Gold Prices: దీపావళి పండక్కి ముందే గోల్డ్ లవర్స్‌కి షాక్.. ఒక్కసారిగా పేలిన బాంబ్.. ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంతంటే..?
దీపావళి పండుగ వస్తున్న క్రమంలో దేశంలో బంగారం ధరలు పెరుగుతున్నాయి. పెళ్లిళ్ల సీజన్, పండుగ డిమాండ్ కారణంగా ధరలు ఎగబాకుతున్నాయి. దీంతో కొనుగోలుదారుల షాక్ అవుతున్నారు. పండుగల కారణంగా రానున్న రోజుల్లో కూడా ఇదే పెరుగుదల ఉంటుందని కొంతమంది నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

పసిడి ప్రియులకు షాకింగ్ న్యూస్. బంగారం ధరలు ఈ వారం ప్రారంభం నుంచే పుంజుకుంటున్నాయి. సోమవారం నుంచి ధరలు ఎగబాకుతూనే ఉన్నాయి. మరికొద్ది రోజుల్లోనే దీపావళి ఉండటంతో పండుగ కారణంగా కొనుగోళ్లు పెరగడంతో డిమాండ్ దృష్ట్యా ధరలు పెరుగుదుల నమోదు చేసుకుంటున్నట్లు ఆర్ధిక రంగ నిపుణులు చెబుతున్నారు. మరికొన్ని రోజుల పాటు ఇదే బాటలో నడిచే అవకాశముందనే వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలో పెళ్లిళ్ల సీజన్ కూడా రానున్న క్రమంలో బంగారంకు డిమాండ్ పెరగనుందని, దీని కారణంగా ధరల్లో పెరుగుదల కొనసాగే అవకాశముందని అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలో అక్టోబర్ 29వ తేదీన గురువారం కూడా ధరలు పెరిగాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో గోల్డ్, సిల్వర్ ధరలు ఎలా ఉన్నాయనేది చూద్దాం.
నేటి గోల్డ్ రేట్లు ఇవే..
-హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల స్వచ్చమైన బంగారం ధర రూ.1,43,960 వద్ద కొనసాగుతోండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,31,960గా ట్రేడవుతోంది.
-విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,43,960గా కొనసాగుతోండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,31,960 వద్ద ట్రేడవుతోంది.
-దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,44,110 పలుకుతుండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,32,110గా కొనసాగుతోంది.
-చెన్నైలో 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,43,960కు లభిస్తోండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,31,960 వద్ద ట్రేడవుతోంది.
-బెంగళూరులో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,43,960 వద్ద కొనసాగుతోండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,31,960గా ట్రేడవుతోంది.
వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..?
అయితే బంగారంతో పాటు పోలిస్తే వెండి ధరలు మాత్రం కాస్త భిన్నంగా ఉన్నాయి. వెండి ధరలు స్వల్పంగా పడిపోయాయి.
-చెన్నైలో కిలో వెండి ధర రూ.2,19,900 వద్ద కొనసాగుతోండగా.. నిన్న ఈ రేటు రూ.2.20 లక్షలుగా ఉంది.
-హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో కిలో సిల్వర్ ధర రూ.2,19,900 పలుకుతోంది.
-ఢిల్లీలో కిలో వెండి రేటు రూ.2,19,900 వద్ద ట్రేడవుతోంది.
-బెంగళూరులో కిలో వెండి రేటు రూ.2,19,900గా ఉంది.
