AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tech Tips: మీ స్మార్ట్ ఫోన్ స్లో అయిపోయిందా? అయితే ఈ ట్రిక్‌తో పరుగెడుతుంది.. ట్రై చేయండి..

అలా అధిక స్టోరేజ్ వినియోగిస్తున్న యాప్ లను గుర్తించిన తర్వాత అవి మీరు అంతగా వినియోగించనివి అయితే వెంటనే డిలీట్ చేసేసుకోవాలి. దాని వల్ల మీ ఫోన్ స్టోరేజ్ ఆదా అవడంతో పాటు ఫోన్ స్పీడ్ కూడా పెరుగుతుంది.

Tech Tips: మీ స్మార్ట్ ఫోన్ స్లో అయిపోయిందా? అయితే ఈ ట్రిక్‌తో పరుగెడుతుంది.. ట్రై చేయండి..
Smartphone
Madhu
|

Updated on: Jun 25, 2023 | 5:00 PM

Share

మన జీవితంలో స్మార్ట్ ఫోన్ ఓ అత్యవసరం. అది లేకుండా అడుగు బయట పెట్టలేని పరిస్థితి. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి బెడ్ పై కూడా ఫోన్ చేతిలో ఆడుతుండాల్సిందే. అంతలా దానిపై ఆధారపడుతున్న సమయంలో అది సక్రమంగా పనిచేయకపోతే చాలా చిరాకుగా అనిపిస్తుంటుంది. సాధారణంగా ఫోన్లలో స్టోరేజ్ అయిపోయినా.. యాప్ లు ఎక్కువగా ఉన్నా ఫోన్ స్లో అయిపోతుంది. ఆ సమయంలో రన్నింగ్ అవుట్ ఆఫ్ స్టోరేజ్ అని, యువర్ ఫోన్ స్టోరేజ్ ఫుల్ అని నోటిఫికేషన్లు తరచూ చూస్తుంటాం. ఆసమయంలో ఫోన్ పనితీరు సక్రమంగా ఉండదు. అలాగే కొత్త ఫైళ్లు, ఫొటోలు, వీడియోలు, ఇతర వేరే యాప్ లు డౌన్ లోడ్ చేసుకోవడం కుదరదు. అలాంటి సమయంలో ఏం చేయాలి? మళ్లీ స్పీడ్ అందుకోవాలంటే ఏం చేయాలి? ఇదిగో ఈ ట్రిక్ ఫాలో అవ్వండి. మీ ఫోన్ మళ్లీ ఫుల్ స్పీడ్ ను అందుకుంటుంది.

ఎక్కువ స్పేస్ తీసుకొనే యాప్స్ ఇవే..

సాధారణంగా ఐదు రకాల యాప్స్ ఎక్కువ స్టోరేజ్ ను తీసుకుంటాయి. ఆడియో యాప్స్, ఓటీటీ యాప్స్, సోషల్ మీడియా యాప్స్, గేమింగ్ యాప్స్, ఫొటో/వీడియో యాప్స్.ఇవే సాధారణంగా ఎక్కువ ఫోన్ స్టోరేజ్ ని వాడుకుంటాయి. అయితే వీటిల్లో ఏ యాప్ వల్ల మీ ఫోన్ స్లో అవుతుంది? అధికంగా స్టోరేజ్ వాడుకుంటున్న యాప్ ని కనిపెట్టడం ఎలా? చూద్దాం రండి..

మీ ఆండ్రాయిడ్, ఐ ఫోన్ లోని సెట్టింగ్స్ మీకు ఈ విషయాన్ని వెల్లడిచేస్తుంది. సెట్టింగ్స్ లోని స్టోరేజ్ ఆప్షన్లో మీకు ఇది తెలిసిపోతుంది.

ఇవి కూడా చదవండి

ఐఫోన్లో ఇలా..

  • మొదటిగా ఐఫోన్ లోని సెట్టింగ్స్ లోకి వెళ్లాలి.
  • దానిలో జనరల్ సెక్షన్ పై క్లిక్ చేయాలి.
  • వచ్చిన ఆప్షన్లలో నుంచి ఐఫోన్ స్టోరేజ్ ఆప్షన్ ని ఎంపిక చేసుకోవాలి. దానిలో యాప్ లిస్ట్ అనేదానిపై క్లిక్ చేయాలి.
  • అప్పుడు మీకు యాప్ లు.. అవి వాడుకుంటున్న స్టోరేజ్ వివరాలు కనిపిస్తాయి. దానిలో అధిక స్టోరేజ్ వాడుకుంటున్న యాప్ ఏదో తెలుసుకోవచ్చు.

ఆండ్రాయిడ్ ఫోన్ అయితే..

  • గూగుల్ ప్లే స్టోర్ యాప్ లోకి వెళ్లి ప్రోఫైల్ ఐకాన్ పై క్లిక్ చేయాలి.
  • ఆ తర్వాత మేనేజ్ యాప్ అండ్ డివైజ్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
  • దానిలో యాప్స్ లిస్ట్ మీకు ఓపెన్ అవుతుంది. వాటి సైజ్ ఆధారంగా అవి మీకు కనిపిస్తాయి.
  • వాటి నుంచి మీరు అధికంగా స్టోరేజ్ వినియోగిస్తున్న యాప్ ను గుర్తించవచ్చు.

అలా అధిక స్టోరేజ్ వినియోగిస్తున్న యాప్ లను గుర్తించిన తర్వాత అవి మీరు అంతగా వినియోగించనివి అయితే వెంటనే డిలీట్ చేసేసుకోవాలి. దాని వల్ల మీ ఫోన్ స్టోరేజ్ ఆదా అవడంతో పాటు ఫోన్ స్పీడ్ కూడా పెరుగుతుంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఈ బ్లడ్ గ్రూప్ ఉన్నవాళ్లు జాగ్రత్త.. స్ట్రోక్ వచ్చే ప్రమాదం..
ఈ బ్లడ్ గ్రూప్ ఉన్నవాళ్లు జాగ్రత్త.. స్ట్రోక్ వచ్చే ప్రమాదం..
ఈ చిత్రంలో రెండు అంకెలు ఉన్నాయ్.. 5 సెకన్లలో కనుగొన్నారో జీనియసే
ఈ చిత్రంలో రెండు అంకెలు ఉన్నాయ్.. 5 సెకన్లలో కనుగొన్నారో జీనియసే
యూట్యూబ్‏ను షేక్ చేస్తోన్న దేఖ్ లేంగే సాలా సాంగ్..
యూట్యూబ్‏ను షేక్ చేస్తోన్న దేఖ్ లేంగే సాలా సాంగ్..
ఈ కష్టం ఏ తండ్రికీ రాకూడదు.. టెట్ పరీక్షకు తీసుకెళ్తుండగా..
ఈ కష్టం ఏ తండ్రికీ రాకూడదు.. టెట్ పరీక్షకు తీసుకెళ్తుండగా..
భారీ డీల్.. తెలంగాణలో అమెజాన్‌ డేటా సెంటర్‌.. ఎక్కడో తెలుసా?
భారీ డీల్.. తెలంగాణలో అమెజాన్‌ డేటా సెంటర్‌.. ఎక్కడో తెలుసా?
ప్రతి నెలా రూ.10 వేలు SIPలో పెడితే.. చేతికి ఎంతొస్తుంది?
ప్రతి నెలా రూ.10 వేలు SIPలో పెడితే.. చేతికి ఎంతొస్తుంది?
ఇంటర్‌ పబ్లిక్‌ పరీక్షల 2026 మార్కుల కేటాయింపులో కీలక మార్పులు
ఇంటర్‌ పబ్లిక్‌ పరీక్షల 2026 మార్కుల కేటాయింపులో కీలక మార్పులు
11 సినిమాలు చేస్తే 10 బ్లాక్ బస్టర్ హిట్లే.. తోపు హీరోయిన్..
11 సినిమాలు చేస్తే 10 బ్లాక్ బస్టర్ హిట్లే.. తోపు హీరోయిన్..
బంగారం, వెండి కొనాలనుకుంటే ఇదే రైట్‌ టైమ్‌!
బంగారం, వెండి కొనాలనుకుంటే ఇదే రైట్‌ టైమ్‌!
భారీగా పెరుగుతున్న బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ఎంతంటే..
భారీగా పెరుగుతున్న బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ఎంతంటే..