AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sim Portability: ఇకపై సిమ్ పోర్టబిలిటీ అంత ఈజీ కాదు.. ఆ కారణంతో ట్రాయ్ కీలక చర్యలు..!

ఇటీవల కాలంలో బ్యాంకింగ్ రంగంలో పెరిగిన టెక్నాలజీ కారణంగా చాలా లావాదేవీలు మొబైల్ నెంబర్‌కు వచ్చే ఓటీపీ ఆధారంగానే ప్రాసెస్ చేస్తున్నారు. ఈ టెక్నాలజీను ఆసరాగా చేసుకుని మొబైల్ నెంబర్ పోర్టబులిటీ ద్వారా నెంబర్‌ను పొందిన కొందరు కేటుగాళ్లు ఇటీవల కాలంలో ఆర్థిక మోసాలకు పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలో మోసపూరిత సిమ్ మార్పిడుల ద్వారా మొబైల్ నంబర్ల పోర్టింగ్‌ను అరికట్టేందుకు టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) మొబైల్ నంబర్ పోర్టబిలిటీ నిబంధనలను సవరించింది.

Sim Portability: ఇకపై సిమ్ పోర్టబిలిటీ అంత ఈజీ కాదు.. ఆ కారణంతో ట్రాయ్ కీలక చర్యలు..!
Phone Talking
Nikhil
| Edited By: Janardhan Veluru|

Updated on: Jun 29, 2024 | 6:47 PM

Share

ఇటీవల కాలంలో మొబైల్ వినియోగం బాగా పెరిగింది. ప్రతి మనిషికి కచ్చితంగా ఒకటి నుంచి రెండు నెంబర్లు ఉంటున్నాయంటే వినియోగం ఏ స్థాయిలో ఉంటున్నాయో? మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఇటీవల కాలంలో బ్యాంకింగ్ రంగంలో పెరిగిన టెక్నాలజీ కారణంగా చాలా లావాదేవీలు మొబైల్ నెంబర్‌కు వచ్చే ఓటీపీ ఆధారంగానే ప్రాసెస్ చేస్తున్నారు. ఈ టెక్నాలజీను ఆసరాగా చేసుకుని మొబైల్ నెంబర్ పోర్టబులిటీ ద్వారా నెంబర్‌ను పొందిన కొందరు కేటుగాళ్లు ఇటీవల కాలంలో ఆర్థిక మోసాలకు పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలో మోసపూరిత సిమ్ మార్పిడుల ద్వారా మొబైల్ నంబర్ల పోర్టింగ్‌ను అరికట్టేందుకు టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) మొబైల్ నంబర్ పోర్టబిలిటీ నిబంధనలను సవరించింది. ఈ మార్పులు జూలై 1, 2024 నుంచి అమలులోకి వస్తాయి. మోసగాళ్లు ఫోన్ నంబర్‌లను హైజాక్ చేయడాన్ని మరింత కష్టతరం చేయడం లక్ష్యంగా ఈ చర్యలు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ట్రాయ్ తాజా చర్యల గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

టెలికమ్యూనికేషన్ మొబైల్ నంబర్ పోర్టబిలిటీ రెగ్యులేషన్స్‌కు సంబంధించిన తొమ్మిదో సవరణ ప్రకారం యూనిక్ పోర్టింగ్ కోడ్ (యూపీసీ) అభ్యర్థనను తిరస్కరించడానికి అడిషనల్ ఆథంటికేషన్‌ను ప్రవేశపెట్టారు. ప్రత్యేకించి సిమ్ రీప్లేస్‌మెంట్ చేసిన ఏడు రోజులలోపు అభ్యర్థన చేస్తే యూపీసీ కేటాయించరు. వినియోగదారులు ఇటీవల వారి సిమ్ కార్డ్‌లను మార్చుకుంటే వారి ప్రస్తుత నెట్‌వర్క్ ఆపరేటర్ నుంచి పోర్ట్ అవుట్ చేయలేరు. కొత్త నిబంధనల ప్రకారం డ్యామేజ్ లేదా లాస్ కారణంగా సిమ్ స్వాప్ తర్వాత వినియోగదారులు తమ నెట్‌వర్క్‌ను కనీసం ఏడు రోజుల పాటు పోర్ట్ చేయమని అభ్యర్థించలేరు. అలా చేస్తే గత 7 రోజులలో సబ్‌స్క్రైబర్ సిమ్‌ని మార్చుకుంటే టెలికాం సర్వీస్ ప్రొవైడర్లు యూపీసీను జనరేట్ చేయరు. గతంలో వినియోగదారులు తమ సిమ్ కార్డ్‌ని భర్తీ చేసిన తర్వాత ఎప్పుడైనా నెట్‌వర్క్ ప్రొవైడర్‌లను మార్చడానికి యూనిక్ పోర్టింగ్ కోడ్‌ను అభ్యర్థించే అవకాశం ఉండేది. 

ఈ సవరణ నిబంధనలు మోసపూరిత సిమ్ మార్పిడి, ఇతర అంశాల ద్వారా మొబైల్ నంబర్‌ల పోర్టింగ్‌ను అరికట్టడానికి ఉద్దేశించి రూపొందించామని ట్రాయ్ ప్రెస్ నోట్‌లో పేర్కొంది. ఈ సవరణ నిబంధనల ద్వారా ప్రత్యేక పోర్టింగ్ కోడ్ (యూపీసీ) కేటాయింపు అభ్యర్థనను తిరస్కరించడానికి అదనపు ప్రమాణం ఉంది. ప్రత్యేకంగా సిమ్ మార్పిడి తేదీ నుంచి ఏడు రోజుల గడువు ముగిసేలోపు యూపీసీ కోసం అభ్యర్థిస్తే యూపీసీ కేటాయించరని స్పష్టం చేసింది. 

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..