OnePlus Pad Pro: ట్యాబ్ కొనే ప్లాన్‌లో ఉన్నారా.? వన్‌ప్లస్ నుంచి కొత్త ట్యాబ్లెట్స్ వచ్చేస్తోంది
ఇదిలా ఉంటే వన్‌ప్లస్ ఈ ట్యాబ్‌కు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన ఇవ్వలేదు. అయితే ప్రస్తుతం నెట్టింట ఈ ట్యాబ్‌కు సంబంధించి కొన్ని ఫీచర్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి. చైనీస్ మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్ వీబోలో ఈ ట్యాబ్‌కు సంబంధించి ఫీచర్లు, ఫొటోలు వైరల్ అవుతున్నాయి. వీటి ప్రకారం ఈ ట్యాబ్‌లో ఎలాంటి ఫీచర్లు ఉండనున్నాయంటే..
ప్రస్తుతం మార్కెట్లో ట్యాబ్లెట్స్‌కి డిమాండ్ పెరుగుతోంది. ఓటీటీ వ్యూయర్స్, గేమింగ్ లవర్స్‌తో పాటు ఎడ్యుకేషన్ పరంగా కూడా ట్యాబ్‌లు ఎక్కువగా ఉపయోగపడుతున్నారు. ఈ క్రమంలోనే ప్రముఖ ఎలక్ట్రానిక్ సంస్థు మార్కెట్లోకి ట్యాబ్లెట్స్‌ను తీసుకొస్తున్నారు. ఇందులో భాగంగానే తాజాగా ప్రముఖ ఎలక్ట్రానిక్ సంస్థ వన్‌ప్లస్ భారత మార్కెట్లోకి కొత్త ట్యాబ్లెట్‌ను తీసుకొస్తోంది. వన్‌ప్లస్ ప్యాడ్ ప్రో పేరుతో ఈ ఫోన్‌ను తీసుకొస్తున్నారు. ఇంతకీ ఈ ఫోన్లో ఎలాంటి ఫీచర్లు ఉండనున్నాయి.? ధర ఎంత.? ఉండనుంది.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
ఇదిలా ఉంటే వన్‌ప్లస్ ఈ ట్యాబ్‌కు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన ఇవ్వలేదు. అయితే ప్రస్తుతం నెట్టింట ఈ ట్యాబ్‌కు సంబంధించి కొన్ని ఫీచర్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి. చైనీస్ మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్ వీబోలో ఈ ట్యాబ్‌కు సంబంధించి ఫీచర్లు, ఫొటోలు వైరల్ అవుతున్నాయి. వీటి ప్రకారం ఈ ట్యాబ్‌లో ఎలాంటి ఫీచర్లు ఉండనున్నాయంటే..
వన్‌ప్లస్ ప్యాడ్ ప్రో ఫోన్‌లో 121 ఇంచెస్‌తో కూడిన ఎల్‌సీడీ డిస్‌ప్లేను అందించనున్నారు. ఈ స్క్రీన్ 3కే రిజల్యూషన్‌తో కూడిన పిక్చర్ క్వాలిటీని అందించనున్నారు. 144Hz రిఫ్రెష్ రేట్ ఈ స్క్రీన్ సొంతంగా చెప్పొచ్చు. ఇక ఈ ట్యాబ్‌ను మొత్తం నాలుగు వేరియంట్స్‌లో అందుబాటులోకి తీసుకురానున్నారు. బేస్ వేరియంట్‌గా 16 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్‌ను అందించనున్నారు.
ఇక వన్‌ప్లస్ ప్యాడ్ ప్రో ట్యాబ్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 ప్రాసెసర్‌ను అందించనున్నారు. అలాగే ఈ ట్యాబ్‌లో శక్తివంతమైన 851 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీని అందించనున్నారు. 67 వాట్స్ వైర్డ్ ఛార్జింగ్‌కు ఈ బ్యాటరీ సపోర్ట్ చేయనున్నట్లు సమాచారం. త్వరలోనే ఈ ట్యాబ్‌కు సంబంధించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ధర విషయానికొస్తే ఈ ట్యాబ్ రూ. 20 వేలోపు ఉండొచ్చని తెలుస్తోంది.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..