AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సోషల్ మీడియాకు దూరంగా ఉండాలనుకుంటున్నారా?  భారీగా తగ్గిన క్లాసిక్ ఫోన్ ధర

స్మార్ట్‌ఫోన్ నోటిఫికేషన్లతో విసిగిపోయారా? సోషల్ మీడియాకు కాస్త దూరంగా ఉండి, కాల్స్ కోసం మాత్రమే ఓ ఫోన్ కావాలనుకుంటున్నారా? అత్యవసర సమయంలో ఉపయోగించేందుకు బ్యాకప్ ఫోన్ కోసం చూస్తున్న వారికి ఇప్పుడు ఓ పాత మోడల్ కొత్త రూపంలో అందుబాటులో ఉంది. 4G కనెక్టివిటీతో వచ్చిన ఈ క్లాసిక్ ఫోన్‌పై HMD తాజాగా రూ.1,000 డిస్కౌంట్ ప్రకటించింది.

సోషల్ మీడియాకు దూరంగా ఉండాలనుకుంటున్నారా?  భారీగా తగ్గిన క్లాసిక్ ఫోన్ ధర
Nokia 3210 4g.jpg
Nikhil
|

Updated on: Sep 27, 2026 | 6:15 AM

Share

ఒకప్పుడు మొబైల్ ఫోన్ మార్కెట్‌లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న Nokia 3210 ఇప్పుడు 4G కనెక్టివిటీతో మళ్లీ అందుబాటులో ఉంది. సాధారణ డిజైన్, బటన్ల కీప్యాడ్, పెద్ద బ్యాటరీతో వచ్చిన ఈ ఫోన్ ధర తాజాగా తగ్గింది. రూ.5,000కుపైగా ఉన్న ధర ఇప్పుడు రూ.4,299కు చేరింది. Type-C ఛార్జింగ్, Bluetooth 5.0 వంటి ఆధునిక ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి.

రూ.4,299కే Nokia 3210 4G

HMD అధికారిక వెబ్‌సైట్‌లో ఈ ఫోన్ ధరను రూ.1,000 తగ్గించింది. దీంతో ఇప్పటివరకు రూ.5,000కుపైగా ఉన్న ధర ఇప్పుడు రూ.4,299కు అందుబాటులో ఉంది. ఒకేసారి మొత్తం చెల్లించలేని వారికి నెలకు రూ.716 నుంచి EMI సదుపాయం కూడా ఉంది. UPI, బ్యాంక్ కార్డులతో చెల్లించి ఆర్డర్ చేసుకోవచ్చు.

క్లాసిక్ డిజైన్‌లో ఆధునిక ఫీచర్లు

ఈ ఫోన్‌లో 2.4 అంగుళాల స్క్రీన్, బటన్ల కీప్యాడ్ ఉన్నాయి. వెనుకవైపు LED ఫ్లాష్‌తో 2MP కెమెరా ఇచ్చారు. వైర్‌లెస్ FM, MP3 ప్లేయర్, Snake గేమ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. 1450mAh రీమూవబుల్ బ్యాటరీ సుమారు 10 గంటల టాక్‌టైమ్ అందిస్తుంది. Type-C ఛార్జింగ్ పోర్ట్, Bluetooth 5.0 సపోర్ట్ కూడా ఉన్నాయి.

డ్యూయల్ SIMతో 4G కనెక్టివిటీ లభిస్తుంది. పాటలు, ఇతర ఫైళ్ల కోసం MicroSD కార్డ్ ద్వారా స్టోరేజ్‌ను 32GB వరకు పెంచుకోవచ్చు. Y2K Gold, Grunge Black, Scuba Blue రంగుల్లో ఈ ఫోన్ లభిస్తుంది. స్మార్ట్‌ఫోన్‌కు ప్రత్యామ్నాయంగా కాకుండా, కాల్స్, సాధారణ వినియోగం కోసం చిన్న ఫోన్ కోరుకునేవారికి ఇది ఉపయోగపడొచ్చు.

Follow Us
వచ్చే ఎన్నికల్లో గెలుపు మాదే: మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు
వచ్చే ఎన్నికల్లో గెలుపు మాదే: మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు
వైసీపీ ఓటమికి అవే కారణం.. TV9 క్రాస్‌ఫైర్‌లో ధర్మాన ప్రస్తాదరావు
వైసీపీ ఓటమికి అవే కారణం.. TV9 క్రాస్‌ఫైర్‌లో ధర్మాన ప్రస్తాదరావు
జగన్ పూర్తి చేసిన వాటికి ఇప్పుడు రిబ్బన్ కట్ చేస్తున్నారు
జగన్ పూర్తి చేసిన వాటికి ఇప్పుడు రిబ్బన్ కట్ చేస్తున్నారు
Tv9 క్రాస్‌ఫైర్‌లో మాజీ మంత్రి ధర్మాన ప్రసాద్ కీలక వ్యాఖ్యలు!
Tv9 క్రాస్‌ఫైర్‌లో మాజీ మంత్రి ధర్మాన ప్రసాద్ కీలక వ్యాఖ్యలు!
అనుమాన పక్షి మూవీ రివ్యూ.. రాగ్‌ మయూర్‌ కామెడీ అదుర్స్‌!
అనుమాన పక్షి మూవీ రివ్యూ.. రాగ్‌ మయూర్‌ కామెడీ అదుర్స్‌!
'నన్ను అవమానించినా ఫర్వాలేదు.. ట్రోలర్స్‌కు ఎమోషనల్ మెసేజ్
'నన్ను అవమానించినా ఫర్వాలేదు.. ట్రోలర్స్‌కు ఎమోషనల్ మెసేజ్
‘ప్యారడైజ్‌’ టాక్‌తో చిరు-శ్రీకాంత్‌ మూవీకి బ్రేక్‌ పడుతుందా?
‘ప్యారడైజ్‌’ టాక్‌తో చిరు-శ్రీకాంత్‌ మూవీకి బ్రేక్‌ పడుతుందా?
400 కోట్ల వైపు పరుగులు.. చిన్న సినిమాకు షాకింగ్ కలెక్షన్స్
400 కోట్ల వైపు పరుగులు.. చిన్న సినిమాకు షాకింగ్ కలెక్షన్స్
నాని సినిమా ముందర.. భారీ బ్రేక్ ఈవెన్ టార్గెట్?
నాని సినిమా ముందర.. భారీ బ్రేక్ ఈవెన్ టార్గెట్?
టాక్‌కు దూరంగా.. నాని సినిమాకు సాలిడ్ కలెక్షన్స్‌
టాక్‌కు దూరంగా.. నాని సినిమాకు సాలిడ్ కలెక్షన్స్‌