AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఫోన్ స్టోరేజ్ ఫుల్ అవుతుందా? ఒక్క ఫైల్ కూడా డిలీట్ చేయకుండానే స్పేస్ ఖాళీ చేసే 5 మార్గాలు

స్మార్ట్‌ఫోన్‌లో ‘స్టోరేజ్ ఫుల్’ అనే నోటిఫికేషన్ వస్తే కొత్త ఫోటోలు, వీడియోలు సేవ్ చేయడం, యాప్స్ డౌన్‌లోడ్ చేయడం కష్టంగా మారుతుంది. కొన్ని సందర్భాల్లో ఫోన్ పనితీరు కూడా నెమ్మదించొచ్చు. అయితే వెంటనే ముఖ్యమైన ఫైళ్లను డిలీట్ చేయాల్సిన అవసరం లేదు. ముందుగా ఏ ఫైళ్లు ఎక్కువ స్థలాన్ని ఆక్రమిస్తున్నాయో తెలుసుకుని, అవసరం లేని వాటిని తొలగిస్తే సరిపోతుంది.

ఫోన్ స్టోరేజ్ ఫుల్ అవుతుందా? ఒక్క ఫైల్ కూడా డిలీట్ చేయకుండానే స్పేస్ ఖాళీ చేసే 5 మార్గాలు
Free Up Phone Storage.jpg
Nikhil
|

Updated on: Sep 27, 2026 | 7:30 AM

Share

ఫోన్ మెమరీ ఎప్పుడు నిండిపోతుందో తెలియదు. ఫోటోలు, వీడియోలు, డౌన్‌లోడ్స్, యాప్స్, క్యాష్ ఫైల్స్ ఇలా ఒక్కొక్కటిగా చేరడంతో స్టోరేజ్ వేగంగా ఖాళీ అయిపోతుంది. అయితే కొన్ని సులభమైన సెట్టింగ్స్ మార్చడం ద్వారా అదనపు స్థలాన్ని పొందొచ్చు. ముఖ్యమైన డేటాను కోల్పోకుండా ఫోన్‌లో స్పేస్ ఖాళీ చేసేందుకు ఉపయోగపడే మార్గాలు ఇవే.

ఎక్కువ స్టోరేజ్..

ఏదైనా ఫైల్ డిలీట్ చేసే ముందు మీ ఫోన్‌లో Settings > Storage విభాగానికి వెళ్లండి. అక్కడ ఫోటోలు, వీడియోలు, యాప్స్, డౌన్‌లోడ్స్ వంటి వాటిలో ఏది ఎంత స్టోరేజ్ తీసుకుంటుందో తెలుస్తుంది. దీని ఆధారంగా ఏవి తొలగించాలో నిర్ణయించుకోవచ్చు.

Google Photosలో ఫోటోలు, వీడియోలు ఇప్పటికే బ్యాకప్ అయి ఉంటే Smart Storage ఫీచర్ ఉపయోగపడుతుంది. Settings > Storage > Free Up Spaceకి వెళ్లి, మెనూలో Smart Storage ఆప్షన్‌ను ఆన్ చేయొచ్చు. బ్యాకప్ అయిన పాత ఫోటోలు, వీడియోల స్థానిక కాపీలను తొలగించి స్పేస్ ఖాళీ చేయడంలో ఇది సహాయపడుతుంది.

వాడని యాప్స్‌పై దృష్టి

YouTube, Google TV వంటి యాప్స్‌లో డౌన్‌లోడ్ చేసిన వీడియోలు, పాటలు కూడా చాలా స్థలాన్ని ఆక్రమిస్తాయి. Google TVలో Library > Downloaded Videosకి వెళ్లి అవసరం లేని వాటిని Remove చేయొచ్చు. YouTube Musicలో Libraryలోకి వెళ్లి పాట లేదా ఆల్బమ్ పక్కన ఉన్న More > Remove Download ఎంచుకోవచ్చు. ఎక్కువగా వాడని యాప్స్‌ను అన్‌ఇన్‌స్టాల్ చేయడం మరో సులభమైన మార్గం. అలాగే Settings > Appsలోకి వెళ్లి ఎక్కువ క్యాష్ పేరుకుపోయిన యాప్‌ను ఎంచుకుని Clear Cache చేయొచ్చు. అయితే కొన్ని ఫోన్లలో సెట్టింగ్స్ పేర్లు మారవచ్చు.

యాప్‌ను పూర్తిగా తొలగించకుండా స్పేస్ తగ్గించాలంటే Archive Apps ఫీచర్ ఉపయోగపడుతుంది. Google Play Store > Profile > Settings > Generalలో Automatically Archive Apps ఆప్షన్‌ను ఆన్ చేయవచ్చు. యాప్ పరిమాణం తగ్గినా వ్యక్తిగత డేటా, ఐకాన్ ఫోన్‌లోనే ఉంటాయి. చివరగా Files లేదా Files by Google యాప్‌లో Downloads ఫోల్డర్‌ను పరిశీలించండి. పాత PDFలు, డాక్యుమెంట్లు, ఇమేజెస్ వంటి అవసరం లేని ఫైళ్లను తొలగిస్తే వెంటనే కొంత స్టోరేజ్ ఖాళీ అవుతుంది. ముఖ్యమైన ఫైళ్లను డిలీట్ చేసే ముందు వాటికి బ్యాకప్ ఉందో లేదో మాత్రం తప్పకుండా చూసుకోండి.

Follow Us
బ్రెస్ట్ క్యాన్సర్‌పై అవగాహన కోసం 'పింక్ పవర్ రన్ 3.0'..
బ్రెస్ట్ క్యాన్సర్‌పై అవగాహన కోసం 'పింక్ పవర్ రన్ 3.0'..
వచ్చే ఎన్నికల్లో గెలుపు మాదే: మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు
వచ్చే ఎన్నికల్లో గెలుపు మాదే: మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు
వైసీపీ ఓటమికి అవే కారణం.. TV9 క్రాస్‌ఫైర్‌లో ధర్మాన ప్రస్తాదరావు
వైసీపీ ఓటమికి అవే కారణం.. TV9 క్రాస్‌ఫైర్‌లో ధర్మాన ప్రస్తాదరావు
జగన్ పూర్తి చేసిన వాటికి ఇప్పుడు రిబ్బన్ కట్ చేస్తున్నారు
జగన్ పూర్తి చేసిన వాటికి ఇప్పుడు రిబ్బన్ కట్ చేస్తున్నారు
Tv9 క్రాస్‌ఫైర్‌లో మాజీ మంత్రి ధర్మాన ప్రసాద్ కీలక వ్యాఖ్యలు!
Tv9 క్రాస్‌ఫైర్‌లో మాజీ మంత్రి ధర్మాన ప్రసాద్ కీలక వ్యాఖ్యలు!
అనుమాన పక్షి మూవీ రివ్యూ.. రాగ్‌ మయూర్‌ కామెడీ అదుర్స్‌!
అనుమాన పక్షి మూవీ రివ్యూ.. రాగ్‌ మయూర్‌ కామెడీ అదుర్స్‌!
'నన్ను అవమానించినా ఫర్వాలేదు.. ట్రోలర్స్‌కు ఎమోషనల్ మెసేజ్
'నన్ను అవమానించినా ఫర్వాలేదు.. ట్రోలర్స్‌కు ఎమోషనల్ మెసేజ్
‘ప్యారడైజ్‌’ టాక్‌తో చిరు-శ్రీకాంత్‌ మూవీకి బ్రేక్‌ పడుతుందా?
‘ప్యారడైజ్‌’ టాక్‌తో చిరు-శ్రీకాంత్‌ మూవీకి బ్రేక్‌ పడుతుందా?
400 కోట్ల వైపు పరుగులు.. చిన్న సినిమాకు షాకింగ్ కలెక్షన్స్
400 కోట్ల వైపు పరుగులు.. చిన్న సినిమాకు షాకింగ్ కలెక్షన్స్
నాని సినిమా ముందర.. భారీ బ్రేక్ ఈవెన్ టార్గెట్?
నాని సినిమా ముందర.. భారీ బ్రేక్ ఈవెన్ టార్గెట్?