AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Allu Arjun : ఆ కామెంట్స్ లో అసలు నిజమే లేదు.. రూమర్స్ పై అల్లు అర్జున్ టీమ్ రియాక్షన్..

అల్లు అర్జున్ లాంటి హీరోతో యాడ్ షూటింగ్ చేయాలంటే పలు నిబంధనలు ఉంటాయని బ్రాండ్ స్ట్రాటజర్ కావేరీ బారువా చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ కామెంట్స్ పై హీరో టీమ్ స్పందించింది. అందులో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేసింది. అవాస్తవ ప్రచారాన్ని నమ్మొద్దని కోరింది. ఇంతకీ ఏం జరిగిందంటే..

Allu Arjun : ఆ కామెంట్స్ లో అసలు నిజమే లేదు.. రూమర్స్ పై అల్లు అర్జున్ టీమ్ రియాక్షన్..
Allu Arjun
Rajitha Chanti
|

Updated on: Feb 10, 2026 | 6:38 PM

Share

పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ పుష్ప మూవీతో ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయిన సంగతి తెలిసిందే. పుష్ప 1, 2 చిత్రాలతో వరల్డ్ వైడ్ తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ హీరో ప్రస్తుతం డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేస్తున్నారు. ఇందులో దీపికా పదుకొణె కథానాయికగా నటిస్తుంది. కొన్ని నెలలుగా ఈ మూవీ షూటింగ్ వేగంగా జరుగుతుంది. ఇదిలా ఉంటే.. ఇటీవలే బ్రాండ్ స్ట్రాటజర్ కావేరీ బారువా ఓ పాడ్ కాస్ట్ లో మాట్లాడుతూ బన్నీతో షూటింగ్ చేయడం గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. ఆయనతో యాడ్ షూట్ చేయాలంటే పలు నిబంధనలు ఉంటాయని చెప్పుకొచ్చింది. తాజాగా ఈ కామెంట్స్ పై అల్లు అర్జున్ టీమ్ స్పందించింది. ఆమె చేసిన వ్యాఖ్యలలో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేసింది. ఇలాంటి అవాస్తవ ప్రచారాన్ని నమ్మొద్దని కోరింది.

ఎక్కువ మంది చదివినవి: JD Chakravarthi: అది బూతు పాట అని నాకు తెలీదు.. ఒక్కసారిగా షాకయ్యా.. నటుడు జేడీ చక్రవర్తి.

“అల్లు అర్జున్ గురించి ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో ప్రసారమవుతున్న ఒక వీడియోలో చేసిన ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవి. అసత్యమైనవి. ఈ విధమైన తప్పుడు ప్రచారాన్ని మేము అత్యంత తీవ్రంగా పరిగణిస్తున్నాము. బాధ్యులపై చట్టపరమైన చర్యం తీసుకుంటాం. ” అంటూ నోట్ విడుదల చేసింది అల్లు అర్జున్ టీమ్.

ఎక్కువ మంది చదివినవి: Director Rajamouli : అతడి కోసం 15 ఏళ్లుగా వెయిటింగ్.. ఎప్పుడెప్పుడు కలిసి సినిమా చేద్దామా అని చూశా.. ఎస్ఎస్ రాజమౌళి..

విషయానికి వస్తే.. ఇటీవల కావేరి బారువా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..”ఒక్కొక్కరికి ఒక్కో విధమైన వ్యక్తిత్వం ఉంటుంది. అల్లు అర్జున్ తో యాడ్ సందర్భంగా రకమైన అనుభవం నేను ఎదుర్కొన్నాను. దక్షిణాది హీరోలతో షూట్ చేయాలంటే కొన్ని నిబంధనలు పాటించాలి. ఎం చేయాలి… ఏం చేయకూడదు అని 42 నిబంధనలు ఉంటాయి. ఈ విషయంలో మేనేజర్లు చాలా కఠినంగా ఉంటారు.  ” అని చెప్పుకొచ్చింది. తాజాగా ఆమె కామెంట్స్ పై అల్లు అర్జున్ టీమ్ స్పందించింది.

ఎక్కువ మంది చదివినవి: Folk Song : ఏం పాట రా బాబు.. యూట్యూబ్‏ను షేక్ చేస్తున్న ఫోక్ సాంగ్.. వింటే స్టెప్పు వేయాల్సిందే..

ఎక్కువ మంది చదివినవి: Tollywood : టీమిండియాలో తోపు క్రికెటర్.. ఒక్క తప్పుతో తీహార్ జైలుకు.. ఇప్పుడు హీరోగా రచ్చ..

Follow Us