- Telugu News Photo Gallery Technology photos Intelligent Robot Gaarmi will be as intelligent and as Chitti Robo
Intelligent Robot: చిట్టి రోబో కంటే తెలివైన రోబోట్.. మనుషులు కన్నా తెలివైనది, చురుకైనది కూడా.. పూర్తి వివరాలివే..
Intelligent Robot: సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన రోబో సినిమా గురించి తెలియనివారు ఉండరు. ‘చిట్టి’ అనే రోబోపై తీసిన ఈ సినిమాతో రానున్న కాలంలో రోబోలు ఎలా పనిచేయగలవోనన్న అవగాహన కొంత అయినా మనకు కలిగింది. అయితే చిట్టి అనేది సినిమాలో రోబోట్ కానీ గార్మీ అనేది నిజమైన రోబోట్. ఈ రోబోపైనే జర్మనీకి చెందిన మ్యూనిచ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రోబోటిక్స్ పనులు చేస్తున్నాయి. చిట్టి రోబోట్ లాగా అన్ని పనులు చేయగల ఈ గార్మీ రోబో గురించి మరిన్ని విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం..
Updated on: Jun 25, 2023 | 2:47 PM

జర్మనీకి చెందిన రోబోటిక్ సైంటిస్టులు తయారు చేస్తున్న గార్మీ రోబోట్ సమయానికి మందులు, ఆహారం, హెల్త్ చెక్‌అప్ వంటివి చేయగలదు. ఇంకా ప్రస్తుత కాలంలో ఇదే అత్యంత తెలివైన రోబో అని సదరు శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. రోబో సినిమాలోని చిట్టి చేయగలగిన పనులన్నింటినీ ఇది చేయగలదట.

గార్మీ రోబో ప్రాజెక్ట్‌కు నాయకత్వం వహిస్తున్న జర్మన్ సైంటిస్ట్ గుంటెర్ స్టెయిన్‌బాచ్ మాట్లాడుతూ గార్మీని రూపొందించడం అనుకున్నంత సులభం కాదని, మానవుల్లా ఈ రోబోలు కూడా పని చేసేలా గంటల తరబడి శిక్షణ, ప్రోగ్రామింగ్ చేస్తున్నామన్నారు.

ప్రస్తుతం గార్మి రోబోట్ కదలికపై పని జరుగుతోందని DW నివేదిక పేర్కొంది. ఇంకా ఈ నివేదిక ప్రకారం రోబోట్ ప్రోగ్రామింగ్ మానవుల్లాగానే చేతిని కదిలించే విధంగా జరుగుతుంది. అయితే ఇది మనిషిలా అన్నీ చేయగలిగినా వారిలా ప్రయత్నించలేదని సదరు రిపోర్ట్ పేర్కొంది.

కాగా, ప్రస్తుతం జపాన్‌లో ఉన్న పెప్పర్ రోబోట్ వృద్ధుల సంరక్షణ కోసం పనిచేస్తుంది. అయినప్పటికీ ఇది జపనీస్ మాట్లాడి, కొన్ని రకాల పనులు చేయగల రోబోట్. ఇదే కాకుండా నర్సింగ్ సిబ్బందికి సహాయం చేసే రిబా రోబోట్ కూడా ఉంది. అయితే వీటన్నింటి కంటే గార్మీ చాలా మెరుగ్గా ఉంటుందని, ఇది పూర్తిగా మనుషుల మాదిరిగానే ఉంటుందని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు.

ఇంకా రానున్న కాలంలో ఇది వృద్ధులకు, రోగులకు ఎంతో ఉపయోగకరంగా ఉండబోతోందని, మనుషులు చేయగలిగిన రోజువారీ పనులను ఇది సమర్థవంతంగా నిర్వహించగలదని మ్యూనిచ్ ఇన్‌స్టిట్యూట్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.





























