AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AI Content Rules: ఏఐ కంటెంట్‌పై కొత్త రూల్స్.. కేంద్రం కఠిన నిబంధనలు జారీ.. అమల్లోకి ఎప్పటినుంచంటే..?

ఏఐ జనరేటెడ్ కంటెంట్‌పై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లేబులింగ్‌ను తప్పనిసరి చేసింది. ఇక నుంచి ఏఐ కంటెంట్‌కు స్ఫష్టమైన లేబులింగ్ చేయాల్సి ఉంటుందని కేంద్రం తన నోటిఫికేషన్‌లో పేర్కొంది. తప్పుడు ఏఐ కంటెంట్‌కు అడ్డుకట్ట వేసేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.

AI Content Rules: ఏఐ కంటెంట్‌పై కొత్త రూల్స్.. కేంద్రం కఠిన నిబంధనలు జారీ.. అమల్లోకి ఎప్పటినుంచంటే..?
Ai Content
Venkatrao Lella
| Edited By: |

Updated on: Feb 10, 2026 | 6:17 PM

Share

ఆర్టిఫిషియల్ కంటెంట్‌పై కేంద్ర ప్రభుత్వ సంచలన నిర్ణయం తీసుకుంది. ఏఐ కంటెంట్‌పై కఠిన నియమాలను అమల్లోకి తెస్తున్నట్లు మంగళవారం ప్రకటించింది. ఇందులో భాగంగా ఏఐ కంటెంట్‌కు లేబులింగ్‌ను తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి ఇవాళ అధికారికంగా నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. ఏఐ కంటెంట్‌కు ఇక నుంచి స్పష్టమైన లేబులింగ్ ఉండాలని ఆదేశించింది. స్పష్టమైన, హానికరమైన కంటెంట్‌పై నిషేధం విధిస్తూ దుర్వినియోగాన్ని అరికట్టేందుకు లేబులింగ్ నిబంధన తీసుకొచ్చింది. ఇక ఏఐ కంటెంట్‌ను గుర్తించేందుకు వీలుగా ఐడెంటిఫైయర్‌లను తప్పనిసరి చేస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కొత్త నిబంధనల గురించి ఒకసారి తెలుసుకుందాం.

స్పష్టమైన లేబులింగ్

ఏఐ టూల్స్ ఉపయోగించి తయారుచేసే కంటెంట్‌పై కేంద్రం నియమాలను నోటిఫై చేసింది. ఏఐ కంపెనీలు ఇప్పటికే ఉన్న చట్టాల ప్రకారం నిషేధించబడిన AI మెటీరియల్ క్రియేట్ చేయడం, ప్రచురణ, వ్యాప్తిని అనుమతించకుండా చూసుకోవాలి. ఏఐ ప్లాట్‌ఫారమ్‌లు BNS, POCSOతో సహా ఇతర చట్టాలకు అనుగుణంగా ఏఐ కంటెంట్ వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకోవాలి. పిల్లల లైంగిక వేధింపులతో పాటు అశ్లీలం, అసభ్యకర, లైంగిక విషయాలకు సంబంధించి ఏఐ ఉత్పత్తి చేసిన కంటెంట్‌ను కంపెనీలు అనుమతించకుండా నిషేధించాలి. ఇక తప్పుడు పత్రాలు క్రియేట్ చేయడం, పేలుడు పదార్ధాల అభివృద్ది వంటి కంటెంట్‌ను కూడా నిరోధించాలని కేంద్రం తన ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇందుకోసం ఏఐ కంటెంట్‌ను స్పష్టంగా, ప్రముఖంగా లేబులింగ్ చేయాలని సూచించింది.

సలుభంగా గుర్తించేలా లేబులింగ్

లేబుల్ సులభంగా గుర్తించేందుకు వీలుగా తగినంతంగా గ్రహించే విధంగా ఉండాలి. ఇక అటువంటి కంటెంట్‌ను సృష్టించే, ఉత్పత్తి చేసేవారిని గుర్తించేందుకు ఐడెంటిఫైయర్‌ను కూడా పొందుపర్చాలని కేంద్ర స్పష్టం చేసింది. ఇక ఏఐ లేబులింగ్ మార్చడానికి లేదా తొలగించడానికి వీల్లేకుండా ఉండాలని పేర్కొంది. ఐటీ చట్టంలోని సెక్షన్ 79 ప్రకారం ఏఐ ప్లాట్‌ఫామ్స్ అటువంటి కంటెంట్‌కు యాక్సెస్ తీసివేయడం లేదా పరిమితం చేయవచ్చు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నియమాలు, 2021 పరిధిలోకి AI-జనరేటెడ్ ఆడియో, వీడియో, విజువల్ కంటెంట్‌తో పాటు అధికారికంగా తీసుకురావడం ద్వారా డిజిటల్ గవర్నెన్స్ ఫ్రేమ్‌వర్క్‌ను కేంద్రం కఠినతరం చేసింది. ఫిబ్రవరి 20వ తేదీ నుంచి ఈ నియమాల్లో అమల్లోకి రానున్నాయి. ఇన్పర్మేషన్ టెక్నాలజీ సవరణ నియమాలు 20226 పేరుతో వీటిని ప్రవేశపెట్టింది. ఇటీవల సోషల్ మీడియాలో ఏఐ జనరేటెడ్, డీప్ ఫేక్ వంటి వీడియోలు, ఫొటోలు హల్ చల్ చేస్తున్నాయి. దీంతో ఏది నిజమో.. ఏది అబద్దమో నెటిజన్లు గుర్తించలేకపోతున్నారు. ఇక అసభ్యకరంగా ఫొటోలు క్రియేట్ చేయడం వంటివి చోటుచేసుకుంటున్నాయి. దీనిని నివారించేందుకు కేంద్రం ఏఐ కంటెంట్‌పై ప్రత్యేక దృష్టి పెట్టింది.