AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Car Loan: మీరు కారు కొనాలనుకుంటున్నారా? రుణం కోసం బెంగా? ఫైనాన్స్ టెన్షన్ ఇకపై లేదు అంటోంది టాటా మోటార్స్..ఎందుకో తెలుసా?

కస్టమర్లకు తేలికపాటి వడ్డీతో.. సులభంగా కారు రుణాలను అందించడానికి టాటా మోటార్స్ బంధన్ బ్యాంక్‌తో జతకట్టింది.

Car Loan: మీరు కారు కొనాలనుకుంటున్నారా? రుణం కోసం బెంగా? ఫైనాన్స్ టెన్షన్ ఇకపై లేదు అంటోంది టాటా మోటార్స్..ఎందుకో తెలుసా?
Car Loans
KVD Varma
|

Updated on: Dec 15, 2021 | 3:55 PM

Share

Car Loan: కస్టమర్లకు తేలికపాటి వడ్డీతో.. సులభంగా కారు రుణాలను అందించడానికి టాటా మోటార్స్ బంధన్ బ్యాంక్‌తో జతకట్టింది. ఈ ఒప్పందం ప్రకారం, కంపెనీ తన ప్యాసింజర్ వాహనాలకు బంధన్ బ్యాంక్ సహాయంతో ఆకర్షణీయమైన వడ్డీ రేట్లతో  కారు రుణాలను అందజేస్తుంది. కంపెనీ వర్గాలు వివరిస్తున్న దాని ప్రకారం, ఈ ఒప్పందం సహాయంతో, కస్టమర్లు చాలా సులభంగా రుణాలు పొందగలుగుతారు.

టాటా మోటార్స్-బంధన్ బ్యాంక్ ఆఫర్ ఇదే..

ఒప్పందం ప్రకారం, బంధన్ బ్యాంక్ టాటా మోటార్స్ కస్టమర్లకు 7.5 శాతం ప్రారంభ రేటుతో రుణాలను అందజేస్తుందని టాటా మోటార్స్ తెలియజేసింది. అదేవిధంగా వాహనం ఆన్-రోడ్ ధరలో 90 శాతం వరకు ఫైనాన్స్ ఇస్తారు. కస్టమర్లు 7 సంవత్సరాల కాలపరిమితితో రుణం తీసుకోగలుగుతారు. ఇది వినియోగదారులపై ఈఎంఐ(EMI) భారాన్ని మరింత తగ్గిస్తుంది. అదే సమయంలో, రుణగ్రహీతలు రుణాన్ని ముందుగానే క్లోజ్ చేసుకోవచ్చు లేదా అదనపు ఛార్జీలు లేకుండా పాక్షికంగా చెల్లించవచ్చు. టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్ బిజినెస్ యూనిట్ వైస్ ప్రెసిడెంట్ (సేల్స్ & మార్కెటింగ్) రంజన్ అంబ ఈ విషయంపై మాట్లాడుతూ, “ఈ భాగస్వామ్యం మా ఫైనాన్స్ ఈజీ ఫెస్టివల్‌లో ఒక భాగం. ఇక్కడ మేము దేశవ్యాప్తంగా రిటైల్ రుణాల కోసం వివిధ భాగస్వామ్యాలను రూపొందిస్తున్నాము. తద్వారా ప్రజలు కారు కొనుగోలు చేయడం చాలా సులభం అవుతుంది.” అని చెప్పారు.

ఇతర బ్యాంకుల కారు రుణాలు ఇలా..

బ్యాంక్ బజార్ (BankBazaar.com) వివరాల ప్రకారం.. బ్యాంకులు ప్రస్తుతం 7 శాతం ప్రారంభ రేటుతో కారు రుణాలను అందిస్తున్నాయి. గరిష్టంగా 8 సంవత్సరాల కాలానికి రుణాలు ఇస్తున్నారు. బ్యాంక్ బజార్ వెబ్‌సైట్ ప్రకారం, మీరు లగ్జరీ కారును పొందాలనుకుంటే, మీరు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌కు వెళ్లాలి. మరోవైపు, మీకు 100 శాతం ఫైనాన్స్ కావాలంటే, ICICI బ్యాంక్ ఆఫర్ మీకు మెరుగ్గా ఉంటుంది. వ్యవసాయ రంగానికి సంబంధించిన కస్టమర్‌లు.. నిపుణుల కోసం ఎస్బీఐ(SBI) మెరుగైన ఆఫర్‌లను కలిగి ఉంది. మీకు చిన్న మొత్తం అవసరమైతే, యాక్సిస్ బ్యాంక్ ఆఫర్ మీకు ఉత్తమమైనదిగా చెప్పవచ్చు.

ఇతర బ్యాంకుల వడ్డీ రేట్లు ఇలా..

  • బ్యాంక్ ఆఫ్ బరోడా 7 శాతం రేటుతో కారు రుణాన్ని అందిస్తోంది. బ్యాంక్ రుణంపై ప్రాసెసింగ్ రుసుము రూ. 1500 (GST అదనం) వసూలు చేస్తోంది.
  • కెనరా బ్యాంక్ 7.3 శాతం ప్రారంభ రేటుతో రుణాన్ని అందిస్తోంది. బ్యాంకు రుణంపై 0.25 శాతం ప్రాసెసింగ్ ఫీజును వసూలు చేస్తోంది. ఇది కనిష్టంగా రూ. 1000.. గరిష్టంగా రూ. 5000 ఉంటుంది.
  • యాక్సిస్ బ్యాంక్ 7.45 శాతం ప్రారంభ రేటుతో కారు రుణాలను అందిస్తోంది. ఇది కనిష్టంగా 3500.. గరిష్టంగా రూ. 7000 ప్రాసెసింగ్ ఫీజు కలెక్ట్ చేస్తుంది.
  •  SBI 7.2 శాతం ప్రారంభ రేటుతో రుణాన్ని అందిస్తోంది. ప్రత్యేక ఆఫర్ కింద, జనవరి 31, 2022 వరకు లోన్‌పై ప్రాసెసింగ్ ఫీజు లేదు.
  • ICICI బ్యాంక్ లోన్ మొత్తంలో 0.5 శాతం ప్రాసెసింగ్ ఫీజుతో 7.9 శాతం ప్రారంభ రేటుతో రుణాన్ని అందిస్తోంది.

ఇవి కూడా చదవండి: పాడి పరిశ్రమ కోసం స్టార్టప్ పోటీలు.. గెలిచిన వారికి 10 లక్షలు.. రన్నరప్‌కి 7లక్షలు..

Miss World 2021: మిస్ వరల్డ్ పోటీల్లో హైదరాబాదీ యువతి.. ఈ గ్లామర్ గర్ల్‌కు అందమైన రూపమే కాదు.. అందమైన మనసు కూడా.. వివరాల్లోకి వెళ్తే..