Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Girls Smartwatches: ఆడపిల్లల మణికట్టును మరింత అందంగా మార్చే స్మార్ట్ వాచ్‌లు ఇవే.. సూపర్ స్మార్ట్ ఫీచర్లు.. హెల్త్ ట్రాకర్లు..

మార్కెట్లో పెద్ద సంఖ్యలో అందుబాటులో ఉన్న స్మార్ట్ వాచ్లలో మన బడ్జెట్ కు అనుగుణంగా అందుబాటులో ఉన్న స్మార్ట్ వాచ్ ఎంపిక చేసుకోవడం కాస్త కష్టమైన పనే. ఈ నేపథ్యంలో ఆడ పిల్లలకు సరిగ్గా సరిపోయే బెస్ట్ స్మార్ట్ వాచ్ లను మీకు అందిస్తున్నాం. అవికూడా టాప్ బ్రాండ్ నుంచి అనువైన బడ్జెట్లో అందుబాటులో ఉన్నవే. ఓ లుక్కేయండి..

Girls Smartwatches: ఆడపిల్లల మణికట్టును మరింత అందంగా మార్చే స్మార్ట్ వాచ్‌లు ఇవే.. సూపర్ స్మార్ట్ ఫీచర్లు.. హెల్త్ ట్రాకర్లు..
Smartwatch
Follow us
Madhu

| Edited By: Ravi Kiran

Updated on: Jan 15, 2024 | 5:40 PM

నేటి యువత స్టైల్, ఫ్యాషన్ ను కోరుకుంటోంది. వారు వాడే వస్తువులు, గ్యాడ్జెట్లు అన్నీ తమకు కొత్త అందాన్ని తీసుకు రావాలని ఆశిస్తోంది. అందులో భాగంగా ఇటీవల కాలంలో స్మార్ట్ వాచ్ లను అధికంగా వినియోగిస్తోంది. పైగా అందులోని అడిషనల్ ఫీచర్లు, హెల్త్ ట్రాకర్లు కూడా బాగా ఆకర్షిస్తున్నాయి. ముఖ్యంగా యువతులకు ఇవి బాగా ఉపయోగపడుతున్నాయి. కలర్ ఫుల్ డిజైన్స్, ఎప్పటికప్పుడు మారుతుండే వాచ్ ఫేసెస్ మరింత స్టైల్ ను వారి మణికట్టుకు జోడిస్తున్నాయి. అంతేకా నోటిఫికేషన్లు ఎప్పటికప్పుడు తెలుసుకోవడం, మ్యూజిక్ ను కూడా చేతి నుంచే ఆస్వాదించే అవకాశం ఉండటంతో ఇది లేకుండా బయటకు రావడం లేదు. అయితే మార్కెట్లో పెద్ద సంఖ్యలో అందుబాటులో ఉన్న స్మార్ట్ వాచ్లలో మన బడ్జెట్ కు అనుగుణంగా అందుబాటులో ఉన్న స్మార్ట్ వాచ్ ఎంపిక చేసుకోవడం కాస్త కష్టమైన పనే. ఈ నేపథ్యంలో ఆడ పిల్లలకు సరిగ్గా సరిపోయే బెస్ట్ స్మార్ట్ వాచ్ లను మీకు అందిస్తున్నాం. అవికూడా టాప్ బ్రాండ్ నుంచి అనువైన బడ్జెట్లో అందుబాటులో ఉన్నవే. ఓ లుక్కేయండి..

ఫైర్ బోల్ట్ నింజా కాల్ ప్రో మ్యాక్స్ స్మార్ట్..

ఇది ఐడియల్ ఫ్యూజన్, ఫ్యాషన్, టెక్నాలజీల మేలు కలయికతో వస్తోంది. దీనిలో 2.01 డిస్ ప్లే, మెటల్ బాడీ, లాంగ్ లాస్టింగ్ బ్యాటరీ ఉంటుంది. వాయిస్ అసిస్టెన్స్, 120 ప్లస్ స్పోర్ట్స్ మోడ్లు, బ్లూటూత్ కాలింగ్, కెమెరా, ఆడియో కంట్రోల్, స్మార్ట్ నోటిఫికేషన్స్, హెల్త్ ఫీచర్లు, ఐపీ67 వాటర్ రెసిస్టెంట్ ఫీచర్లు ఉంటాయి. ఇది ఐదు రంగుల్లో అందుబాటులో ఉంది. దీని ధర అమెజాన్ ప్లాట్ ఫారంలో కేవలం రూ. 1,399గా ఉంది.

నాయిస్ పల్స్ గో బజ్ స్మార్ట్ వాచ్..

ఈ స్మార్ట్ వాచ్ లో 1.69 అంగుళాల టీఎఫ్టీ డిస్ ప్లే ఉంటుంది. అడ్వాన్స్ డ్ బ్లూటూత్ కాలింగ్ ఫీచర్ తో పాటు ట్రూ సింక్ టెక్నాలజీ తో సులభమైన కనెక్టివిటీ ఉంటుంది. 100 స్పోర్ట్స్ మోడ్స్, నాయిస్ హెల్త్ స్యూట్ ద్వారా విస్తృతమైన హెల్త్ ఫీచర్లు ఉంటాయి ఐపీ68 వాటర్ రెసిస్టెన్స్ కు మద్దతునిస్తుంది. 150 ప్లస్ వాచ్ ఫేసెస్ ఉంటాయి. దీని ధర అమెజాన్ ప్లాట్ ఫారం రూ. 1,299గా ఉంది.

ఇవి కూడా చదవండి

బోట్ వేవ్ కాల్ 2 స్మార్ట్ వాచ్..

ఈ స్మార్ట్ వాచ్ లో 1.83 అంగుళాల డిస్ ప్లే ఉంటుంది. బ్లూటూత్ కాలింగ్, డీఐవై వాచ్ ఫేస్ స్టూడియో , 700 ప్లస్ యాక్టివ్ మోడ్స్ ఉంటాయి. లైవ్ క్రికెట్ స్కోర్లు తెలుసుకోవచ్చు. ఫిట్ నెస్ ట్రాకర్లు ఆకట్టుకుంటాయి. ఇది తొమ్మిది రంగుల్లో అందుబాటులో ఉంటుంది. దీని ధర అమెజాన్ ప్లాట్ ఫారంలో దీని ధర రూ. 1,499గా ఉంది.

ఫైర్ బోల్ట్ నింజా 3 స్మార్ట్ వాచ్..

ఈ స్మార్ట్ వాచ్ నుంచి 1.69 అంగుళాల హెచ్ డీ ఫుల్ టచ్ డిస్ ప్లే ఉంటుంది. దీనిలో 60 స్పోర్ట్స్ మోడ్స్ ఉంటాయి. దీనిలో ఎస్పీఓ2 హార్ట్ రేట్ మోనిటరింగ్ వంటి హెల్త్ ట్రాకర్లు ఉంటాయి. ఐపీ68 వాటర్ రెసిస్టెన్స్ ఉంటాయి. ఏడు రోజుల వరకూ లాంగ్ బ్యాటరీ లైఫ్ ఉంటుంది. ఏడు రంగుల్లో అందుబాటులో ఉంటుంది. దీని ధర అమెజాన్ ప్లాట్ ఫారంలో రూ. 1,099గా ఉంది.

నాయిస్ బ్లూటూత్ కాలింగ్ స్మార్ట్ వాచ్..

నాయిస్ నుంచి కొత్తగా లాంచ్ అయిన ఈ స్మార్ట్ వాచ్ లో 1.81 అంగుళాల టీఎఫ్టీ డిస్ ప్లే ఉంటుంది. ఆడియో కంట్రోల్, బ్లూటూత్ కాలింగ్, వాల్యూమ్ కంట్రోల్ ఉంటుంది. 100 వాచ్ ఫేసెస్ ఉంటాయి. 100 స్పోర్ట్స్ మోడ్లు ఉంటాయి. బిల్ట్ ఇన్ గేమ్స్ ఉంటాయి. 160 ప్లస్ గంటల బ్యాటరీ లైఫ్ ఉంటుంది. దీని ధర అమెజాన్లో రూ. 1,299గా ఉంది.

బోట్ ఎక్స్ టెండ్ స్మార్ట్ వాచ్..

ఈ స్మార్ట్ వాచ్ 1.69 హెచ్ డీ డిస్ ప్లే అలెక్సా బిల్ట్ ఇన్ గా ఉంటుంది. మార్చుకోదగిన వాచ్ ఫేసెస్ ఉంటాయి. స్ట్రెస్ మోనిటరింగ్, హెచ్ ఆర్ అండ్ ఎస్పీఓ2 ట్రాకింగ్ ఉంటుంది. 15 స్పోర్ట్స్ మోడ్స్ ఉంటాయి. ఏడు రోజుల బ్యాటరీ లైఫ్ ఉంటుంది. ఇది 22 రంగుల్లో అందుబాటులో ఉంది. దీని ధర అమెజాన్లో రూ. 17,99గా ఉంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..