AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పూనకంతో ఊగిపోతూ.. 6 నిమిషాల్లో 4 లీటర్ల నీళ్లు తాగిన నటి

పూనకంతో ఊగిపోతూ.. 6 నిమిషాల్లో 4 లీటర్ల నీళ్లు తాగిన నటి

Phani CH
|

Updated on: Feb 10, 2026 | 6:13 PM

Share

బుల్లితెర నటి సుధా చంద్రన్ తన నటనకు పూర్తిగా అంకితమైనప్పుడు కలిగిన ఒక వింత అనుభవాన్ని పంచుకున్నారు. 'మాతా కీ చౌకీ' షూటింగ్ సమయంలో పాత్రలో లీనమై, 6 నిముషాల్లో 4 లీటర్ల నీరు తాగేశారు. ఇది భక్తి పారవశ్యం, ఆధ్యాత్మిక అనుభూతిగా ఆమె అభివర్ణించారు. ఆమె అంకితభావం, దృఢ సంకల్పం మయూరి నుండి నేటి వరకు ఆమె ప్రస్థానాన్ని ప్రత్యేకంగా నిలబెట్టాయి.

బుల్లితెర నటి సుధా చంద్రన్ అంటే తెలియనివారుండరు. సింగీతం శ్రీనివాస రావు దర్శకత్వంలో 1984లో వచ్చిన తెలుగు సూపర్ డూపర్ హిట్ ‘మయూరి’లో తన అద్భుత నాట్య ప్రదర్శనతో ఈమె మన తెలుగు ప్రేక్షకులకు చేరువైంది. అనంతరం 1984-2019 వరకూ తమిళ, హిందీ, మరాఠీ, బోజ్ పురి, మళయాల భాషల్లో అనేక చిత్రాల్లో నటించి నృత్య కళాకారిణిగా పేరు సంపాదించింది. ఇక టీవీ రంగంలో 1993లో అడుగుపెట్టి హిందీ, మళయాలం, తమిళ భాషల్లో 50కి పైగా సీరియల్స్‌లో అద్భుత నటనను ప్రదర్శించింది. ఇక పలు టీవీ డాన్స్ షో కార్యక్రమాలకు హోస్ట్‌గానూ చేసి పేరు గాంచారు సుధా చంద్రన్. తాజాగా ఆమె పంచుకున్న వింత అనుభవం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఓ షూటింగ్ సమయంలో ఆమె ఒక రకమైన పారవశ్యంలోకి వెళ్లిపోయి, తనకు తెలియకుండానే భారీ మొత్తంలో నీటిని తాగేశారు. ఈ ఘటన వెనుక ఉన్న ఆధ్యాత్మిక కోణం ఏమిటి? ఆ సమయంలో ఆమె అనుభూతి ఎలా ఉంది? అన్నది వివరంగా చెప్పారు. ‘మాతా కీ చౌకీ’ సీరియల్ షూటింగ్ సమయంలో జరిగిన ఘటన ఆమెను ఇప్పటికీ ఆశ్చర్యపరుస్తోంది. ఆ సీరియల్‌లో ఆమె ఒక భక్తురాలి పాత్రలో నటిస్తున్నప్పుడు, పూజలో భాగంగా నీటిని తాగే దృశ్యం ఉంది. అయితే, కెమెరా రోల్ అవుతున్నప్పుడు ఆమె పూర్తిగా చుట్టూ ఎవరు వున్నారు అన్నది మరిచిపోయి, ఒక రకమైన ట్రాన్స్‌లోకి వెళ్లిపోయారు. కేవలం 6 నిమిషాల వ్యవధిలోనే ఆమె ఏకంగా 4 లీటర్ల నీటిని తాగేశారు. ఆ సమయంలో అక్కడ ఉన్న యూనిట్ సభ్యులంతా ఆమెను చూసి షాకయ్యారు. సాధారణంగా ఒక వ్యక్తి అంత తక్కువ సమయంలో అంత నీరు తాగడం అసాధ్యం, కానీ ఆ సమయంలో ఆమెలో ఏదో తెలియని శక్తి ప్రవేశించినట్లు అనిపించిందని ఆమె స్వయంగా అన్నారు. తను ఆ సమయంలో స్పృహలోనే లేననీ పాత్రలో లీనమైపోయాననీ తెలిపారు. ఆరు నిమిషాల పాటు తనొక ఆధ్యాత్మిక స్థితిలో ఉన్నాననీ దర్శకుడు ‘కట్’ చెప్పే వరకు కూడా తను ఎంత నీరు తాగాను అన్న విషయం గమనించలేదనీ అన్నారు. నటనలో లీనమైనప్పుడు లేదా భక్తి పారవశ్యంలో ఉన్నప్పుడు మనిషి శారీరక పరిమితులను దాటి ప్రవర్తిస్తారనడానికి ఈ ఘటన ఒక నిదర్శనగా నిలిచిందని అన్నారామె. తన నటనను కేవలం వృత్తిలా కాకుండా ఒక తపస్సులా భావించడం వల్లే ఇలాంటి అద్భుతాలు జరుగుతాయని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ప్రమాదంలో కాలు కోల్పోయినా వెనకడుగు వేయకుండా కృత్రిమ కాలితో ప్రపంచ ప్రఖ్యాత నర్తకిగా ఎదిగిన ఆమె ధైర్యం మనందరికీ తెలిసిందే. ఇప్పుడు ఈ తాజా ఘటన ద్వారా ఆమెలోని ఆధ్యాత్మిక కోణం వృత్తి పట్ల ఆమెకు ఉన్న అంకితభావం మరోసారి చర్చనీయాంశమయ్యాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

బర్డ్ ఫ్లూ కలకలం.. ఆ జిల్లాలో హై అలర్ట్

అంగన్‌వాడి చిన్నారులకు పాఠాలు చెప్పిన ఐఏఎస్

Prabhas: డార్లింగ్ ఫ్యాన్స్‌కు షాక్‌.. కల్కి-2 ఇప్పట్లో లేనట్టేనా ??

సంక్రాంతి బరిలో నాగ్, నాగచైతన్య మల్టీ స్టారర్

సిల్వర్‌ స్క్రీన్ మీద పెరుగుతున్న హింస