AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ampere App: మీ ఫోన్ బ్యాటరీ పనితీరు ఎలా ఉంది? ఈ చిన్న టెక్నిక్‌తో ఇట్టే తెలుసుకోవచ్చు..

మీ ఫోన్ చార్జర్ ఎలా పనిచేస్తుంది? ఎంత వేగంగా చార్జ్ చేస్తుంది? అనేది కూడా తెలుసుకోవడం ముఖ్యం. అందుకోసం మీకో చిట్కాను ఇప్పుడు మీకు అందిస్తున్నాం. దానిని పాటించడం ద్వారా మీ ఫోన్ చార్జింగ్ ఎలా జరుగుతుందో అర్థం అవుతుంది. అంతేకాక ఫోన్ బ్యాటరీ వినియోగాన్ని కూడా డిస్చార్జ్ కరెంట్ రూపంలో తనిఖీ చేసుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం..

Ampere App: మీ ఫోన్ బ్యాటరీ పనితీరు ఎలా ఉంది? ఈ చిన్న టెక్నిక్‌తో ఇట్టే తెలుసుకోవచ్చు..
Smartphone Charging Testing App Ampere
Madhu
| Edited By: Ravi Kiran|

Updated on: Jan 14, 2024 | 1:45 PM

Share

స్మార్ట్ ఫోన్ చార్జింగ్ టెక్నాలజీలో చాలా మార్పులు చోటుచేసుకున్నాయి. స్మార్ట్ ఫోన్ కంపెనీలు అనేక రకాల ఫాస్ట్ చార్జర్లను ఆవిష్కరించారు. అత్యాధునిక చార్జింగ్ టెక్నాలజీలతో కేవలం నిమిషాల వ్యవధిలోనే స్మార్ట్ ఫోన్ ఫుల్ చార్జ్ చేసే చార్జర్లను తీసుకొచ్చారు. అయితే ఒక్కో ఫోన్ కి ఒక్కో రకమైన చార్జర్లు అందుబాటులో ఉంటాయి. ఒక్కో ఫోన్ కి ఒక్కో రకమైన వాటేజ్, యాంపియర్ కొలమానాలుంటాయి. అది ఫోన్ ని బట్టి మారుతుంటాయి. అందుకే చాలా మంది నిపుణులు ఏ ఫోన్ చార్జర్ ఆ ఫోన్ కే వినియోగించాలని చెబుతుంటారు. అయితే ఇటీవల చాలా స్మార్ట్ ఫోన్ తయారీదారులు ఫోన్ తో పాటు చార్జర్లు ఇవ్వడం లేదు. మరి అలాంటి సమయంలో మీ ఫోన్ కి మంచి చార్జర్ కొనుగోలు చేయడం అవసరం. అది చార్జింగ్ ను వేగంగా పూర్తి చేయడంతో పాటు తక్కువ వేడిని ఉత్పత్తి చేసేదై ఉంటే మంచిది.

చార్జింగ్ టెక్నాలజీల్లో కూడా చాలా రకాలు వచ్చాయి. వాటిల్లో సరికొత్త సాంకేతికత గాలియం నైట్రైడ్(GaN). ఈ జీఏఎన్ చార్జర్ చార్జింగ్ చేసే సమయంలో చాలా తక్కువ వేడిని ఉత్పత్తి చేశాయి. అంతేకాక వేగవంతంగా చార్జ్ చేస్తుంది. వీటిని సిలికాన్ చార్జర్లతో పోల్చితే చాలా తక్కువ వేడిని ఉత్పత్తి చేయడంతో పాటు ఫోన్ త్వరగా చార్జ్ చేసిపెడుతుంది. అయితే ముందుగా మీ ఫోన్ చార్జర్ ఎలా పనిచేస్తుంది? ఎంత వేగంగా చార్జ్ చేస్తుంది? అనేది కూడా తెలుసుకోవడం ముఖ్యం. అందుకోసం మీకో చిట్కాను ఇప్పుడు మీకు అందిస్తున్నాం. దానిని పాటించడం ద్వారా మీ ఫోన్ చార్జింగ్ ఎలా జరుగుతుందో అర్థం అవుతుంది.

డౌన్ లోడ్ ఆంపియర్ యాప్..

వాస్తవానికి మీ ఛార్జర్ పనితీరును అంచనా వేయడం కోసం ఎటువంటి ఖర్చు లేకుండా.. వేగంగా పూర్తయ్యే పద్ధతి ఒకటి ఉంది. అది ఈ యాప్ ను వినియోగించడం. దీని పేరు ఆంపియర్. ఆండ్రాయిడ్ వినియోగదారులు దీనిని ఉచితంగా పొందొచ్చు. గూగుల్ ప్లే స్టోర్ లోకి వెళ్లి ఆంపియర్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకొని ఇన్ స్టాల్ చేసుకోవచ్చు. ఇది మీ ఫోన్లో ఓపెన్ చేసి చార్జింగ్ పెడితే ఆ ఫోన్ ఎంత మేర చార్జ్ అవుతుంది, ఎంతమేర డిస్చార్జ్ అవుతుంది అనేది స్పష్టంగా స్క్రీన్ పై కనిపిస్తుంది. ఒక వేళ మీ ఫోన్ చార్జర్ కు కనెక్ట్ చేసి లేకపోతే డిస్చార్జ్ కరెంట్ ను మైనస్ డిజిట్స్ లో చూపిస్తుంది. చార్జింగ్ పెడితే అది ఎంత మేర కరెంట్ అది చార్జ్ చేస్తుందో చూపిస్తుంది.

ఇవి కూడా చదవండి

ఎలా వినియోగించాలంటే..

మీ ఫోన్లో ఆంపియర్ యాప్ లో ఆన్ చేయగానే అది ఆటోమేటిక్ గా చార్జింగ్ ను కొలవడం ప్రారంభిస్తుంది. కొన్ని సెకండ్ల తర్వాత మీ ఫోన్ స్క్రీన్ పై రిజల్ట్స్ మీకు డిస్ ప్లే అవుతాయి. ఈ యాప్ మీ డివైజ్ లోని బ్యాటరీ లెవెల్స్, దాని హెల్త్, స్టేటస్, టెక్నాలజీ, గరిష్ట సామర్థ్యం, దాని ఉష్టోగ్రత, వోల్టేజ్ ను చూపిస్తుంది. దీనిలో రీడింగ్స్ అన్ని కూడా ఎంఏ(mA-మిల్లిఆంపియర్)లలో చూపిస్తుంది. దానిని మీరు వాట్స్ లోకి కన్వర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..