Tecno Pop 8 Smartphone: చీప్ అండ్ బెస్ట్ స్మార్ట్ ఫోన్.. టాప్ స్పెసిఫికేషన్లు.. సూపర్ ఫీచర్లు..
టెక్నో నుంచి కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్ అయ్యింది. టెక్నో పాప్ 8 పేరుతో ఎంట్రీ లెవెల్ బడ్జెట్లో ఆవిష్కరించింది. దీనిలో 90హెర్జ్ డిస్ ప్లే, ఆక్టా కోర్ చిప్ సెట్, 12ఎంపీ ప్రైమరీ కెమెరా, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ వంటి ఫీచర్లు ఉన్నాయి. అతి తక్కువ ధరలో ఈ ఫోన్ వినియోగదారులకు అందుబాటులో ఉండనుంది. ఈ టెక్నో పాప్ 8 స్మార్ట్ ఫోన్ స్పెసిఫికేషన్స్, ఫీచర్లు, ధర వంటి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

స్మార్ట్ ఫోన్ అనేది నటి కాలంలో అనివార్యంగా మారిపోయింది. అది లేకుండా మనం ఏ పని చేసుకోలేని పరిస్థితి. అయితే వాటి ధరలు కూడా అందులోని ఫీచర్ల ఆధరంగా ఉంటున్నాయి. చాలా మంది అనువైన ధరలో బెస్ట్ ఫీచర్లు, టాప్ స్పెక్స్ ఉన్న స్మార్ట్ ఫోన్ కావాలని చాలా కోరుకుంటున్నారు. మీరూ అలాంటి ఆలోచనలో ఉంటే ఈ కథనం మీ కోసమే. టెక్నో నుంచి కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్ అయ్యింది. టెక్నో పాప్ 8 పేరుతో ఎంట్రీ లెవెల్ బడ్జెట్లో ఆవిష్కరించింది. దీనిలో 90హెర్జ్ డిస్ ప్లే, ఆక్టా కోర్ చిప్ సెట్, 12ఎంపీ ప్రైమరీ కెమెరా, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ వంటి ఫీచర్లు ఉన్నాయి. అతి తక్కువ ధరలో ఈ ఫోన్ వినియోగదారులకు అందుబాటులో ఉండనుంది. ఈ టెక్నో పాప్ 8 స్మార్ట్ ఫోన్ స్పెసిఫికేషన్స్, ఫీచర్లు, ధర వంటి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
టెక్నో పాప్ 8 ధర, లభ్యత..
టెక్నో పాప్ 8 స్మార్ట్ ఫోన్ గ్రావిటీ బ్లాక్, మిస్టరీ వైట్ కలర్ ఆప్షన్లలో లభిస్తోంది. దీని ధర కేవలం రూ. 6,499గా ఉంది. వినియోగదారులు ఈ స్మార్ట్ ఫోన్ ను ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్ ఫారం అమెజాన్లో 2024, జనవరి 9 నుంచి కొనుగోలు చేయొచ్చు. అంతేకాక ప్రారంభ ఆఫర్ కింద దీని ధర మరింత తగ్గుతుంది. కేవలం రూ. 5,999కే దీనిని సొంతం చేసుకోవచ్చు. అయితే ఇది పరిమిత కాలం మాత్రమే అందుబాటులో ఉంటుంది.
టెక్నో పాప్ 8 స్పెసిఫికేషన్లు..
ఈ స్మార్ట్ ఫోన్ 6.6 అంగుళాల హెచ్ డీ ప్లస్ డిస్ ప్లే 1612*720 పిక్సల్ రిజల్యూషన్ తో వస్తుంది. 90హెర్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటుంది. దీనిలో ఆక్టా కోర్ యూనిసోక్ టీ606 నుంచి శక్తిని పొందుతుంది. 4జీబీ ర్యామ్, 64జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది. మైక్రో ఎస్డీ కార్డు వినియోగించుకొని 256జీబీ వరకూ ఎక్స్ పాండ్ చేసుకోవచ్చు. ఈ స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్ తో పాటు టెక్నో కంపెనీకి చెందిన హైఓఎస్ 13 ఆధారంగా పనిచేస్తుంది. డ్యూయల్ సిమ్ సపోర్టు ఉంటుంది.
కెమెరా వివరాలు..
ఇక కెమెరా విషయానికి వస్తే దీనిలో 12ఎంపీ ప్రధాన కెమెరా, సెకండరీ ఏఐ లెన్స్ ఉంటాయి. ముందు వైపు 8ఎంపీ కెమరా ఉంటుంది. ఎల్ఈడీ ఫ్లాష్ ఉంటుంది. సెక్యూరిటీ కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, 5000ఎంఏహెచ్ సామర్థ్యంతో బ్యాటరీ, 10 వాట్ల చార్జింగ్ సపోర్టు ఉంటుంది.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..