AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cyber Threats: పెరుగుతున్న సైబర్ మోసాలు.. ఆండ్రాయిడ్ యూజర్లకు అలెర్ట్

ఇటీవల కాలంలో పెరుగుతున్న సైబర్ మోసాలు ప్రజలను భయపెడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (సీఈఆర్‌టీ-ఐఎన్) దేశంలోని ఆండ్రాయిడ్ వినియోగదారులకు పలు హెచ్చరికలను జారీ చేసింది.  ఆండ్రాయిడ్ 12, 12ఎల్, 13, 14ని ఉపయోగిస్తున్న వారు జాగ్రత్తగా ఉండాలని సూచనలు చేసింది. ఫ్రేమ్‌వర్క్, సిస్టమ్, గూగుల్ ప్లే సిస్టమ్ అప్‌డేట్‌లలో పలు ఇబ్బందులను గుర్తించామని సీఈఆర్టీ-ఐఎన్ పేర్కొంది.

Cyber Threats: పెరుగుతున్న సైబర్ మోసాలు.. ఆండ్రాయిడ్ యూజర్లకు అలెర్ట్
Android
Nikhil
|

Updated on: Sep 14, 2024 | 4:45 PM

Share

ఇటీవల కాలంలో పెరుగుతున్న సైబర్ మోసాలు ప్రజలను భయపెడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (సీఈఆర్‌టీ-ఐఎన్) దేశంలోని ఆండ్రాయిడ్ వినియోగదారులకు పలు హెచ్చరికలను జారీ చేసింది.  ఆండ్రాయిడ్ 12, 12ఎల్, 13, 14ని ఉపయోగిస్తున్న వారు జాగ్రత్తగా ఉండాలని సూచనలు చేసింది. ఫ్రేమ్‌వర్క్, సిస్టమ్, గూగుల్ ప్లే సిస్టమ్ అప్‌డేట్‌లలో పలు ఇబ్బందులను గుర్తించామని సీఈఆర్టీ-ఐఎన్ పేర్కొంది. ఈ భద్రతా లోపాల వల్ల దాడి చేసేవారు వ్యక్తిగత డేటాను చోరీ చేసే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ముఖ్యంగా డీఓఎస్ దాడులు పెరిగే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ఆండ్రాయిడ్ యూజర్లకు సీఈఆర్‌టీ హెచ్చరికల గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం. 

ముఖ్యంగా పాత ఆండ్రాయిడ్ వెర్షన్‌లలో రన్ అవుతున్న ఫోన్‌లతో పాటు తాజా సెక్యూరిటీ ప్యాచ్‌లు లేని ఆండ్రాయిడ్ ఫోన్లు అత్యధిక ప్రమాదంలో ఉన్నాయని సీఈఆర్‌టీ నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఓల్డ్ వెర్షన్ ఆండ్రాయిడ్ ఫోన్లను సైబర్ నేరగాళ్లు సులభంగా హ్యాక్ చేసే ప్రమాదం ఉందని, ముఖ్యంగా మన వ్యక్తిగత సమాచారాన్ని యాక్సెస్ చేసే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ఆర్మ్, క్వాల్‌కామ్, యునిసోక్, ఇతర టెక్ ప్రొవైడర్ల ద్వారా సరఫరా చేసిన సాఫ్ట్‌వేర్స్ ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉందని పేర్కొంటున్నారు. ఆండ్రాయిడ్ పరికరంపై అడ్మినిస్ట్రేటివ్ నియంత్రణను పొందడం లేదా మీ ఫోన్ వర్కింగ్‌కు అంతరాయం కలిగించే డీఓఎస్ దాడి చేసే ప్రమాదం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. 

ఆన్‌లైన్ బ్యాంకింగ్, కాన్ఫిడెన్షియల్ డేటా యాక్సెస్, లొకేషన్ షేరింగ్ వంటి సున్నితమైన పనుల కోసం స్మార్ట్‌ఫోన్‌లను ఉపయోగిస్తున్న యుగంలో ఈ రిస్క్‌లు చాలా చేటు చేస్తాయని వివరిస్తున్నారు. ఇలాంటి సమస్యలు పరిష్కరించడానికి గూగుల్ తరచుగా అనేక భద్రతా అప్‌డేట్స్‌ను విడుదల చేస్తూ ఉంటుంది. అయితే చాలా మంది వినియోగదారులు అప్‌డేట్స్ ఇన్‌స్టాలేషన్‌ను అలసత్వం వహిస్తూ ఉంటారు. వారి అలసత్వమే సైబర్ నేరగాళ్లకు వరంగా మారుతుందని, ముఖ్యంగా యూజర్లు ఎప్పటిప్పుడు అప్‌డేట్స్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. 

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..