AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Union Budget 2026: బడ్జెట్‌లో ఏపీ, తెలంగాణకు ఏం వచ్చాయంటే..? కీలక కేటాయింపులు ఇవే..

బడ్జెట్‌లో తెలంగాణ, ఏపీకి పలు కేటాయింపులు జరిగాయి. తెలుగు రాష్ట్రాల్లోని పలు అభివృద్ది ప్రాజెక్టులకు నిధులు కేటాయించారు. ప్రధానంగా హైదరాబాద్ నుంచి హైస్పీడ్ రైలు కారిడార్లను ప్రకటించారు. అయితే ఏపీలో అమరావతికి ప్రత్యేక నిధులు కేటాయించకపోగా.. హైదరాబాద్ మెట్రోకు కూడా ఎలాంటి నిధులు లేవు.

Union Budget 2026: బడ్జెట్‌లో ఏపీ, తెలంగాణకు ఏం వచ్చాయంటే..? కీలక కేటాయింపులు ఇవే..
Budget Telugu States
Venkatrao Lella
|

Updated on: Feb 01, 2026 | 1:22 PM

Share

కేంద్ర బడ్జెట్ 2026లో తెలుగు రాష్ట్రాలకు పలు కేటాయింపులు జరిగాయి. హైస్పీడ్ రైలు కారిడార్లతో పాటు టూరిజం,  రేర్ ఎర్త్ కారిడార్లు వంటివి ప్రకటించారు. హైదరాబాద్ నుంచి బెంగళూరు, చెన్నై, పూణె మధ్య హైస్పీడ్ కారిడార్లు నిర్మించనుగా.. ఏపీలో రేర్ ఎర్త్ కారిడార్లను నిర్మించనున్నారు. బడ్జెట్‌లో తెలుగు రాష్ట్రాల్లోని పలు అభివృద్ది పనులకు నిధులను కేటాయించారు. దీంతో తెలుగు రాష్ట్రాలకు కాస్త ఊరట కలిగినట్లయింది. 2026-27 ఆర్ధిక సంవత్సరం బడ్జెట్‌లో తెలుగు రాష్ట్రాలకు అసలు ఏం కేటాయింపులు జరిగాయి అనేది వివరంగా చూద్దాం.

తెలుగు రాష్ట్రాలకు కేటాయింపులు ఇవే..

-ఏకో-ట్రయల్స్, మౌంటైన్ ట్రెక్కింగ్

-అరకు వ్యాలీలో పర్యావరణ అనుకూలమైన మౌంటైన్ ట్రయల్స్ అభివృద్ధి చేయనున్నారు

– ట్రెక్కింగ్, హైకింగ్ కోసం కొత్త డెస్టినేషన్‌గా అరకును గుర్తించారు.

-బర్డ్-వాచింగ్ టూరిజం

-పులికట్ లేక్ (ఆంధ్రప్రదేశ్, తమిళనాడు సరిహద్దు) వద్ద బర్డ్-వాచింగ్ ట్రయల్స్ అభివృద్ధి చేసి నేచర్ టూరిజం, స్థానిక ఉపాధి (గైడ్లు, హోమ్‌స్టేలు) క్లస్టర్‌గా తీర్చిదిద్దనున్నారు

-బౌద్ధ/హెరిటేజ్ టూరిజం

-నార్త్-ఈస్ట్‌లో బౌద్ధ సర్క్యూట్లు, దేశవ్యాప్తంగా 15 ఆర్కియాలజికల్ సైట్ల అభివృద్ధి పథకం ఉంది

-ఆంధ్రప్రదేశ్‌లోని పులికాట్, అరకు హెరిటేజ్-నేచర్ టూరిజం ద్వారా ప్రయోజనం పొందుతాయి

హై-స్పీడ్ రైల్ కారిడార్లు

1. పూణే-హైదరాబాద్

2. హైదరాబాద్-బెంగళూరు

3. హైదరాబాద్-చెన్నై కారిడార్లు ప్రతిపాదన

4.హైదరాబాద్‌కు ప్రత్యక్ష ప్రయోజనం, దక్షిణ ఆంధ్రకు పరోక్షంగా కనెక్టివిటీ

ఈస్ట్ కోస్ట్ ఇండస్ట్రియల్ కారిడార్ (పూర్వోదయ)

-తూర్పు తీరంలో ఇంటిగ్రేటెడ్ కారిడార్ – దుర్గాపూర్ నోడ్‌తో. ఆంధ్ర తీర ప్రాంతం పోర్టులు, ఇండస్ట్రీ, లాజిస్టిక్స్‌లో ప్రధాన లబ్ధిదారు

రేర్ ఎర్త్ కారిడార్లు

-ఓడిశా, కేరళ, ఆంధ్రప్రదేశ్ , తమిళనాడు రాష్ట్రాల్లో రేర్ ఎర్త్ మినరల్స్ మైనింగ్, ప్రాసెసింగ్, రీసెర్చ్, మాన్యుఫాక్చరింగ్ క్లస్టర్

అమరావతికి నిధులేవి

అయితే బడ్జెట్‌లో ఏపీ రాజధాని అమరావతికి నిధులు కేటాయిస్తారేమోని ప్రజలు ఆశించారు. ఎందుకంటే ఇటీవల పార్లమెంట్‌లో కేంద్రం ప్రకటించిన ఎకనామిక్ సర్వేలో కూడా అమరావతి ప్రస్తావన కేంద్రం తీసుకొచ్చింది. అమరావతి లాంటి కొత్త రాజధానుల నిర్మాణం దేశంలో జరగాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. దీంతో అమరావతికి భారీగా నిధులు ప్రకటనుందనుంది, అదోక సంకేతం అని అందరూ భావించారు. కానీ బడ్జెట్‌లో అమరావతికి ఒక్క రూపాయి కూడా నిధులు కేటాయించకపోవడంతో ఆశలు ఆడియశలయ్యాయి. ఇక హైదరాబాద్ మెట్రో విస్తరణ కోసం నిధులు కేటాయించాలని రేవంత్ సర్కార్ ఎప్పటినుంచో డిమాండ్ చేస్తోంది. కానీ హైదరాబాద్ మెట్రో విస్తరణకు కూడా ఎలాంటి నిధులు కేటాయింలేదు. ఇక తెలంగాణలోని వివిధ ప్రాజెక్టులకు కూడా ఎలాంటి నిధులు కేటాయించకపోవడంతో మరోసారి బడ్జెట్‌లో రాష్ట్రానికి షాక్ తగిలినట్లయింది.