AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కాలేజీ వెబ్‌సైట్ హ్యాక్ చేసిన విద్యార్థి.. కేసు పెట్టకుండా.. ఐఐటీ కాన్పూర్ ఇచ్చిన ట్విస్ట్ ఇదే!

సైబర్ సెక్యూరిటీ కోర్సులో ప్రవేశం లభించలేదన్న కారణంతో ఐఐటీ కాన్పూర్ వెబ్‌సైట్‌ను హ్యాక్ చేసిన ఓ విద్యార్థి వ్యవహారం ఆసక్తికర మలుపు తిరిగింది. సాధారణంగా ఇలాంటి ఘటనలపై చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉన్నప్పటికీ, విద్యార్థి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని అతనికి మరో అవకాశం ఇవ్వాలని ఐఐటీ కాన్పూర్ నిర్ణయించింది.

కాలేజీ వెబ్‌సైట్ హ్యాక్ చేసిన విద్యార్థి.. కేసు పెట్టకుండా.. ఐఐటీ కాన్పూర్ ఇచ్చిన ట్విస్ట్ ఇదే!
Iit Kanpur
Balaraju Goud
|

Updated on: Jul 29, 2026 | 10:42 AM

Share

సైబర్ సెక్యూరిటీ కోర్సులో ప్రవేశం లభించలేదన్న కారణంతో ఐఐటీ కాన్పూర్ వెబ్‌సైట్‌ను హ్యాక్ చేసిన ఓ విద్యార్థి వ్యవహారం ఆసక్తికర మలుపు తిరిగింది. సాధారణంగా ఇలాంటి ఘటనలపై చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉన్నప్పటికీ, విద్యార్థి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని అతనికి మరో అవకాశం ఇవ్వాలని ఐఐటీ కాన్పూర్ నిర్ణయించింది.

బీటెక్ సైబర్ సెక్యూరిటీ ప్రోగ్రామ్‌లో ప్రవేశం పొందడంలో విఫలమైన ఓ విద్యార్థి, ఐఐటీ కాన్పూర్ అధికారిక వెబ్‌సైట్‌లోని ఓ భాగాన్ని హ్యాక్ చేశాడు. “సైట్ హ్యాక్ చేయబడింది.. నాకు కావలసిందల్లా ఒక న్యాయమైన అవకాశం మాత్రమే” అనే సందేశాన్ని ఉంచినట్లు ఆరోపణలు వచ్చాయి. అనంతరం సోషల్ మీడియా వేదికలు ఎక్స్, రెడ్డిట్‌లలో హ్యాక్‌కు సంబంధించిన స్క్రీన్‌షాట్‌లను షేర్ చేస్తూ తానే ఈ చర్యకు పాల్పడ్డానని విద్యార్థి ప్రకటించాడు. తన ఉద్దేశం సంస్థకు నష్టం కలిగించడం కాదని, తన సైబర్ సెక్యూరిటీ నైపుణ్యాలను చూపించాలనే ఉద్దేశంతోనే ఇలా చేశానని విద్యార్థి పేర్కొన్నాడు. అయితే అనుమతి లేకుండా ఏ సంస్థ డిజిటల్ వ్యవస్థల్లోకి ప్రవేశించడం సరైన మార్గం కాదని ఐఐటీ కాన్పూర్ స్పష్టం చేసింది.

ఐఐటీ కాన్పూర్ డైరెక్టర్ మనింద్ర అగర్వాల్ మాట్లాడుతూ, ప్రవేశాల ప్రక్రియ ఇప్పటికే పూర్తయిందని, అందులో విధానపరమైన అంశాలు ఉన్నాయని తెలిపారు. అయినప్పటికీ విద్యార్థి భవిష్యత్తును పూర్తిగా దెబ్బతీయకూడదనే ఉద్దేశంతో అతనికి అవకాశం ఇవ్వాలని నిర్ణయించుకున్నామని చెప్పారు. ఐఐటీ కాన్పూర్‌కు చెందిన సైబర్ సెక్యూరిటీ టెక్నాలజీ, ఇన్నోవేషన్ హబ్ అయిన C3iHubలో ఇంటర్న్‌షిప్ కోసం అతడిని పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు. ఐఐటీ కాలేజీ ప్రవేశాల కోసం తమ సామర్థ్యాలను చూపించేందుకు విద్యార్థులకు ఇప్పటికే హ్యాకథాన్‌లు, ఇతర సాంకేతిక అవకాశాలు కల్పిస్తున్నామని అగర్వాల్ తెలిపారు. ఎంపిక ప్రక్రియలో తన ప్రతిభను నిరూపించుకోలేకపోయిన విద్యార్థి, తన నైపుణ్యాలను చూపించేందుకు ఎంచుకున్న మార్గం మాత్రం సరైనది కాదని పేర్కొన్నారు.

ఈ ఘటనపై మొదట ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని అధికారులు భావించినప్పటికీ, చివరకు శిక్షాత్మక చర్యల కంటే మార్గదర్శక అవకాశం కల్పించాలనే నిర్ణయానికి వచ్చారు. అయితే భవిష్యత్తులో ఇలాంటి చర్యలను ప్రోత్సహించబోమని, సైబర్ సెక్యూరిటీ రంగంలో ఎదగాలనుకునే వారు ఎథికల్ హ్యాకింగ్, బాధ్యతాయుతమైన సమాచార వెల్లడి వంటి చట్టబద్ధమైన మార్గాలను అనుసరించాలని ఐఐటీ కాన్పూర్ సూచించింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
శ్రీహరి చనిపోయిన తర్వాత క్లోజ్ ఫ్రెండ్సే సగం ఆస్తులు కాజేశారు
శ్రీహరి చనిపోయిన తర్వాత క్లోజ్ ఫ్రెండ్సే సగం ఆస్తులు కాజేశారు
శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. భక్తులకు టీటీడీ కీలక సూచనలు!
శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. భక్తులకు టీటీడీ కీలక సూచనలు!
వరలక్ష్మి వత్రం.. తాంబూలం ఇచ్చేటప్పుడు ఈ తప్పులు చేస్తే అశుభం!
వరలక్ష్మి వత్రం.. తాంబూలం ఇచ్చేటప్పుడు ఈ తప్పులు చేస్తే అశుభం!
రాత్రివేళ నడిరోడ్డుపై వింత ఆకారం.. దగ్గరికెళ్లగా గుండె ఆగినంతపనైం
రాత్రివేళ నడిరోడ్డుపై వింత ఆకారం.. దగ్గరికెళ్లగా గుండె ఆగినంతపనైం
బజాజ్ నుంచి అదిరిపోయే లుక్‌తో కొత్త తరహా బైక్
బజాజ్ నుంచి అదిరిపోయే లుక్‌తో కొత్త తరహా బైక్
'చెత్త నిర్వహణ బాధ్యత ప్రతి ఒక్కరిది.. కఠిన చర్యలు తీసుకోండి'
'చెత్త నిర్వహణ బాధ్యత ప్రతి ఒక్కరిది.. కఠిన చర్యలు తీసుకోండి'
బంగారం ధరలపై బాంబ్ పేల్చే న్యూస్.. ఇవాళ రికార్డ్ స్థాయి పెరుగుదల
బంగారం ధరలపై బాంబ్ పేల్చే న్యూస్.. ఇవాళ రికార్డ్ స్థాయి పెరుగుదల
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. భారీగా పెరిగిన RRB ఉద్యోగాలు!
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. భారీగా పెరిగిన RRB ఉద్యోగాలు!
ఇంతకీ హార్దిక్ ముంబై ఇండియన్స్‌ లో ఉన్నట్లా ? లేనట్లా ?
ఇంతకీ హార్దిక్ ముంబై ఇండియన్స్‌ లో ఉన్నట్లా ? లేనట్లా ?
కాంగ్రెస్‌లో సుస్మితా వ్యాఖ్యల దుమారం..
కాంగ్రెస్‌లో సుస్మితా వ్యాఖ్యల దుమారం..
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర