AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Union Budget 2026: వేతన జీవులకు దక్కని ఊరట.. పన్ను స్లాబ్‌లు యథాతథం..

కేంద్ర బడ్జెట్‌లో వేతన జీవులు, వ్యాపార వర్గాలకు షాక్ తగిలింది. దేశవ్యాప్తంగా నిత్యావసర వస్తువులు, ఇతర వస్తువులు ధరలు పెరగుతున్న క్రమంలో ఈ బడ్జెట్‌లో ఇన్‌కమ్ ట్యాక్స్ శ్లాబుల్లో మార్పులు ఉంటాయని అందరూ ఊహించారు. కానీ కేంద్ర ప్రభుత్వం ఎలాంటి మార్పులు చేయకపోవడం షాకింగ్‌గా మారింది.

Union Budget 2026: వేతన జీవులకు దక్కని ఊరట.. పన్ను స్లాబ్‌లు యథాతథం..
Income Tax
Venkatrao Lella
|

Updated on: Feb 01, 2026 | 12:58 PM

Share

ట్యాక్స్ చెల్లించేవారికి బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం భారీ శుభవార్త అందించింది. ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ దాఖలు చేసేందుకు గుడువును మరింత పొడిగించారు. ఐటీఆర్ 1, ఐటీఆర్ 2 దాఖలు చేయడానికి జులై 1 వరకు సమయమిచ్చారు. ఇక ఆడిట్ కాని వ్యాపార కేసులు, ట్రస్ట్‌లకు ఆగస్ట్ 31 వరకు గుడువు పొడిగిస్తున్నట్లు ఆర్ధికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. నామమాత్రపు ఆలస్యపు రుసుంలతో డిసెంబర్ 31 నుండి మార్చి 31 వరకు రిటర్న్స్‌లను సవరించడానికి ఉన్న గడువును పొడిగిస్తూ బడ్జెట్‌లో నిర్ణయం ప్రకటించారు. పన్ను చెల్లింపుదారులకు ఇది శుభవార్తగా చెప్పవచ్చు.

ఇన్‌కమ్ ట్యాక్స్ స్లాబ్‌లు యథాతథం

ఇక ఇన్‌కమ్ ట్యాక్స్ స్లాబుల్లో కేంద్రం ఎలాంటి మార్పులు చేయలేదు. కార్పొరేట్, ఐటీ స్లాబుల్లో ఎలాంటి మార్పులు ఉండవని తెలిపారు. ఇన్‌కమ్ ట్యాక్స్ స్లాబులు యథాతథంగా ఉంటాయని స్పష్టం చేశారు. అటు విదేశీ విద్య, వైద్య ఖర్చులపై టీసీఎస్ రేటును 5 శాతం నుంచి 2 శాతానికి తగ్గించాలని నిర్ణయించారు. ఇక బాండెడ్ జోన్‌లోని ఏదైనా పెద్ద మూలధన వస్తువులు, పరికారాలను అందించే తయారీదారులకు 5 సంవత్సరాల పాటు ఆదాయపు పన్ను నుంచి మినహాయింపు ఇచ్చారు. క మాన్‌పవర్ సరఫరా చేసే కంపెనీలకు టీడీఎస్ 1 లేదా 2 శాతంగా ఉంటుంది. చిన్న పన్ను చెల్లింపుదారుల కోసం ప్రత్యేక పథకం తీసుకురానున్నారు. సులభతరంగా ట్యాక్స్ ఫైల్ చేసేలా మార్పులు చేయనున్నారు. అందరికీ అర్థమయ్యే భాషలో ఉండే ఫారాలను త్వరలో ప్రవేశపెట్టునున్నారు. ఏప్రిల్ 1 నుంచి కొత్త ఐటీ చట్టంను అమలు చేయనున్నట్లు ప్రకటించారు.

క్యాన్సర్ రోగులకు ఊరట

క్యాన్సర్ రోగులకు బడ్జెట్‌తో ఉపశమనం కలిగింది. 17 రకాల క్యాన్సర్ మందులపై సుంకాన్ని తగ్గించారు. ఏప్రిల్ 1 నుంచి క్యాన్సర్ మందులపై ఎంఏటీ పన్నులో మినహాయింపులు ఇచ్చారు. పన్నును 15 శాతం నుంచి 14 శాతానికి తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. మైక్రోవేవ్ ఓవెన్ల భాగాలపై బీసీడీ మినహాయింపుతో పాటు వ్యక్తిగత వస్తువుల దిగుమతులపై 20 శాతం నుంచి 10 శాతానికి సుంకాన్ని తగ్గించారు. ఇక పౌర శిక్షణ, ఇతర విమానాల తయారీదారులకు అసవసరమైన విడి భాగాలపై ప్రధామిక కస్టమ్ సుంకాన్ని మినహాయించారు. అలాగే డేటా సెంటర్ సేవలను ఉపయోగించి ప్రపంచ దేశాల క్లెయింట్స్‌కు క్లౌడ్ సేవలు అందించే విదేశీ సంస్థలకు 2047 వరకు ఎలాంటి పన్ను లేకుండా మినహాయింపు ప్రకటించారు.  అలాగే ఆదాయాన్ని తప్పుగా చూపించినవారికి పన్ను మొత్తంలో 100శాతానికి సమానమైన జరిమానా విధించనున్నారు. అలాగే పన్ను చెల్లించేవారికి 6 నెలల విదేశీ ఆస్తుల బహిర్గత పథకాన్ని ప్రకటించారు.  విదేశీ వైద్య, విద్య ఖర్చులకు టీసీఎస్‌ను 5 శాతం నుంచి 2 శాతానికి తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు.