Lava vs poco: ఎంట్రీ లెవెల్ ఫోన్లలో వీటికి తిరుగేలేదంతే..ఆ రెండు ఫోన్ల మధ్య ప్రధాన తేడాలివే..!
మన దేశంలో ఎంట్రీ లెవెల్ స్మార్ట్ ఫోన్లకు డిమాండ్ చాలా ఎక్కువ. వాటిని కొనడానికి ప్రజలు ఎంతో ఇష్టపడుతున్నారు. ఎంట్రీ లెవెల్ అంటే తక్కువ ధరకు అందుబాటులో ఉండే ఫోన్లు. సామాన్య, మధ్య తరగతి ప్రజలకు వీలుగా ఉండే ధరల్లో ప్రముఖ కంపెనీలు అనేక మోడళ్లు విడుదల చేస్తున్నాయి. ధర తక్కువైనా వీటిలో అన్ని ఫీచర్లు ఉండడం విశేషం.

Phones
లావా, పోకో కంపెనీలు ఈ విభాగంలో తమ మార్కెట్ ను విస్తరిస్తున్నాయి. దీనిలో భాగంగా లావా నుంచి బోర్ట్ ఎన్1, బోల్డ్ ఎన్ ప్రో విడుదలయ్యాయి. వీటికి పోకో సీ71 నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. ఈ ఫోన్ల ప్రత్యేకతలు, ధర, ఇతర వివరాలను తెలుసుకుందాం.
డిస్ ప్లే, డిజైన్
- లావా బోల్డ్ ఎన్1 ప్రో లో 6.67 అంగుళాల హెడ్ డీ ప్లస్ పంచ్ హూల్ డిస్ ప్లే ఏర్పాటు చేశారు. దుమ్ము, ధూళి నుంచి రక్షణకు ఐపీ 54 సర్టిఫికేషన్ తో అందుబాటులోకి తీసుకువచ్చారు.
- పోకో పీ71లో 6.88 అంగుళాల హెచ్ డీ ప్లస్ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ ప్లే ఉంది. ఐపీ 52 రేటింగ్ తో వచ్చింది. సైడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్ ఏర్పాటు చేశారు.
ప్రాసెసర్, పనితీరు
- లావా బోల్డ్ ఎన్ 1 ప్రో లో యూనిసోక్ టీ606 ఆక్టా కోర్ ప్రాసెసర్ ఏర్పాటు చేశారు. 4 జీబీ ర్యామ్, 128 బీజీ స్టోరేజీతో అందుబాటులోకి తీసుకువచ్చారు. దీన్ని మైక్రో ఎస్ డీ కార్డు ద్వారా 256 జీబీ వరకూ విస్తరించుకోవచ్చు.
- పోకో సీ71 ఫోన్ లో యూనిసోక్ టీ7250 ప్రాసెసర్ అమర్చారు. 4 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజీ కలిగి ఉంది. మైక్రో ఎస్ డీ కార్డు ద్వారా 2 టీబీ వరకూ విస్తరించుకోవచ్చు.
కెమెరా
- లావా బోల్డ్ ఎన్ 1 ప్రోలో ఎల్ఈడీ ఫ్లాష్ తో కూడిన 50 ఎంపీ ఏఐ పవర్డ్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, స్క్రీన్ ఫ్లాష్ తో సపోర్టు చేేసే 8 ఎంపీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉన్నాయి.
- పోకో సీ71 ఫోన్ వెనుక భాగంలో 32 ఎంపీ డ్యూయల్ ఏఐ కెమెరాతో పాటు సెల్ఫీలు, వీడియోల కోసం 8 ఎంపీ ఫ్రంట్ కెమెరా ఉన్నాయి.
బ్యాటరీ
- లావాబోల్డ్ ఎన్1 ప్రోలో 18 వాట్స్ కు మద్దతు ఇచ్చే 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఏర్పాటు చేశారు. కానీ బాక్సులో 10 వాట్స్ చార్జర్ మాత్రమే ఉంది.
- పోకో సీ71లో 15 వాట్స్ వైర్డ్ చార్జింగ్ సపోర్టుతో 5200 ఎంఏహెచ్ బ్యాటరీతో తీసుకువచ్చారు.
సాఫ్ట్ వేర్
- బోల్డ్ ఎన్ 1 ప్రో ఫోన్ లో బ్లోట్ వేర్ లేకుండా ఆండ్రాయిడ్ 14 పూర్తి వెర్షన్ ను తీసుకువచ్చారు.
- పోకో సీ71 మాత్రం ఆండ్రాయిడ్ 15 (గో ఎడిషన్)తో వస్తోంది. రెండేళ్ల ఓఎస్ అప్ డేట్లు, 4 ఏళ్ల సెక్యూరిటీ ప్యాచ్ లను కంపెనీ హామీ ఇచ్చింది.
ధర
- లావా బోల్డ్ ఎన్1 ప్రోను ఒకే వేరియంట్ లో తీసుకువచ్చారు. 4 జీబీ ర్యామ్, 126 జీబీ స్టోరేజీ తో రూ.6,699కు అందుబాటులో ఉంది.
- పోకో సీ71 కు సంబంధించి 4 జీబీ ర్యామ్, 65 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.6499కు, 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.7499 ధరకు అందుబాటులో ఉన్నాయి.
లావా బోల్ట్ ఎన్ 1 ప్రో, పోకో సీ71 ఫొన్లలో డిస్ ప్లే, ప్రాసెసర్, బ్యాటరీ, సాఫ్ట్ వేర్ తదితర విషయాల్లో స్పల్వ తేడాలు మాత్రమే ఉన్నాయి. ఈ రెండూ వినియోగదారుల అన్ని అవసరాలను తీర్చుతాయి. ధర కూడా దాదాపు ఒకేలా ఉంటుంది. కాబట్టి ప్రత్యేకతలను జాగ్రత్తగా పరిశీలించి మీకు ఏది సరిపోతుందో ఎంపిక చేసుకోవాలి.








