Best Smartphones Under 20K: మార్కెట్లో తక్కువ ధరకే లభించే టాప్ 5జీ ఫోన్లు ఇవే..
మార్కెట్లో అందుబాటులో ఉన్న విభిన్న రకాల స్మార్ట్ ఫోన్లలో బెస్ట్ ఎంపిక చేసుకోవడం కాస్త కష్టమైన పనే. అయితే రూ. 20,000 లోపు ధరలో మీకు బెస్ట్ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో ఓఎల్ఈడీ డిస్ ప్లే, సూపర్ జూమ్ కెమెరా, అత్యాధునిక ప్రాసెసర్లు అందుబాటులో ఉంటున్నాయి. అలాంటి 5జీ స్మార్ట్ ఫోన్ల జాబితా మీకు అందిస్తున్నాం. మీరు రూ. 20,000 బడ్జెట్లో స్మార్ట్ ఫోన్ కొనాలనుకుంటే ఈ కథనం మిస్ కాకండి..

ప్రపంచ మార్కెట్లో అంతకంతకూ డిమాండ్ పెరుగుతున్న ఏకైక గ్యాడ్జెట్ స్మార్ట్ ఫోన్. రోజురోజుకీ కొత్త కొత్త ఫీచర్లు, అత్యాధునిక స్సెసిఫికేషన్లతో వినియోగదారులకు ఆకర్షిస్తున్నాయి. ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన 5జీ టెక్నాలజీతో స్మార్ట్ ఫోన్ల పనితీరు, వాటి వేగం, ఇంటర్ నెట్ వినియోగం మరో లెవెల్ కు చేరింది. అయితే మార్కెట్లో అందుబాటులో ఉన్న విభిన్న రకాల స్మార్ట్ ఫోన్లలో బెస్ట్ ఎంపిక చేసుకోవడం కాస్త కష్టమైన పనే. అయితే రూ. 20,000 లోపు ధరలో మీకు బెస్ట్ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో ఓఎల్ఈడీ డిస్ ప్లే, సూపర్ జూమ్ కెమెరా, అత్యాధునిక ప్రాసెసర్లు అందుబాటులో ఉంటున్నాయి. అలాంటి 5జీ స్మార్ట్ ఫోన్ల జాబితా మీకు అందిస్తున్నాం. మీరు రూ. 20,000 బడ్జెట్లో స్మార్ట్ ఫోన్ కొనాలనుకుంటే ఈ కథనం మిస్ కాకండి..
శామ్సంగ్ గెలాక్సీ ఏ15 5జీ..
ఈ స్మార్ట్ ఫోన్లో 6.5 అంగుళాల డిస్ ప్లే ఉంటుంది. ఆండ్రాయిడ్ 14, వన్ యూఐ కోర్ 5.0 ప్రాసెసర్ ఆధారంగా పనిచేస్తుంది. 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ సామర్థ్యం ఉంటుంది. వెనుకవైపు 50ఎంపీ, 2ఎంపీ, 2ఎంపీతో కూడిన ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. ముందు వైపు 13ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంటుంది. బ్యాటరీ 5000ఎంఏహెచ్ సామర్థ్యంతో ఉంటుంది. దీని ధర ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్ ఫారం అమెజాన్లో రూ. 19,390గా ఉంది.
వన్ ప్లస్ నోర్డ్ సీఈ3 లైట్ 5జీ..
దీనిలో 6.72 అంగుళాల ఫుల్ హెచ్ డీ ప్లస్ డిస్ ప్లే ఉంటుంది. క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 695 5జీ ప్రాసెసర్ ఆధారంగా పనిచేస్తుంది. 8జీబీ ర్యామ్, 128జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ సామర్థ్యంతో ఉంటుంది. వెనుకవైపు 108ఎంపీ, 2ఎంపీ, 2ఎంపీ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. ముందు వైపు 16ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంటుంది. బ్యాటరీ 5000ఎంఏహెచ్ సామర్థ్యంతో వస్తుంది. ఆక్సిజన్ ఓఎస్ ఆధారిత ఆండ్రాయిడ్ 13.1 ఆపరేటింగ్ సిస్టమ్ తో పనిచేస్తుంది. దీని ధర అమెజాన్లో 19,999గా ఉంది.
రియల్ మీ నార్జో 60 5జీ..
ఈస్మార్ట్ ఫోన్లో 6.43 అంగుళాల 90హెర్జ్ సూపర్ అమోల్డ్ డిస్ ప్లే ఉంటుంది. మీడియా టెక్ డైమెన్సిటీ 6020 5జీ చిప్ సెట్ తో శక్తిని పొందుతుంది. 8జీబీ ర్యామ్, 128జీబీ/256జీబీ స్టోరేజ్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. 64ఎంపీ ప్రైమరీ కెమెరాతో 2ఎంపీ లెన్స్ ఉంటాయి. ముందు వైపు 16ఎంపీ సెల్పీ కెమెరా ఉంటుంది. 5000ఎంఏహెచ్ సామర్థ్యంతో బ్యాటరీ వస్తుంది. రియల్ మీ యూఐ4 ఆధారంగా పనిచేసే ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్ పై ఫోన్ పనిచేస్తుంది. దీని ధర అమెజాన్లో రూ. 15,999గా ఉంది.
వన్ ప్లస్ నోర్డ్ సీఈ 2 లైట్ 5జీ..
ఈ స్మార్ట్ ఫోన్లో 6.59 అంగుళాల డిస్ ప్లే ఉంటుంది. క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 695 5జీ ప్రాసెసర్ తో శక్తిని పొందుతుంది. 6జీబీ/8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ సామర్థ్యంతో వస్తుంది. వెనుకవైపు 64ఎంపీ, 2ఎంపీ, 2ఎంపీ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. ముందు వైపు 16ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంటుంది. బ్యాటరీ 5000ఎంఏహెచ్ సామర్థ్యంతో వస్తుంది. ఆక్సిజన్ ఓఎస్ ఆధారిత ఆండ్రయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్ తో పనిచేస్తుంది. దీని ధర అమెజాన్లో రూ. 17,999గా ఉంది.
శామ్సంగ్ గెలాక్సీ ఎం34 5జీ..
ఈ స్మార్ట్ ఫోన్లో 6.6 అంగుళాల 1080 x 2400 పిక్సల్స్ రిజల్యూషన్ తో కూడిన డిస్ ప్లే ఉంటుంది. ఎక్సినోస్ 1280 ఆక్టా కోర్ 2.4 జీహెర్జ్ 5ఎన్ఎం ప్రాసెసర్ నుంచి శక్తిని పొందుతుంది. 8జీబీ ర్యామ్, 128జీబీ ఇంటర్నల్ మెమరీ ఉంటుంది. వెనుక వైపు 50ఎంపీ, 5ఎంపీ, 2ఎంపీ, 2ఎంపీ కెమెరా సెటప్ ఉంటుంది. 8ఎంపీ ఫ్రంట్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. బ్యాటరీ 5000ఎంఏహెచ్ సామర్థ్యంతో వస్తుంది. ఆండ్రాయిడ్ వీ12.0 ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారంగా పనిచేస్తుంది. దీని ధర అమెజాన్లో రూ. 19,640గా ఉంది.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..