AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bank Holidays: నవంబర్‌లో బ్యాంకులకు భారీగా సెలవులు.. ఈ రోజుల్లో పూర్తిగా బంద్.. ఎప్పుడెప్పుడంటే..?

నవంబర్‌లో దీపావళి, లక్ష్మీపూజ, గురునానక్ జయంతి సందర్భంగా బ్యాంకులు ఎక్కువ రోజులు బంద్ కానున్నాయి. దీంతో వచ్చే నెలలో బ్యాంకులను సంప్రదించాలనుకునేవారు ఈ సెలవుల గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది. బ్యాంకులు మూతపడటం వల్ల చెక్కుల క్లియరెన్స్, బ్యాంకుల ద్వారా చేసే విత్ డ్రాలు, డిపాజిట్లు నిలిచిపోనున్నాయి.

Bank Holidays: నవంబర్‌లో బ్యాంకులకు భారీగా సెలవులు.. ఈ రోజుల్లో పూర్తిగా బంద్.. ఎప్పుడెప్పుడంటే..?
Bank Holidays
Venkatrao Lella
|

Updated on: Oct 29, 2026 | 6:46 AM

Share

అక్టోబర్ ముగిసి నవంబర్ నెల రావడానికి మరో రెండ్రోజులే మిగిలి ఉంది. వచ్చే నెలలో దీపావళితో పాటు ఛత్ పూజ, లక్ష్మీపూజ, గురునానక్ జయంతి, కార్తీక పౌర్ణమి లాంటి పలు ముఖ్య పండుగలు వస్తున్నాయి. దీంతో బ్యాంక్‌లకు భారీగా సెలవులు రానున్నాయి. దీంతో ముఖ్యంగా నవంబర్‌లో బ్యాంక్ లావాదేవీలను ప్లాన్ చేసుకునేవారు హాలీడేస్ గురించి ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరముంది. వివిధ పండగలు, జాతీయ సెలవులు, రెండో, నాలుగో శనివారం, ఆదివారం లాంటి వీకెండ్ హాలీడేస్ వల్ల బ్యాంకులు చాలా రోజులు మూతపడనున్నాయి. రిజర్వ్ బ్యాంక్ క్యాలెండర్ ప్రకారం నవంబర్ నెలలో బ్యాంక్ సెలవుల గురించి ఒకసారి తెలుసుకుందాం.

నవంబర్‌లో బ్యాంక్ సెలవులు ఇవే..

-నవంబర్ 1 ఆదివారం సందర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంకులు ఉండవు

-నవంబర్ 8న ఆదివారం బ్యాంక్‌లకు సాధారణ సెలవు

-నవంబర్ 9న  దీపావళి, లక్ష్మీ పూజ, గోవర్ధన పూజ, త్రిపుర సందర్భంగా మధ్యప్రదేశ్, చండీగఢ్, సిక్కీం, మణీపుర్, రాజస్థాన్, ఉత్తర్ ప్రదేశ్‌లలో బ్యాంకులు ఉండవు

-నవంబర్ 10న లక్ష్మీపూజ, విక్రమ్ సంవంత్ న్యూ ఇయర్ సందర్భంగా గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, ఉత్తరాఖండ్, సిక్కీంలో బ్యాంకులకు సెలవులు

-నవంబర్ 11న లక్ష్మీపూజ, నింగోల్ ఛకౌబా, బైదూజ్, చిత్రగుప్త జయంతి సందర్భంగా సిక్కీం, మణిపుర్, ఉత్తర్ ప్రదేశ్, వెస్ట్ బెంగాల్, హిమాచల్ ప్రదేశ్‌లలో బ్యాంకులు బంద్

-నవంబర్ 13న వంగల పండుగల సందర్భంగా మేఘాలయాలో బ్యాంకులకు సెలవు ప్రకటించారు

-నవంబర్ 14న రెండో శనివారం సందర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంకులు బంద్

-నవంబర్ 15వ తేదీన ఆదివారం సాధారణ సెలవు

-నవంబర్ 16న ఛట్ పూజ్ సందర్భంగా బీహార్, జార్ఖండ్‌లలో బ్యాంకులు మూతపడనున్నాయి

-నవంబర్ 20న శుక్రవరాం ఉత్తరాఖండ్‌లో బ్యాంకులు బంద్ కానున్నాయి

-నవంబర్ 22వ తేదీన ఆదివారం కావడంతో దేశవ్యాప్తంగా బ్యాంకులకు సాధారణ సెలవుదినం

-నవంబర్ 24న గురునానక్ జయంతి, కార్తిక పౌర్ణమి సందర్భంగా మిజోరాం, మహారాష్ట్ర, మధ్య ప్రదేశ్, ఒడిసా, చండీగఢ్, ఉత్తరాఖండ్, తెలంగాణ, అరుణాచల్ ప్రదేశ్, రాజస్థానం, జమ్ము, నాగాలాండ్, వెస్ట్ బెంగాల్, ఉత్తర్ ప్రదేశ్, ఢిల్లీ, ఛత్తీస్‌గఢ్, ఝార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్, శ్రీనగర్ రాష్ట్రాల్లో బ్యాంకులు మూతపడనున్నాయి

-నవంబర్ 27వ తేదీన కనకదాస జయంతి రోజున కర్ణాటకలో బ్యాంకులు ఉండవు

-నవంబర్ 28 నాలుగో శనివారం బ్యాంకులకు సెలవు

-నవంబర్ 29వ తేదీన ఆదివారం దేశవ్యాప్తంగా బ్యాంకులు బంద్

సెలవు రోజుల్లో ఏవేవి మూతపడతాయి..?

సెలవు రోజుల్లో పాయింట్ ఆఫ్ సేల్ విత్ డ్రాలు, చెక్కుల క్లియరెన్స్, భౌతికంగా జరిగిన లోన్ ప్రాసెస్ వంటివి నిలిచిపోతాయి. బ్యాంకులను సంప్రదించే ముందు ఒకసారి సెలవుల జాబితాను చూడటం మంచిది.

Follow Us