AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Instagram: ఇన్‌స్టా చాట్‌లో అదిరే ఫీచర్‌.. మూడో కంటికి తెలియకుండా దానిని మార్చేయొచ్చు..

సాధారణంగా సోషల్‌ మీడియాలో ఎవరికైనా మెసేజ్‌ పంపిస్తే..దానిలో ఏదైనా అక్షరం, లేదా పదం తప్పుగా టైప్‌ అయ్యిందనుకోండి.. అలాగే వెళ్లపోతే దానిని తిరిగి ఎడిట్‌ చేసుకోవడం కుదరదు. అయితే ఇన్‌స్టాగ్రామ్‌(డీఎం) ద్వారా పంపిన మెసేజ్‌ ను ఎడిట్‌ చేసుకొనే అవకాశం ఉంటుంది. అంతేకాక మీరు ఎడిట్‌ చేశారు అన్న విషయం కూడా అవతలి వ్యక్తికి తెలియకుండా దానిని చేయొచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం..

Instagram: ఇన్‌స్టా చాట్‌లో అదిరే ఫీచర్‌.. మూడో కంటికి తెలియకుండా దానిని మార్చేయొచ్చు..
Instagram
Madhu
| Edited By: |

Updated on: Jan 14, 2024 | 8:45 AM

Share

సోషల్‌ మీడియా ప్లాట్‌ ఫారంలలో ఇన్‌స్టాగ్రామ్‌కు మంచి డిమాండ్‌ ఉంది. పోస్టింగ్స్‌, రీల్స్‌, స్టోరీస్‌తోపాటు చాటింగ్‌కి కూడా దీనిని ఎక్కువగా వినియోగిస్తున్నారు. ముఖ్యంగా యూత్‌ ఇన్‌స్టాకి బాగా కనెక్ట్‌ అవుతున్నారు. వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా ఇన్‌స్టాగ్రామ్‌ కూడా కొత్త కొత్త ఫీచర్లను ప్రవేశపెడుతుంటుంది. ఈ క్రమంలో మరో సరికొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. వాస్తవానికి చాలా మెసేజింగ్‌ యాప్స్‌లో ఇప్పటికే ఉన్నదే ఈ ఫీచర్‌. అదేంటంటే మనం ఇన్‌స్టాలో పంపిన మెసేజ్‌ను రీ ఎడిట్‌ చేసుకొనే వెసులుబాటు ఇన్‌బిల్ట్‌గా వచ్చింది. సాధారణంగా సోషల్‌ మీడియాలో ఎవరికైనా మెసేజ్‌ పంపిస్తే..దానిలో ఏదైనా అక్షరం, లేదా పదం తప్పుగా టైప్‌ అయ్యిందనుకోండి.. అలాగే వెళ్లపోతే దానిని తిరిగి ఎడిట్‌ చేసుకోవడం కుదరదు. అయితే ఇన్‌స్టాగ్రామ్‌(డీఎం) ద్వారా పంపిన మెసేజ్‌ ను ఎడిట్‌ చేసుకొనే అవకాశం ఉంటుంది. అంతేకాక మీరు ఎడిట్‌ చేశారు అన్న విషయం కూడా అవతలి వ్యక్తికి తెలియకుండా దానిని చేయొచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం..

ఎలా చేయాలంటే..

ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ కొత్త మెసేజ్‌ ఎడిట్‌ ఫీచర్‌గా అందుబాటులో ఉంది. అయితే ఇది రెండు ఫీచర్లను కలపడం ద్వారా సాధ్యమవుతుంది. అదెలాగో తెలుసుకోవాలంటే.. ఈ ఫీచర్‌ను యాక్టివేట్‌ చేయాలంటే ఈ స్టెప్‌ బై స్టెప్‌ గైడ్‌ ను వినియోగించండి..

ఇవి కూడా చదవండి
  • మీరు ఇన్‌గ్రామ్‌లో తప్పు సందేశాన్ని పంపిన చాట్ విండోకు వెళ్లండి.
  • ఆ తర్వాత, ఆ మెసేజ్‌పై ట్యాప్‌ చేసి, లాంగ్‌ ప్రెస్‌ చేయాలి. తర్వాత దానిని కాపీ చేయాలి. ఆపై దాన్ని డిలీట్‌ చేయండి.
  • అయితే అలా మెసేజ్ డిలీట్ అయిన విషయం మీరు మెసేజ్‌ సెండ్‌ చేసిన వ్యక్తికి తెలియదు. అదే వాట్సాప్‌ వంటి ఇతర మెసేజింగ్‌ యాప్స్‌లో డిలీట్‌ చేస్తే అవతలి వ్యక్తికి కూడా తెలిసిపోతుంది. కానీ ఇన్‌స్టాలో తెలీదు.
  • దీని తర్వాత, కాపీ చేసిన మెసేజ్‌ను చాట్ బాక్స్‌లో పేస్ట్‌ చేయచండి. మీ తప్పును సరిచేసి మళ్లీ పంపండి.
  • ఈ విధంగా, సందేశం సవరించబడిందని లేదా తొలగించబడిందని సూచించే నోటిఫికేషన్ ఏదీ అవతలి వారికి ఉండదు. అయితే మీరు ఆ మెసేజ్‌ ను వారు చూడక ముందే డిలీట్‌ చేసి సరిచేయాలి. ఒక్కసారి వారు చూస్తే ఇది చేయడం వీలు పడదు.
  • ఇన్‌స్టాగ్రామ్ మీరు పంపిన సందేశాన్ని తొలగించగల సమయ ఫ్రేమ్‌ని పరిమితం చేస్తుందని కూడా గమనించడం ముఖ్యం. కాబట్టి, దానిని గుర్తుంచుకోండి. అలాగే, ఆ సమయ విండో ముగిసినట్లయితే, ప్రక్రియను మీరు పూర్తి చేయలేరు.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

బ్యాట్స్ మెన్ల బాదుడు..బౌలర్ల ఏడుపు.. ఒకే టీ20 మ్యాచ్లో 449 రన్స్
బ్యాట్స్ మెన్ల బాదుడు..బౌలర్ల ఏడుపు.. ఒకే టీ20 మ్యాచ్లో 449 రన్స్
ఓర్నీ.! పెద్ద బాంబ్ పేల్చిన వాతావరణ శాఖ
ఓర్నీ.! పెద్ద బాంబ్ పేల్చిన వాతావరణ శాఖ
సూర్య స్థానంలో శివ కార్తికేయన్.. 'పురనానూరు' కథలో జరిగిన మార్పులు
సూర్య స్థానంలో శివ కార్తికేయన్.. 'పురనానూరు' కథలో జరిగిన మార్పులు
మూడు పొయ్యిలున్న గ్యాస్ పై వంట చేస్తున్నారా.. ఇక మీరు అప్పుల పాలే
మూడు పొయ్యిలున్న గ్యాస్ పై వంట చేస్తున్నారా.. ఇక మీరు అప్పుల పాలే
వాస్తు టిప్స్ : దరిద్రంపోయి కోటీశ్వరులు అవ్వాలా..
వాస్తు టిప్స్ : దరిద్రంపోయి కోటీశ్వరులు అవ్వాలా..
వయస్సు పెరిగినా యంగ్‌గా కనిపించాలా?.. హీరోయిన్ ఫిట్‌నెస్ సీక్రెట్
వయస్సు పెరిగినా యంగ్‌గా కనిపించాలా?.. హీరోయిన్ ఫిట్‌నెస్ సీక్రెట్
ఢిల్లీ టీమ్‎కి బై బై..కింగ్ కోహ్లీ సడన్ ఎగ్జిట్ వెనుక నిజం ఇదే
ఢిల్లీ టీమ్‎కి బై బై..కింగ్ కోహ్లీ సడన్ ఎగ్జిట్ వెనుక నిజం ఇదే
Rewind 2025: టాలీవుడ్‌పై బాలీవుడ్ స్టార్ల దండయాత్ర..!
Rewind 2025: టాలీవుడ్‌పై బాలీవుడ్ స్టార్ల దండయాత్ర..!
కేబినెట్‌విస్తరణపై సీఎం రేవంత్ కసరత్తు.. రేసులో ఉన్నది ఎవరు?
కేబినెట్‌విస్తరణపై సీఎం రేవంత్ కసరత్తు.. రేసులో ఉన్నది ఎవరు?
సూర్యపై వేటు, గిల్‌కు నోఛాన్స్.. భారత టీ20 కెప్టెన్‌గా ఎవరంటే?
సూర్యపై వేటు, గిల్‌కు నోఛాన్స్.. భారత టీ20 కెప్టెన్‌గా ఎవరంటే?