AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sneha Reddy : అల్లు స్నేహారెడ్డి సరికొత్త ట్రెండ్.. డిజిటల్ ఐకాన్‏గా ప్రత్యేక గుర్తింపు..

పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రస్తుతం ఆయన రాకా చిత్రీకరణలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే బన్నీ సతీమణి అల్లు స్నేహారెడ్డి సైతం సినీ ప్రియులకు సుపరిచితమే. ప్రపంచానికి ఆమె స్టార్ హీరో సతీమణిగా పరిచయమైనప్పటికీ.. అటు తల్లిగా, ఇటు బిజినెస్ ఉమెన్ గా, సోషల్ మీడియా సెలబ్రెటీగా తనకంటూ ప్రత్యేకమైన బ్రాండ్ సృష్టించుకున్నారు.

Sneha Reddy : అల్లు స్నేహారెడ్డి సరికొత్త ట్రెండ్.. డిజిటల్ ఐకాన్‏గా ప్రత్యేక గుర్తింపు..
Allu Arjun, Sneha Reddy
Rajitha Chanti
|

Updated on: Sep 29, 2026 | 6:19 PM

Share

పాన్ ఇండియా స్టార్ హీరో అల్లు అర్జున్ సతీమణి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ నిత్యం తన ఫోటోషూట్లతోపాటు పిల్లలకు సంబంధించిన ఫోటోస్, ఫ్యామిలీ ఈవెంట్స్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులకు దగ్గరవుతూ ఉంటారు. అయితే స్నేహా రెడ్డి అంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది స్టార్ హీరో అల్లు అర్జున్ భార్యగానే. కానీ ఇప్పుడు ఆమె తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అటు బన్నీ సతీమణిగా ప్రతి క్షణం అల్లు అర్జున్ తోడుగా ఉంటూనే.. మరోవైపు వ్యాపారవేత్తగా, తన పిల్లలకు తల్లిగా, ఫిట్‌నెస్‌ ప్రియురాలిగా, డిజిటల్ పర్సనాలిటీగా స్నేహా రెడ్డి తనకంటూ ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్నారు. అంతేకాదు నిత్యం నెట్టింట చాలా యాక్టివ్ గా ఉంటూ ఏదోక పోస్ట్ చేస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటారు. అందుకే ఆమె సోషల్ మీడియాలో ఆమెకు 91 లక్షలకు పైగా ఫాలోవర్లు ఉన్నారు.

ఎక్కువ మంది చదివినవి : Trending Song : ఏముంది రా బాబూ పాట.. 2 రోజులుగా యూట్యూబ్‏ను ఊపేస్తున్న ఫోక్ సాంగ్.. డీజేలో మోత మోగిపోద్ది..

ఇదిలా ఉంటే.. స్నేహా రెడ్డి నిర్వహిస్తున్న పికాబూ (Picaboo) స్టూడియో ఆమె వ్యాపార ప్రయాణంలో ముఖ్యమైన భాగంగా ఉంది. మరోవైపు ఫిట్‌నెస్, ఆరోగ్యంపై కూడా ఆమె ప్రత్యేక శ్రద్ధ చూపుతారు స్నేహా రెడ్డి. తరచూ తన వర్కౌట్స్, యాక్టివ్ లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. అలాగే మహిళలకు కావాల్సిన ఫిట్నెస్, ఆరోగ్య టిప్స్ కూడా చెప్తుంటారు. ఎప్పుడూ బిజీగా ఉండే ఆమె.. తన కుటుంబానికి కూడా స్నేహా రెడ్డి ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. తన పిల్లలతో కలిసి గడిపే అందమైన క్షణాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. అలాగే ఆమె షేర్ చేసే ట్రావెల్, ఫ్యాషన్, లైఫ్‌స్టైల్ పోస్టులకు కూడా మంచి ఆదరణ లభిస్తోంది.

ఎక్కువ మంది చదివినవి : ఆ హీరోయిన్ అంటే చాలా ఇష్టం.. ఆమె నుదుటన సూది మొనంత ప్రేమ రాయలేదు ఆ దేవుడు..

అల్లు అర్జున్‌తో వివాహం కారణంగా స్నేహా రెడ్డి దేశంలోని ప్రముఖ సెలబ్రిటీ కుటుంబాల్లో ఒకటైన అల్లు కుటుంబంలో భాగమయ్యారు. అయితే కాలక్రమంలో ఆమె తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరుచుకున్నారు. వ్యాపారం, కుటుంబం, ఫిట్‌నెస్, ట్రావెల్, సోషల్ మీడియా ఇలా అన్ని రంగాలను సమతూకంగా కొనసాగిస్తూ స్నేహా రెడ్డి తనకంటూ ప్రత్యేకమైన అభిమాన వర్గాన్ని సంపాదించుకున్నారు. ప్రస్తుతం ఆమెను అల్లు అర్జున్ భార్యగా మాత్రమే కాకుండా విజయవంతమైన వ్యాపారవేత్తగా, ప్రముఖ డిజిటల్ సెలబ్రిటీగా కూడా గుర్తిస్తున్నారు.

ఎక్కువ మంది చదివినవి : Roja: ఆ హీరో అంటే చాలా ఇష్టం.. ఆయనతో చాలా సినిమాలు చేశా.. హీరోయిన్ రోజా..

అల్లు స్నేహారెడ్డి..

ఎక్కువ మంది చదివినవి : Cinema OTT: నిజమైన కథతో వచ్చిన 8 ఎపిసోడ్స్ సిరీస్.. 60 దేశాలలో నంబర్ వన్.. ఒక్కసారి చూస్తే అస్సలు వదలరు..

Follow Us