AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Whatsapp: ఫోన్‌లో వాట్సాప్‌ ఉందని ఏది పడితే అది షేర్‌ చేస్తున్నారా.? జైలుకు వెళ్లే ప్రమాదం ఉంది జాగ్రత్త..

Whatsapp: ఒకప్పుడు ఉయదం నిద్రలేవగానే దేవుడి ఫొటోకు దండం పెట్టుకునే వారు కానీ ఇప్పుడు నిద్ర లేచిన వెంటనే స్మార్ట్‌ ఫోన్‌ తీసుకొని వాట్సాప్‌లో ఏమైనా మెసేజ్‌లు వచ్చాయా.. అని చెక్‌ చేసుకుంటున్నారు. అంతలా వాట్సాప్‌...

Whatsapp: ఫోన్‌లో వాట్సాప్‌ ఉందని ఏది పడితే అది షేర్‌ చేస్తున్నారా.? జైలుకు వెళ్లే ప్రమాదం ఉంది జాగ్రత్త..
Narender Vaitla
|

Updated on: Aug 03, 2022 | 3:37 PM

Share

Whatsapp: ఒకప్పుడు ఉయదం నిద్రలేవగానే దేవుడి ఫొటోకు దండం పెట్టుకునే వారు కానీ ఇప్పుడు నిద్ర లేచిన వెంటనే స్మార్ట్‌ ఫోన్‌ తీసుకొని వాట్సాప్‌లో ఏమైనా మెసేజ్‌లు వచ్చాయా.. అని చెక్‌ చేసుకుంటున్నారు. అంతలా వాట్సాప్‌ మన జీవితాల్లో భాగమైపోయింది. ఫొటోలు, వీడియోలు, ఫైల్స్‌, టెక్ట్స్‌ మెసేజ్‌లు తాజాగా డబ్బులు పంపించుకోవడం ఇలా ప్రతీ పనికి వాట్సాప్‌ కేరాఫ్‌గా మారింది. ఈ నేపథ్యంలోనే ఫేక్‌ న్యూస్‌ సర్క్యూలేట్‌కు కూడా వాట్సాప్‌ అడ్రస్‌గా మారింది.

కొంత మంది యూజర్లు తమకు వచ్చిన కంటెంట్‌ నిజమైందా.? కాదా అని కూడా ఆలోచించకుండా ఫార్వర్డ్‌ చేస్తున్నారు. ఒక్క క్షణం కూడా క్రాస్‌ చెక్‌ చేసుకోకుండా గ్రూప్స్‌లో షేర్‌ చేస్తున్నారు. అయితే కొన్ని రకాల మెసేజ్‌లను సెండ్‌ చేసే ముందు జాగ్రత్తగా ఉండాలని యూజర్లకు వాట్సాప్‌ సూచిస్తోంది. కొన్ని కేటగీరిల్లోని కంటెంట్‌ను వెనకాముందు ఆలోచించకుండా షేర్‌ చేస్తే శిక్షలు కూడా తప్పవని హెచ్చరిస్తోంది. ఇంతకీ వాట్సాప్‌ చేసిన ఆ సూచనలేంటంటే..

* టెర్రరిస్టులు, అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడే వారికి సంబంధించిన కంటెంట్‌ను లేదా వారిని ప్రోత్సహిస్తున్నట్లున్న సమాచారాన్ని షేర్‌ వాట్సాప్‌లో షేర్‌ చేస్తే సదరు వ్యక్తిపై ఫిర్యాదు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి కంటెంట్‌ మన వాట్సాప్‌కు వచ్చినా వాటిని వదిలేయడమే ఉత్తమం. దేశ భద్రత దృష్ట్యా ప్రభుత్వం ఇలాంటి కంటెంట్‌ షేరింగ్‌పై నిఘా పెడుతోందని గుర్తించాలి.

* ఎదుటి వారి వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగేలా మెసేజ్‌లు చేసినా చిక్కుల్లో పడుతారు. ఉదారహణకు ఎవరినైనా ఆటపట్టించడం కోసం వారికి తెలియకుండా వారి వీడియోలు తీసి గ్రూప్స్‌లో షేర్‌ చేయకూడదు. ఇలా చేయడం ద్వారా సదరు వీడియోలను కొందరు ఎడిట్‌ చేసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తున్నారు. కాబట్టి సరదాకు కూడా ఇలాంటి పని చేయకండి.

* వాట్సాప్‌ గ్రూప్స్‌లో ఎట్టి పరిస్థితుల్లో అశ్లీల కంటెంట్‌ను షేర్‌ చేయకూడదు. సోషల్‌ మీడియాలో అడల్ట్‌ కంటెంట్‌ షేర్‌ చేయడం చట్టరీత్యా నేరం. గ్రూప్‌లో ఉన్న వారు ఎవరైనా పోలీసులకు సదరు వీడియోలపై ఫిర్యాదు చేస్తే.. గ్రూప్‌ అడ్మిన్‌తో పాటు, షేర్‌ చేసిన వ్యక్తిపై చర్యలు తప్పవు.

* కాపీరైట్‌ ఉన్న కంటెంట్‌ను షేర్‌ చేసే విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలని వాట్సాప్‌ సూచిస్తోంది. కొందరు క్రియేటర్లు తమ కంటెంట్‌ అనుమతి లేకుండా షేర్‌ చేశారని ఫిర్యాదు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us