Flipkart Republic Sale: ఆ ఫోన్లపై రూ. 15,000 వరకూ తగ్గింపు.. మిస్ అయితే మళ్లీ రాదు..
జనవరి 14న ఫ్లిప్ కార్ట్ లో ఈ సేల్ ఆరంభమైంది. కాగా దీనిలో స్మార్ట్ ఫోన్లపై అదిరే ఆఫర్లు ఉన్నాయి. ముఖ్యంగా గ్లోబల్ బ్రాండ్స్ యాపిల్ ఐఫోన్ 15, నథింగ్ ఫోన్(2)పై భారీ తగ్గింపును ఫ్లిప్ కార్ట అందిస్తోంది. రూ. 15,000పైగానే డిస్కౌంట్ లభిస్తోంది. ఇంకెందుకు ఆలస్యం మీరు కనుక ఈ ఫోన్లు కొనుగోలు చేయాలనే ఆలోచనలో ఉంటే ఇదే సరైన సమయం.

కొత్త సంవత్సరం ప్రారంభమైంది. తెలుగిల్లు సంక్రాంతి శోభతో కళకళలాడుతోంది. ఈ క్రమంలోనే వినియోగదారులకు ప్రముఖ ఈ-కామర్స్ సంస్థలు ఆఫర్ల పండగను తీసుకొచ్చాయి. ఫ్లిప్ కార్ట్ తోపాటు అమెజాన్ కూడా రిపబ్లిక్ సేల్స్ ను లాంచ్ చేశాయి. ఒక్క రోజు గ్యాప్ లో ప్రారంభమైన ఈ ఆఫర్ల జాతర ప్రస్తుతం కొనసాగుతోంది. జనవరి 14న ఫ్లిప్ కార్ట్ లో ఈ సేల్ ఆరంభమైంది. కాగా దీనిలో స్మార్ట్ ఫోన్లపై అదిరే ఆఫర్లు ఉన్నాయి. ముఖ్యంగా గ్లోబల్ బ్రాండ్స్ యాపిల్ ఐఫోన్ 15, నథింగ్ ఫోన్(2)పై భారీ తగ్గింపును ఫ్లిప్ కార్ట అందిస్తోంది. రూ. 15,000పైగానే డిస్కౌంట్ లభిస్తోంది. ఇంకెందుకు ఆలస్యం మీరు కనుక ఈ ఫోన్లు కొనుగోలు చేయాలనే ఆలోచనలో ఉంటే ఇదే సరైన సమయం.. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
నథింగ్ ఫోన్(2)పై ఆఫర్లు..
ఈ ఫోన్ ప్రారంభ ధర రూ. 44,999గా ఉంది. ఇది 12జీబీ ర్యామ్/128జీబీ స్టోరేజ్ వేరియంట్. ప్రస్తుతం ఇది ఫ్లిప్ కార్ట్ రిపబ్లిక్ సేల్లో ఏకంగా పదివేలు తగ్గింపుతో రూ. 34,999కి లభిస్తోంది. అంతేకాక ఐసీఐసీఐ బ్యాంక్ డెబిట్ లేదా క్రెడిట్ కార్డులపై కస్టమర్లకు రూ. 2000 బ్యాంక్ తగ్గింపును కూడా అందిస్తోంది. అలాగే పాత ఫోన్ ఎక్స్ చేంజ్ చేస్తే రూ. 3,000 వరకూ బోనస్ పొందొచ్చు. అంతేకాక సీఎంఎఫ్ 65వాట్ల జీఏఎన్ చార్జర్ రూ. 1,999కే కొనుగోలు చేయొచ్చు. దీని వాస్తవ ధర రూ. 2,999 ఉంటుంది.
నథింగ్ ఫోన్ (2) స్పెసిఫికేషన్‌లు..
ఆండ్రాయిడ్ 13-ఆధారిత నథింగ్ ఓఎస్ 2.0పై ఆపరేటింగ్, డ్యూయల్-సిమ్ (నానో) నథింగ్ ఫోన్ (2) 6.7-అంగుళాల ఫుల్ హెచ్డీ (1,080×2,412 పిక్సెల్‌లు) ఓఎల్ఈడీ డిస్‌ప్లేను అందిస్తుంది. 120హెర్జ్ రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. ఇది క్వాల్కామ్ స్నాప్ డ్రాగన్ 8 ప్లస్ జెన్ 1 ఎస్ఓసీ ద్వారా శక్తిని పొందుతుంది. 12జీబీ ర్యామ్, 128జీబీ మెమరీ ఉంటుంది. వెనుకవైపు 50ఎంపీ ప్రైమరీ కెమెరా ఉంటుంది. 1.56 అంగుళాల సోనీ ఐఎంఎక్స్ 890 సెన్సార్ ను కలిగి ఉంటుంది. ముందు వైపు 32ఎంపీ కెమెరా ఉంటుంది. 45వాట్ల వైర్డు చార్జింగ్, 5వాట్ల క్యూఐ వైర్‌లెస్ చార్జింగ్‌కు మద్దతునిస్తుంది. 4,700ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది.
ఐఫోన్ 15పై ఆఫర్లు..
ఈ ఫోన్ వాస్తవ ధర రూ. 79,900గా ఉంది. ఫ్లిప్ కార్ట్ లో దీనిపై 17శాతం తగ్గింపు ఉంది. అంటే ప్రస్తుతం దీనిపై రూ. 13,901 తగ్గి కేవలం రూ. 65,999కి లభిస్తోంది. అదనంగా బ్యాంక్ ఆఫర్లను పొందొచ్చు. బై విత్ ఎక్స్ చేంజ్ పాలసీపై కొనుగోలు చేస్తే రూ. 54,990 వరకూ తగ్గింపు లభించే అవకాశం ఉంది. 128జీబీ మెమరీ ఉంటుంది. ముందు వైపు 12ఎంపీ కెమెరా, వెనుకవైపు 48ఎంపీ కెమెరా ఉంటుంది. 6.1 అంగుళాల సూపర్ రెటీనా ఎక్స్ డీఆర్ డిస్ ప్లే ఉంటుంది.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..