ISRO: అంతరిక్ష ప్రయోగాల్లో ఇస్రో మరో రికార్డ్.. SSLV రూపకల్పన.. ఆగస్టు 7వ తేదీన లాంచింగ్..
ISRO: ఇస్రో ప్రస్థానంలో మరో ముందడుగు పడింది. ఇస్రోలోకి మరో వాహక నౌక వచ్చి చేరింది. బడా ఉపగ్రహాలను నింగిలోకి మోసుకెళ్లే బాహుబలి రాకెట్‌తో..
ISRO: ఇస్రో ప్రస్థానంలో మరో ముందడుగు పడింది. ఇస్రోలోకి మరో వాహక నౌక వచ్చి చేరింది. బడా ఉపగ్రహాలను నింగిలోకి మోసుకెళ్లే బాహుబలి రాకెట్‌తో రికార్డు నెలకొల్పిన ఇస్రో.. ఇపుడు చోటా రాకెట్‌తో మరో రికార్డ్ నెలకొల్పాబోతోంది. ఇస్రో మొదలు పెడుతున్న చోటా రాకెట్ కు సంబంధించిన వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.. ఇస్రో ఇలాకలో ఇప్పడిదాక ఉన్న రాకెట్ లిస్ట్ లోకి మరో రాకెట్ రాబోతోంది. అదే SSLV (స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికిల్). ఈ వాహక నౌక అందుబాలోకి వచ్చాక ఇస్రో చేపట్టే ప్రయోగాల సంఖ్య రికార్డ్ స్థాయిలో పెరిగే అవకాశం ఉంది.
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ఇప్పటికే అనేక రికార్డులను సొంతం చేసుకుకుంది. అతి తక్కువ ఖర్చుతో ఉపగ్రహాలను అంతరిక్షంలోకి విజయవంతంగా పంపుతూ ప్రపంచ దేశాలకు దీటుగా నిలబడుతున్న ఇస్రో ఇప్పుడు సరికొత్త ప్రయోగాలకు సిద్ధమవుతోంది. హాలీవుడ్ మూవీ గ్రావిటీ కి అయిన ఖర్చు కంటే తక్కువ బడ్జెట్‌తో చంద్రయాన్ చేపట్టింది ఇస్రో. ఇది అంతరిక్ష పరిశోధనలు చేస్తున్న మిగిలిన దేశాల కంటే తక్కువ ఖర్చు. ఇక ఒకే రాకెట్ ద్వారా 104 ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టిన రికార్డ్ కూడా ఇస్రో సొంతం. విదేశాలకు చెందిన వందలాది ఉపగ్రహాలను ఇస్రో అంతరిక్షంలో ప్రవేశ పెట్టిన ఘనత కూడా ఉంది. ఇపుడు అంతకు మించి అన్నట్లు సరికొత్తగా కొత్త జెనరేషన్ లాంచ్ వెహికిల్ తయారీ చేసింది ఇస్రో. అదే SSLV. ఇప్పటి వరకు ఇస్రో వద్ద ఐదు జెనరేషన్స్ లాంచ్ వెహికల్స్ ని ఉపయోగించింది. తొలి తరంలో SLV, ASLV, PSLV, GSLV ,MARK-3 ఇపుడు SSLV అంటే స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్. ఈ వాహక నౌక ఇప్పటి దాకా ఉన్న వాటికి భిన్నమైన డిజైన్ లో ఉంటుంది.
ఇప్పటి దాకా అత్యంత బరువున్న ఉపగ్రహాలను మోసుకెళ్లే విధంగా డిజైన్ చేయబడిన PSLV, GSLV, MARK 3 లాంటి ప్రయోగాలు ఉన్నా వాటికి వందల కోట్ల ఖర్చు అవుతోంది. అలాగే సమయం కూడా.. ఒక్కో ప్రయోగానికి కనీసం నెల నుంచి మూడు నెలలు పట్టేది. అదే SSLV అయితే తక్కువ ఖర్చుతో.. తక్కువ సమయంలో ప్రయోగం చేపట్టే అవకాశం ఉంది. అలాగే తక్కువ ఎత్తులో ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశ పెట్టేందుకు ఈ తరహా రాకెట్స్ ఎంతో ఉపయోగకరం. స్వదేశీ అవసరాలతో పాటు ఇతర దేశాలకు చెందిన ఉపగ్రహాలను ఇస్రో అంతరిక్షంలోకి తీసుకువెళ్లే ఒప్పందాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ తక్కువ సమయంలో.. ఎక్కువ ప్రయోగాలు జరపాలి. అందుకు ఇప్పుడున్న వాహక నౌకలతో ఏమాత్రం చేపట్టలేం. అందుకే SSLV రూపొందించింది ఇస్త్రో.
ఈ స్మాల్ సాటిలైట్ లాంచ్ వెహికిల్(SSLV) ద్వారా అతి తక్కువ ఖర్చుతో ఏటా వేల సంఖ్యలో ఉపగ్రహాలను నింగిలోకి పంపేందు ఇస్రో సిద్ధమవుతోంది. మన దేశంలోని పరిశోధనలు చేపడుతున్న విద్యార్థులకు, ఔత్సాహికులకు ఇదో పెద్ద వరం కానుంది. అలాగే అంతర్జాతీయ స్థాయిలో కమర్షియల్ శాటిలైట్స్ కోణంలోనూ ఇస్రోకి మంచి డిమాండ్ ఉంది. దీంతో SSLV ద్వారా ఇవన్నీ పూరించడానికి అవకాశాలు పెరుగుతాయని ఇస్రో భావిస్తోంది. 10 కిలోల నుంచి 500 కిలోల బరువున్న ఉపగ్రహాలను నింగిలోకి ప్రవేశపెట్టేందుకు అనువుగా ఉండేలా రూపకల్పన చేశారు. ఇప్పటి వరకు ఉపయోగించే వాహక నౌకల.ద్వారా 4 టన్నుల బరువు గల ఉపగ్రహాలను నింగిలోకి పంపగలిగే డిజైన్స్ ఉన్నాయి. ప్రస్తుతం ప్రయోగ దశలను విజయవంతం చేస్తున్న ఇస్రో ఈ నెల 7 న పూర్తి స్థాయి ప్రయోగానికి ఏర్పాట్లు పూర్తి చేసింది. అజాది క మహోత్సవ సందర్భంగా విద్యార్థుచే ఉపగ్రహాలు, పరికరాలను అంతరిక్షంలోకి పంపనున్న ఇస్రో ఇదే లాంచ్ వెహికల్ ద్వారా పంపనుంది.
మరిన్ని సైన్స్ అండ్ టక్నాలజీ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..