కీలక సెక్షన్లు ఉన్నాయి. సెక్షన్ 22 ప్రకారం.. దేశంలో కరెన్సీ నోట్లను జారీ చేసే ఏకైక అధికారం కేవలం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు మాత్రమే ఉంటుంది. ఇతర ఏ సంస్థకూ ఈ అధికారం లేదు. సెక్షన్ 25 ప్రకారం.. నోటు రూపకల్పన, రూపం, ఉపయోగించే పదార్థం వంటి విషయాలలో ఆర్‌బీఐ సిఫార్సు చేసినప్పటికీ, తుది నిర్ణయం తీసుకునే అధికారం కేంద్ర ప్రభుత్వం వద్దే ఉంటుంది.

ఇవి కూడా చదవండి

మార్పు చేయాలంటే అనుసరించాల్సిన ప్రక్రియ ఇదే

ఒకవేళ నోటుపై ఫోటో మార్చాలి అనుకుంటే అది అంత సులభం కాదు. దాని వెనుక పెద్ద ప్రక్రియ ఉంటుంది. ముందుగా ఆర్‌బీఐ సెంట్రల్ బోర్డు ఈ మార్పుపై చర్చించాలి. భద్రతా ఫీచర్లు, ముద్రణకు అయ్యే ఖర్చు, కొత్త డిజైన్ వల్ల వచ్చే ఇబ్బందులు వంటివి పరిశీలిస్తారు. ఆర్‌బీఐ ఒక ప్రతిపాదనను సిద్ధం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపుతుంది. ప్రభుత్వం సాంకేతిక అంశాలతో పాటు ప్రజల మనోభావాలను కూడా పరిగణనలోకి తీసుకుని గ్రీన్ సిగ్నల్ ఇస్తేనే మార్పు జరుగుతుంది.

వివిధ డిమాండ్లు – వాస్తవాలు

కొంతకాలంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్, ఛత్రపతి శివాజీ మహారాజ్ వంటి వీరుల ఫోటోలను నోట్లపై చేర్చాలని సోషల్ మీడియాలో భారీగా ప్రచారం జరుగుతోంది. అయితే ఇవన్నీ ప్రస్తుతం డిమాండ్ల స్థాయిలోనే ఉన్నాయి. ప్రభుత్వం దీనిపై ఎటువంటి అధికారిక నిర్ణయం తీసుకోలేదు. ప్రస్తుతానికి మన జేబులోని నోట్లపై గాంధీ తాత చిరునవ్వు అలాగే ఉంటుంది. ప్రభుత్వం, ఆర్‌బీఐ నుండి ఎలాంటి అధికారిక ప్రకటన వచ్చే వరకు సోషల్ మీడియాలో వచ్చే వార్తలను నమ్మవద్దని నిపుణులు సూచిస్తున్నారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
100 అడుగుల లోయలో పడిన ఆర్టీసీ బస్సులు.. స్పాట్‌లోనే 15 మంది మృతి
100 అడుగుల లోయలో పడిన ఆర్టీసీ బస్సులు.. స్పాట్‌లోనే 15 మంది మృతి
లీటర్ పెట్రోల్ రూ. 82 మాత్రమే.. ఎక్కడో తెలుసా..? మన దేశంలోనే..
లీటర్ పెట్రోల్ రూ. 82 మాత్రమే.. ఎక్కడో తెలుసా..? మన దేశంలోనే..
నేను రోడ్డున పడ్డప్పుడు వచ్చి కలిసిన ఏకైక నటుడు అతను..
నేను రోడ్డున పడ్డప్పుడు వచ్చి కలిసిన ఏకైక నటుడు అతను..
పోలీస్, ఆర్మీ అధికారుల యూనిఫామ్‌పై ఈ తాడు ఎందుకు ఉంటుందో తెలుసా?
పోలీస్, ఆర్మీ అధికారుల యూనిఫామ్‌పై ఈ తాడు ఎందుకు ఉంటుందో తెలుసా?
మే నెలలో బ్యాంకులకు భారీగా సెలవులు.. 9 రోజులు క్లోజ్! లిస్ట్ ఇదే!
మే నెలలో బ్యాంకులకు భారీగా సెలవులు.. 9 రోజులు క్లోజ్! లిస్ట్ ఇదే!
ఐపీఎల్‌లో సరికొత్త చరిత్ర సృష్టించిన శ్రేయాస్ అయ్యర్ టీం..
ఐపీఎల్‌లో సరికొత్త చరిత్ర సృష్టించిన శ్రేయాస్ అయ్యర్ టీం..
NEET UG 2026 పరీక్షకు డ్రెస్ కోడ్ తప్పరిసరి.. ఇలాచేస్తే నో ఎంట్రీ
NEET UG 2026 పరీక్షకు డ్రెస్ కోడ్ తప్పరిసరి.. ఇలాచేస్తే నో ఎంట్రీ
వింటేజ్ పంత్ విధ్వంసం చూశారా.. ఒంటిచేత్తో కళ్లు చెదిరే సిక్సర్..!
వింటేజ్ పంత్ విధ్వంసం చూశారా.. ఒంటిచేత్తో కళ్లు చెదిరే సిక్సర్..!
అందం చూసి మోసపోకండి.. మీరు తినే అరటిపండు అసలైందేనా?
అందం చూసి మోసపోకండి.. మీరు తినే అరటిపండు అసలైందేనా?
భార్యపై అనుమానం.. కవల కుమార్తెల గొంతు కోసి హత్య చేసిన తండ్రి!
భార్యపై అనుమానం.. కవల కుమార్తెల గొంతు కోసి హత్య చేసిన తండ్రి!