AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Paytm Shares: పేటీఎం షేర్ల ధరలలో పతనం..పదివేల కోట్లు కోల్పోయిన ఇన్వెస్టర్లు.. ఎందుకిలా?

దేశంలోని ప్రసిద్ధ సంస్థ పేటీఎం(Paytm) మాతృ సంస్థ అయిన వన్97 (One97) కమ్యూనికేషన్స్ షేర్‌లో భారీ క్షీణత ఉంది.

Paytm Shares: పేటీఎం షేర్ల ధరలలో పతనం..పదివేల కోట్లు కోల్పోయిన ఇన్వెస్టర్లు.. ఎందుకిలా?
Paytm Share Price
KVD Varma
|

Updated on: Dec 15, 2021 | 4:22 PM

Share

Paytm Shares: దేశంలోని ప్రసిద్ధ సంస్థ పేటీఎం(Paytm) మాతృ సంస్థ అయిన వన్97 (One97) కమ్యూనికేషన్స్ షేర్‌లో భారీ క్షీణత ఉంది. ఈ కంపెనీలో యాంకర్ ఇన్వెస్టర్ల లాక్-ఇన్ పీరియడ్ బుధవారంతో ముగిసిందని నిపుణులు చెబుతున్నారు. సాధారణ మాటల్లో చెప్పాలంటే, పెద్ద పెట్టుబడిదారులు ఇప్పుడు తమ షేర్లను విక్రయించవచ్చు. అందుకే స్టాక్ క్షీణించింది. బుధవారం ఈ షేరు 13 శాతం పడిపోయింది. ఈ క్రమంలో ఇన్వెస్టర్లకు రూ.10 వేల కోట్ల నష్టం వాటిల్లింది.

యాంకర్ ఇన్వెస్టర్లకు Paytmలో 5.9% లేదా దాదాపు 3.83 కోట్ల షేర్లు ఉన్నాయి. అక్టోబర్ 2021 నాటికి, కంపెనీ షేర్లలో దాదాపు 76 శాతం ప్రజల మధ్య ట్రేడింగ్ చేయడానికి అందుబాటులో ఉన్నాయి. యాంకర్ లాక్-ఇన్ ప్రారంభ తేదీ అంటే ఈ రోజు(December 15, 2021) ఈ స్టాక్ అమ్మకాల ఒత్తిడిని చూసింది.

అంతకుముందు, లిస్టింగ్ రోజు అంటే నవంబర్ 22, పేటీఎం(Paytm) స్టాక్ 27 శాతం పడిపోయింది. స్టాక్ దాని ఇష్యూ ధర రూ. 2,150 నుంచి 9 శాతం తగ్గింపుతో జాబితా అయింది. మొదటి రెండు ట్రేడింగ్ రోజులలో దాని మార్కెట్ క్యాప్‌లో దాదాపు 40 శాతం క్లియర్ అయింది. పేటీఎంఐపీవో(IPO) భారతదేశ స్టాక్ మార్కెట్ చరిత్రలో అతిపెద్ద ఐపీవో. ఐపీవో ద్వారా కంపెనీ రూ.18300 కోట్లు సమీకరించింది. దీని తర్వాత యాంకర్ ఇన్వెస్టర్లకు లాకిన్ పీరియడ్ ఫిక్స్ చేయడం జరిగింది.

పెట్టుబడిదారులు ఇప్పుడు ఏమి చేయాలి?

రానున్న కొద్ది రోజుల పాటు స్టాక్‌లో క్షీణత కొనసాగవచ్చని ఎస్కార్ట్ సెక్యూరిటీ రీసెర్చ్ హెడ్ ఆసిఫ్ ఇక్బాల్ చెప్పారు. ఇప్పటికే ఉన్న ఇన్వెస్టర్లు స్టాక్‌లోనే ఉండాలి. ప్రతి పతనంలో స్టాక్‌ను కొనుగోలు చేయడం మంచిదని ఆయన సూచిస్తున్నారు. కంపెనీకి ఉన్న అతిపెద్ద సమస్య లాభాలేనని ఆసిఫ్ చెప్పారు. షేరు ధర రూ. 1000 కంటే తక్కువగా ఉంటే, స్టాక్‌లో పెట్టుబడి పెట్టడం మంచిదని ఆయన అంటున్నారు.

పేటీఎం ఆదాయం

కంపెనీ విడుదల చేసిన సమాచారం ప్రకారం జూలై-సెప్టెంబర్ మధ్య కాలంలో కంపెనీ ఆదాయం 64 శాతం పెరిగి రూ.1090 కోట్లకు చేరుకుంది. పేటీఎం(Paytm) లిస్టింగ్ తర్వాత మొదటిసారిగా తన ఆదాయాలను పబ్లిక్‌గా వెల్లడించింది. ఏడాది క్రితం ఇదే కాలంలో 437 కోట్లతో పోలిస్తే 473 కోట్ల ఆదాయంతో నష్టాన్ని కలిగి ఉంది. ఖర్చులు ఏడాది క్రితం ఉన్న 1,170 కోట్ల నుంచి 1,600 కోట్లకు పెరిగాయి.