iQOO 9T 5G: భారత మార్కెట్లోకి ఐకూ నుంచి ప్రీమియం స్మార్ట్‌ఫోన్.. కెమెరా క్లారిటీ కోసం ప్రత్యేక ఫీచర్..
iQOO 9T 5G: భారత్‌లో మరికొన్ని రోజుల్లో 5జీ నెట్ వర్క్ అందుబాటులోకి వస్తోన్న నేపథ్యంలో చాలా కంపెనీలు 5జీ ఫోన్లను లాంచ్ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం ఐకూ...
iQOO 9T 5G: భారత్‌లో మరికొన్ని రోజుల్లో 5జీ నెట్ వర్క్ అందుబాటులోకి వస్తోన్న నేపథ్యంలో చాలా కంపెనీలు 5జీ ఫోన్లను లాంచ్ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం ఐకూ కొత్త ఫోన్‌ను తీసుకొచ్చింది. వివో సబ్ బ్రాండ్ అయిన ఈ సంస్థ ఐకూ 9టీ పేరుతో భారత మార్కెట్లోకి 5జీ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. ఈ ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌లో అధునాతన ఫీచర్లను అందించారు. ఇక ఈ ఫోన్ ఫీచర్లు ఎలా ఉన్నాయి.? ధర ఎంత లాంటి.? పూర్తి వివరాలు మీకోసం..
ఈ 5జీ ఫోన్‌లో 6.78 ఇంచెస్ ఈ5 అమోఎల్‌ఈడీ ఫ్లాట్ డిస్‌ప్లేను అందించారు. పూర్తి హెచ్‌డీ+ రిజల్యూషన్‌తో పనిచేయడం ఈ డిస్‌ప్లే ప్రత్యేకత. ఇక ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేసే ఈ ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 8+ Gen 1 చిప్‌సెట్‌ను ఇచ్చారు. పంచ్-హోల్ డిజైన్, ఇన్‌డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్‌ఈ ఫోన్‌లో ఉన్న ప్రధాన ఫీచర్లు. ఇక కెమెరా క్లారిటీ కోసం ఈ ఫోన్‌లో ప్రత్యేక ఫీచర్‌ను అందించారు. నాలుగు రియర్ కెమెరాతో పాటు ఆప్టిమైజ్ ఫొటోగ్రఫీ ఎక్స్‌పీరియన్స్ కోసం వీవో వీ1+ ఇమేజ్ ప్రాసెసింగ్ చిప్‌ను అమర్చారు. ఇక ఇందులో 50 మెగా పిక్సెల్ రెయిర్ కెమెరాతో పాటు, 16 మెగా పిక్సె్ల్స్ సెల్ఫీ కెమెరాను ఇచ్చారు.
ధర విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌ను రెండు వేరియంట్లలో విడుదల చేశారు. 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ ధర రూ. 49,999కాగా, 12 జీబీ ర్యామ్ + 256 జీబీ ర్యామ్ ధర రూ. 54,999గా ఉంది. అయితే ఐకూ అధికారిక వెబ్‌సైట్ iQOO.com ద్వారా కొనుగోలు చేసిన వారు రూ. 3,999 విలువైన గేమ్‌ప్యాడ్ ఉచితంగా పొందొచ్చు. అమెజాన్‌లో ఆగస్టు 4 నుంచి ఈ స్మార్ట్‌ఫోన్ అందుబాటులోకి రానుంది. పలు బ్యాంక్ కార్డులతో కొనుగోలు చేస్తే రూ. 4000 వరకు డిస్కౌంట్ పొందే అవకాశం ఉంది.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..