AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Union Budget 2026: కేంద్ర బడ్జెట్‌లో మహిళలకు అదిరిపోయే శుభవార్త.. ప్రత్యేక పథకాలు ఇవే..

కేంద్ర బడ్జెట్‌లో మహిళలకు శుభవార్త తెలిపారు. బడ్జెట్‌లో మహిళల కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టారు. ప్రతీ జిల్లాలో బాలికలకు ఒక హాస్ట‌ల్‌తో పాటు మహిళల కోసం ప్రత్యేక షీ మార్ట్‌లు నెలకొల్పనున్నారు. ఇంకా స్కూళ్లల్లో క్రియేటర్స్ ల్యాబ్‌పై ప్రకటన చేశారు. వీటి వివరాలు

Union Budget 2026: కేంద్ర బడ్జెట్‌లో మహిళలకు అదిరిపోయే శుభవార్త.. ప్రత్యేక పథకాలు ఇవే..
Womens
Venkatrao Lella
|

Updated on: Feb 01, 2026 | 12:23 PM

Share

కేంద్ర బడ్జెట్‌లో మహిళలకు పెద్ద పీట వేశారు. దేశవ్యాప్తంగా మహిళా స్వయం సహాయక సంఘాల కోసం షీ మార్ట్స్ ఏర్పాటు చేయనున్నట్లు ఆర్ధికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. కమ్యూనిటీ యాజమాన్యంలోని రిటైల్ అవుట్‌లెట్లుగా షీ మార్ట్స్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. మహిళా వ్యాపారవేత్తలు క్రెడిట్ లింక్డ్ ఉత్పత్తులు, వినూత్న ఆర్ధిక సాధనాలను పొందేందుకు వీటిని ప్రవేశపెట్టనున్నట్లు స్పష్టం చేశారు. అలాగే వెట్ కాలేజీల కోసం లోన్ లింక్డ్ క్యాపిటల్ సబ్సిడీ సపోర్ట్ స్కీమ్‌ను బడ్జెట్‌లో ప్రకటించారు.

ప్రతి జిల్లాలో ఒక బాలికల హాస్టల్

అటు కేంద్ర ప్రభుత్వం తరపున దేశంలోని ప్రతి జిల్లాలో ఒక బాలిక హాస్టల్‌ను నెలకొల్పనున్నట్లు నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఇవి బాలికలకు ఎంతో ఉపయోగపడనున్నాయి. పేద, సామాన్య కుటుంబాల్లోని బాలికలకు వీటి ద్వారా ప్రయోజనం కలగనుంది. ఇక స్కూళ్లల్లో కంటెంట్ క్రియేటర్ ల్యాబ్స్ ఏర్పాటు చేయనున్నారు. వీటి సమీపంలో 5 యూనివర్సిటీ టౌన్‌షిప్‌లు ఉండనున్నాయి. 1500 స్కూళ్లు, 500 కాలేజీల్లో ఈ కంటెంట్ క్రియేటర్ ల్యాబ్స్ ఏర్పాటు కానున్నాయి. యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్స్ వంటి వాటిల్లో విద్యార్థులకు శిక్షణ ఇవ్వనున్నారు.

ప్రత్యేక పథకాలు ఇవే..

2026-27 సంవత్సరానికి రాష్ట్రాలకు ఆర్థిక కమిషన్ గ్రాంట్లుగా 1.4 లక్షల కోట్లు అందించాలని బడ్జెట్‌లో ప్రకటించారు. వీటిలో గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థలు, విపత్తు నిర్వహణ గ్రాంట్లు ఉన్నాయి. అటు భారత్‌ను వైద్య పర్యాటక కేంద్రంగా ప్రోత్సహించేందుకు దేశంలో 5 ప్రాంతీయ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. అటు కొబ్బరి ఉత్పత్తిని పెంచేందుకు ప్రత్యేక పథకం ప్రకటించగా.. దేశవ్యాప్తంగా 15 పురావస్తు ప్రదేశాలను అభివృద్ది చేయాలని నిర్ణయించారు. ఈ పురావస్తు ప్రదేశాలను శక్తివంతమైన, అనుభవజ్ఞులైన సాంస్కృతిక గమ్యస్థానాలుగా అభివృద్ధి చేయాలని నిర్ణయించారు.

ఖేలో ఇండియా మిషన్

ఇక ఈ బడ్జెట్‌లో నిర్మలా సీతారామన్ ‘ఖేలో ఇండియా మిషన్’ ప్రకటించారు. అలాగే టూరిస్టులకు సహాయం చేసేందుకు టూరిస్ట్ గైడ్లకు శిక్షణ ఇవ్వనున్నారు. అందులో భాగంగా 10 వేల మంది టూరిస్ట్ గైడ్లకు ట్రైనింగ్ ఇవ్వనున్నారు. అటు విదేశీ టూర్ ప్యాకేజీలపై టీసీఎస్ రేటు 5 శాతం, 20 శాతం నుంచి 2 శాతం వరకు ఏదైనా నిబంధన ఉంటుంది.

ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ 2026 ఎలా ఉంది..?

మరిన్ని బడ్జెట్ కథనాలు చదవండి