Fake Aadhar: ఆన్‌లైన్‌లో నకిలీ ఆధార్ కార్డును.. ఇలా ఈజీగా గుర్తించండి!
పెరుగుతున్న టెక్నాలజీని ఉపయోగించుకొని ప్రతిదాన్ని నకిలీ చేస్తున్నారు కొందరు కేటుగాళ్లు. అలానే మన ఆధార్ కార్డును కూడా నకిలీ చేసి.. వాటితో అనేక అక్రమాలకు పాల్పడుతున్నారు. అలాంటి సమస్యకు చెక్‌పెట్టి నకిలీ ఆధార్ కార్డులను ఈజీగా ఎలా గుర్తించాలో మనం ఇక్కడ తెలుసుకుందాం.

Fake Aadhar Card
ప్రస్తుతం భారతదేశంలో ప్రతి ఒక్క పౌరుడికి ఆధార్ ముఖ్యమైన గుర్తింపు కార్డు. బ్యాంకింగ్ నుండి ప్రతి అధికారిక ఉద్యోగానికి ఆధార్ కార్డు కచ్చితంగా అవసరం. కానీ ఈ మధ్య చాలా మంది నకిలీ ఆధార్ కార్డులను వినియోగిస్తున్నారు. కానీ ఇది కొన్ని సార్లు అనేక సమస్యలకు దారి తీస్తుంది. ఈ సమస్యలకు చెక్‌పెట్టేందుకు నకిలీ ఆధార్ కార్డులను ఎలా ఈజీగా గుర్తించాలో ఇక్కడ మనం తెలుసుకుందాం.
UIDAI వెబ్‌సైట్ ద్వారా చెక్ చేయడం
- ఆధార్ కార్డు వెరిఫికేషన్ కోసం, మీరు ముందుగా UIDAI అధికారిక వెబ్‌సైట్ uidai.gov.in కి వెళ్లాలి.
- తరువాత, మీరు నా ఆధార్ విభాగానికి వెళ్లి, వెరిఫై ఆధార్ నంబర్ ఎంపికను ఎంచుకోవాలి.
- తరువాత మీరు 12 అంకెల ఆధార్ నంబర్, స్క్రీన్‌పై కనిపించే క్యాప్చా కోడ్‌ను నమోదు చేయాలి.
- మీరు వెరిఫై బటన్ పై క్లిక్ చేసిన వెంటనే, మీ ఆధార్ నంబర్ యాక్టివ్ గా ఉందా లేదా ఇన్ యాక్టివ్ గా ఉందా అని మీకు వెంటనే తెలుస్తుంది.
- ఆధార్ యాక్టివ్‌గా కనిపిస్తే, ఆ కార్డు నిజమైనదని, చెల్లుబాటు అవుతుందని అర్థం.
mAadhaar యాప్ తో ఎలా వెరిఫై చేయాలి?
- UIDAI mAadhaar అనే మొబైల్ యాప్‌ను చెక్ చేసుకోవడానికి రెండు పద్ధతులు ఉన్నాయి
- ఆధార్ నంబర్‌ను వెరిఫై చేయడం- ఇక్కడ మీరు మీ ఆధార్ నంబర్‌ను ఎంటర్ చేసి వెబ్‌సైట్ లాగా వెరిఫై చేయడం
- QR కోడ్ స్కాన్- ప్రతి ఆధార్ కార్డుపై ఒక QR కోడ్ ఉంటుంది. మీరు mAadhaar యాప్‌తో స్కాన్ చేసి కూడా మీ ఆధార్ నిజమైనదా, నకిలీదా అని వెరిఫై చేయొచ్చు
మరిన్ని సైన్ అండ్ టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




