AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vodafone Idea Plans: ఒక్కసారి రీచార్జ్ చేస్తే 365 రోజుల వ్యాలిడిటీ.. వొడాఫోన్-ఐడియా నుంచి అదిరే ప్లాన్లు..

ఒక్కసారి రీచార్జ్ చేస్తే మళ్లీ దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేకుండా ఏడాది పాటు వ్యాలిడిటీతో ఉంటుంది. ఇలాంటి ప్రీ పెయిడ్ ప్లాన్లు వొడాఫోన్ ఐడియాలో ఐదు ఉన్నాయి. వీటి ధరలు కాస్త ఎక్కువగానే ఉన్నా.. ఆ ధరలకు తగిన విధమైన ప్రయోజనాలు 365 రోజుల పాటు అందుతాయి. ఈ ప్లాన్లు రూ. 1799 నుంచి ప్రారంభమై రూ. 3,199 వరకూ ఉంటాయి.

Vodafone Idea Plans: ఒక్కసారి రీచార్జ్ చేస్తే 365 రోజుల వ్యాలిడిటీ.. వొడాఫోన్-ఐడియా నుంచి అదిరే ప్లాన్లు..
Vodafone Idea Recharge Plans
Madhu
|

Updated on: Jan 14, 2024 | 7:31 AM

Share

మన దేశంలో ఎయిర్ టెల్, జియో తర్వాత మూడో అతి పెద్ద టెలికాం కంపెనీ అయిన వొడాఫోన్ ఐడియా (వీఐ). ప్రత్యేకమైన ప్లాన్లు, మంచి నెట్ వర్క్ సపోర్టుతో అగ్రస్థానం కోసం పోటీపడుతోంది. ఈ క్రమంలో వొడాఫోన్ ఐడియా కొత్తగా సంవత్సర వ్యాలిడిటీతో ఉండే రీచార్జ్ ప్లాన్లను తీసుకొచ్చింది. ప్రతి నెలా రీచార్జ్ చేసుకోవాలంటే ఇబ్బందిగా ఫీల్ అయ్యే వారు ఈ ప్లాన్లు బాగా ఉపకరిస్తాయి. ఒక్కసారి రీచార్జ్ చేస్తే మళ్లీ దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేకుండా ఏడాది పాటు వ్యాలిడిటీతో ఉంటుంది. ఇలాంటి ప్రీ పెయిడ్ ప్లాన్లు వొడాఫోన్ ఐడియాలో ఐదు ఉన్నాయి. ఈ ధరలు కాస్త ఎక్కువగానే ఉన్నా.. ఆ ధరలకు తగిన విధమైన ప్రయోజనాలు 365 రోజుల పాటు అందుతాయి. వీటి ధరలు రూ. 1799 నుంచి ప్రారంభమై రూ. 3,199 వరకూ ఉంటాయి. వీటి గురించి తెలుసుకుందాం..

వొడాఫోన్-ఐడియా రూ. 1,799 ప్లాన్..

ఈ ప్లాన్లో 365 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. అపరిమిత కాలింగ్ అవకాశంతో పాటు 24జీబీ డేటా, 3,600 ఎస్ఎంఎస్లను ఉచితంగా అందిస్తుంది. అదనంగా వీఐ మూవీస్ అండ్ టీవీ యాప్ ప్రయోజనాలను పొందుకోవచ్చు.

వొడాఫోన్-ఐడియా రూ. 2899 ప్లాన్..

ఈ ప్లాన్ 365 రోజుల సర్వీస్ వ్యాలిడిటీతో వస్తుంది. 1.5జీబీ రోజువారీ డేటా లభిస్తుంది. అలాగే అపరిమిత వాయిస్ కాలింగ్ కు అవకాశం ఉంటుంది. ప్రతి రోజూ 100 ఎస్ఎంఎస్ ఉచితంగా లభిస్తుంది. అలాగే వీఐ హీరో అపరిమిత ప్రయోజనాలతో పాటు వీఐ మూవీస్ అండ్ టీవీ కూడా ఉన్నాయి. వీఐ హీరో అన్‌లిమిటెడ్ బెనిఫిట్స్‌లో వీకెండ్ డేటా రోల్‌ఓవర్, డేటా డిలైట్స్, బింగే ఆల్ నైట్ వంటివి ఉంటాయి.

ఇవి కూడా చదవండి

వోడాఫోన్-ఐడియా రూ. 2999 ప్లాన్..

వోడాఫోన్ ఐడియా అందిస్తున్న ఈ ప్లాన్ కూడా 365 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. దీనిలో 850జీబీ లంప్సమ్ డేటా లభిస్తుంది. అలాగే అపరిమిత వాయిస్ కాలింగ్, 100 ఎస్ఎంఎస్ ప్రతి రోజూ ఉచితంగా లభిస్తాయి. అలాగే వీఐ మూవీస్ అండ్ టీవీ యాప్ యాక్సెస్ ను పొందొచ్చు.

వోడాఫోన్-ఐడియా రూ. 3,099 ప్లాన్..

వోడాఫోన్ ఐడియా వార్షిక వ్యాలిడిటీతో అందిస్తున్న మరో ప్లాన్ ఇది. రూ. 3,099తో రీచార్జ్ చేస్తే ప్రతి రోజూ 2జీబీ డేటా, 100ఎస్ఎంలు ఉచితంగా పొందొచ్చు. అలాగే అపరిమిత వాయిస్ కాలింగ్‌ చేసుకోవచ్చు. ప్రస్తుతం, మీరు స్మార్ట్‌ఫోన్‌ల కోసం వీఐ యాప్ ద్వారా రీఛార్జ్ చేసుకుంటే రూ.75 తగ్గింపు ఆఫర్‌తో అందుబాటులో ఉంటుంది. (ఐఓఎస్, ఆండ్రాయిడ్ రెండింటికీ ఇది అందుబాటులో ఉంది). ఈ ప్లాన్ నుంచి వచ్చే అదనపు ప్రయోజనాలు వీఐ మూవీస్ అండ్ టీవీ, డిస్నీ ప్లస్ హాట్ స్టార్ మొబైల్, బింజ్ ఆల్ నైట్, వీడెంట్ డేటా రోల్ ఓవర్, డేటా డిలైట్స్ వంటి యాప్స్ కు ఉచిత యాక్సెస్ లభిస్తుంది.

వోడాఫోన్-ఐడియా రూ. 3199 ప్లాన్..

ఈ జాబితాలో చివరిగా వస్తున్న ప్లాన్ ఇది. ఇటీవలే వోడాఫోన్ ఐడియా దీనిని ప్రకటించింది. ప్రతి రోజు 2జీబీ డేటాతో పాటు 100 లు ఉచితంగా లభిస్తాయి. , అపరిమిత వాయిస్ కాలింగ్ తో వస్తుంది. అదనంగా బింజ్ ఆల్ నైట్, వీడెంట్ డేటా రోల్ ఓవర్, డేటా డిలైట్స్, ఒక ఏడాదికి ప్రైమ్ వీడియో, వీఐ మూవీస్ అండ్ టీవీ యాప్లకు ఉచిత యాక్సెస్ లభిస్తుంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

రెండు కోట్లు లేవు అన్నవారికి 26 బంతుల్లోనే సమాధానం చెప్పాడు
రెండు కోట్లు లేవు అన్నవారికి 26 బంతుల్లోనే సమాధానం చెప్పాడు
క్రిస్మస్ పర్వదినాన కాలిఫోర్నియాను ముంచెత్తిన వరదలు
క్రిస్మస్ పర్వదినాన కాలిఫోర్నియాను ముంచెత్తిన వరదలు
సీన్ గురించి చెప్పాలని గదిలోకి అలా ప్రవర్తించాడు..
సీన్ గురించి చెప్పాలని గదిలోకి అలా ప్రవర్తించాడు..
ఈజీగా డబ్బులు వస్తాయనుకున్నాడు.. కానీ చివరకు ఇలా బలైపోయాడు..
ఈజీగా డబ్బులు వస్తాయనుకున్నాడు.. కానీ చివరకు ఇలా బలైపోయాడు..
శ్రేయస్ అయ్యర్ రిటర్న్ గిఫ్ట్.. నెట్స్‌లో బ్యాటింగ్ షురూ
శ్రేయస్ అయ్యర్ రిటర్న్ గిఫ్ట్.. నెట్స్‌లో బ్యాటింగ్ షురూ
చివరిశనివారం-ఈ పరిహారాలతో వచ్చే ఏడాది పొడవునా డబ్బుకు కొరత ఉండదు!
చివరిశనివారం-ఈ పరిహారాలతో వచ్చే ఏడాది పొడవునా డబ్బుకు కొరత ఉండదు!
అతడంటే పిచ్చి.. క్రష్ ఎవరో చెప్పిన కాజల్..
అతడంటే పిచ్చి.. క్రష్ ఎవరో చెప్పిన కాజల్..
2026లో మీ అదృష్టాన్ని మార్చే ప్రత్యేక ఉపవాసాలు!సంపన్న జీవితం కోసం
2026లో మీ అదృష్టాన్ని మార్చే ప్రత్యేక ఉపవాసాలు!సంపన్న జీవితం కోసం
రైతులకు గుడ్‌న్యూస్.. ఇక దళారుల టెన్షన్ లేనట్టే..
రైతులకు గుడ్‌న్యూస్.. ఇక దళారుల టెన్షన్ లేనట్టే..
పిల్లల్ని కంటే ప్రోత్సాహకాలు.. జనాభా పెంచడానికి ప్రభుత్వం ప్లాన్
పిల్లల్ని కంటే ప్రోత్సాహకాలు.. జనాభా పెంచడానికి ప్రభుత్వం ప్లాన్