Maktal Municipality: నారాయణపేట జిల్లా మక్తల్‌లో ఆరవ వార్డు బీజేపీ అభ్యర్థి ఎరుకలి మహాదేవ్ మున్సిపల్ ఎన్నికల పోలింగ్‌కు ముందు ఆత్మహత్య చేసుకున్నారు. ప్రత్యర్థుల వేధింపులే బలవన్మరణానికి కారణమని ఆయన భార్య ఆరోపించారు. మహాదేవ్ మృతిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన బీజేపీ కార్యకర్తల్లో తీవ్ర ఆవేదన నింపింది.