AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సెప్టెంబర్ 27 రాశిఫలాలు: ఈ రాశులకు ఉద్యోగ, ఆర్థిక విషయాల్లో కీలక పరిణామాలు

Rashi Phalalu (September 27, 2026): మేష రాశి వారు ఉద్యోగంలో అధికారులతో ఆచితూచి వ్యవహరించడం మంచిది. వృషభ రాశి వారికి ఉద్యోగం, వృత్తిలో సానుకూల మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది. మిథున రాశి వారికి కుటుంబ సభ్యుల సహకారంతో ఆస్తి వివాదం పరిష్కార దిశగా సాగుతుంది. మేషం నుంచి మీనం వరకు 12 రాశుల వారికి ఆదివారం ఉద్యోగం, ఆర్థికం, కుటుంబం, ఆరోగ్యం, వ్యాపారం, ప్రేమ తదితర విషయాల్లో ఎలాంటి ఫలితాలు ఉన్నాయో తెలుసుకోండి.

సెప్టెంబర్ 27 రాశిఫలాలు: ఈ రాశులకు ఉద్యోగ, ఆర్థిక విషయాల్లో కీలక పరిణామాలు
Rashifal 26 Sep 2026
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Sep 27, 2026 | 6:00 AM

Share

దిన ఫలాలు (సెప్టెంబర్ 27, 2026): మేష రాశి వారు ఉద్యోగంలో అధికారులతో ఆచితూచి వ్యవహరించడం మంచిది. అపార్థాలు తలెత్తే అవకాశం ఉంది. వృషభ రాశి వారికి వృత్తి, ఉద్యోగాల్లో సానుకూల మార్పులు, చేర్పులు చోటు చేసుకుంటాయి. వ్యాపారాల్లో లాభాలు నిలకడగా సాగిపోతాయి. మిథున రాశి వారికి కుటుంబ సభ్యుల సహాయంతో ఆస్తి వివాదం ఒకటి పరిష్కార దిశగా సాగుతుంది. ఆస్తి, ఆర్థిక వ్యవహారాలు చక్కబడతాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి ఆదివారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన లాభాలు అందుకుంటారు. ఉద్యోగంలో అధికారులతో ఆచితూచి వ్యవహరించడం మంచిది. అపార్థాలు తలెత్తే అవకాశం ఉంది. ముఖ్యమైన పనులన్నీ పూర్తవుతాయి. ఆర్థిక, వ్యక్తిగత సమస్యల పరిష్కారంలో కుటుంబ సభ్యుల సహాయం లభిస్తుంది. ఆర్థిక వ్యవహా రాలు ఆశించిన ఫలితాలనిస్తాయి. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందుతాయి. ఆధ్యాత్మికచింతన పెరుగుతుంది. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టడం మంచిది. దాంపత్యంలో అన్యోన్యత బాగా పెరుగుతుంది.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

వృత్తి, ఉద్యోగాల్లో సానుకూల మార్పులు, చేర్పులు చోటు చేసుకుంటాయి. వ్యాపారాల్లో లాభాలు నిలకడగా సాగిపోతాయి. ఆదాయంలో ఆశించిన పెరుగుదల ఉండకపోవచ్చు. వృథా ఖర్చులు మాత్రం కొనసాగుతాయి. పిల్లలు ఘన విజయాలు సాధిస్తారు. ముఖ్యమైన వ్యవహారాల్లో కొద్దిగా ఆటంకాలున్నప్పటికీ, పట్టుదలగా వాటిని పూర్తి చేస్తారు. కుటుంబ బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. బంధుమిత్రుల్లో కొందరికి సహాయ సహకారాలు అందజేస్తారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

ఇవి కూడా చదవండి

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

కుటుంబ సభ్యుల సహాయంతో ఆస్తి వివాదం ఒకటి పరిష్కార దిశగా సాగుతుంది. ఆస్తి, ఆర్థిక వ్యవహారాలు చక్కబడతాయి. ధనపరంగా ఎవరినీ నమ్మకపోవడం మంచిది. మిత్రుల వల్ల కొద్దిగా నష్టపోయే అవకాశం ఉంది. ఆర్థిక సమస్యలు చాలావరకు పరిష్కారం అవుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో సహోద్యోగులకు సహకారమందిస్తారు. వ్యాపారాలు జోరుగా సాగిపోతాయి. మంచి స్నేహాలు ఏర్పడతాయి. వ్యక్తిగత సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టడం మంచిది.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

ఉద్యోగంలో ఆశించిన ప్రోత్సాహం, ఆదరణ లభిస్తాయి. వృత్తి జీవితంలో బాగా బిజీ అయిపోవడం జరుగుతుంది. వ్యాపారాల్లో లాభాలు కొద్దిగా పెరిగే అవకాశం ఉంది. ముఖ్యమైన పనులు, ప్రయ త్నాల్లో శ్రమ ఎక్కువగా ఉంటుంది. అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి. ఆదాయానికి మించిన ఖర్చులుంటాయి. కుటుంబ జీవితం ఉత్సాహంగా సాగిపోతుంది. జీవిత భాగస్వామికి కలిసి వస్తుంది. పిల్లల పురోగతి గురించి శుభవార్త అందుతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

ఉద్యోగంలో బాధ్యతలు పెరుగుతాయి. వృత్తి జీవితంలో బిజీ అయిపోతారు. ఉచిత సహాయాలు, దాన ధర్మాల వల్ల ఇబ్బంది పడతారు. ఖర్చులు తగ్గించుకుని, పొదుపు పాటించచడం అవసరం. సహాయం పొందినవారు ముఖం చాటేస్తారు. సొంత పనుల మీద శ్రద్ధ పెట్టడం మంచిది. పెళ్లి ప్రయత్నాల్లో బంధువుల నుంచి ఆశించిన శుభవార్త అందుతుంది. జీవిత భాగస్వామికి ఉద్యోగంలో పురోగతి ఉంటుంది. నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

వృత్తి, ఉద్యోగాల్లో బాధ్యతలు పూర్తిగా మారిపోయే సూచనలున్నాయి. వ్యాపారాల్లో పోటీదార్ల సమస్య చాలావరకు తగ్గే అవకాశం ఉంది. నిరుద్యోగులకే కాక, ఉద్యోగులకు కూడా ఆశించిన ఆఫర్లు అందుతాయి. పెళ్లి ప్రయత్నాలు సఫలమవుతాయి. ఆస్తి వివాదం విషయంలో బంధువుల నుంచి శుభవార్త వింటారు. కుటుంబసమేతంగా దైవ కార్యాల్లో పాల్గొంటారు. ఇతరుల వ్యవహా రాల్లో జోక్యం చేసుకోకపోవడం మంచిది. ప్రస్తుతానికి ఎవరితోనూ ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవద్దు.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

ఉద్యోగంలో అనుకూలతలు ఎక్కువగా కలుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో సమస్యల్ని అధిగమి స్తారు. కొన్ని ముఖ్యమైన వ్యవహారాలను చక్కబెడతారు. ఆర్థికంగా లాభాలు పెరుగుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో ప్రణాళికాబద్ధంగా వ్యవహరించడం మంచిది. మాటకు విలువ పెరుగుతుంది. కొందరు బంధుమిత్రులతో అపార్థాలు తలెత్తవచ్చు. కుటుంబ సభ్యుల సహకారంతో దైవ కార్యాలు నిర్వహిస్తారు. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాలు విజయవంతం అయ్యే అవకాశం ఉంది. ఆరోగ్యం పరవాలేదు.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

వృత్తి, వ్యాపారాలు బాగా లాభసాటిగా పురోగమిస్తాయి. శ్రమకు, పెట్టుబడికి తగ్గ ప్రతిఫలం ఉండ వచ్చు. ఉద్యోగంలో అధికారుల ఆదరణ లభిస్తుంది. పని ఒత్తిడి బాగా తగ్గుతుంది. వ్యక్తిగత సమస్యలు చాలావరకు పరిష్కరించుకుంటారు. కొన్ని అత్యవసర పనులను పూర్తి చేస్తారు. ప్రయాణాల వల్ల బాగా లాభం ఉంటుంది. నిరుద్యోగులకు ఆశించిన ఆఫర్లు అందుతాయి. పిల్లలతో ఎంజాయ్ చేస్తారు. ఆర్థిక లావాదేవీలకు వీలైనంత దూరంగా ఉండడం మంచిది. ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

వృత్తి, ఉద్యోగాల్లో ఒకటి రెండు శుభవార్తలు వింటారు. వ్యాపారాల్లో అంచనాల్ని మించి లాభాలు గడిస్తారు. అన్ని రంగాల వారికి సమయం అనుకూలంగా ఉంది. ఎటువంటి ప్రయత్నం చేపట్టినా కలిసి వస్తుంది. కొందరు బంధువుల నుంచి సమస్యలు, విమర్శలు ఉండవచ్చు. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. కొత్త కార్యక్రమాలు, నిర్ణయాలు సత్ఫలితాలనిస్తాయి. పిల్లల విషయంలో ఆశించిన శుభవార్త అందుతుంది. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

ఉద్యోగంలో జీతభత్యాల పెరుగుదలకు అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ పెరుగు తుంది. పెళ్లి ప్రయత్నాల్లో శుభవార్తలు వింటారు. ఒకటి రెండు ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి బయటపడతారు. చిన్ననాటి మిత్రులతో విందులో పాల్గొంటారు. ముఖ్యమైన ఆస్తి, ఆర్థిక వ్యవహా రాలు తేలికగా పూర్తవుతాయి. కుటుంబ జీవితం సాఫీగా సాగుతుంది. ఆర్థికంగా ఆశించిన పురోగతి ఉంటుంది. ఆస్తి వివాదంలో సోదరులతో బాగా ఓర్పు, సహనాలతో వ్యవహరించాల్సి ఉంటుంది.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

వృత్తి, ఉద్యోగాల్లో హోదా పెరుగుతుంది. కానీ, జీతభత్యాలు నిరుత్సాహం కలిగిస్తాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది కానీ, కుటుంబ ఖర్చులు పెరుగుతాయి. ఆర్థిక విషయాల్లో ఎవరికీ వాగ్దానాలు చేయకపోవడం మంచిది. వ్యాపారాల్లో సామాన్య లాభాలు మాత్రమే ఉంటాయి. ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. ఆహార, విహారాల్లో జాగ్రత్తగా ఉండడం ఉత్తమం. ఆధ్యాత్మిక సేవల్లో పాల్గొంటారు. కుటుంబసమేతంగా విహార యాత్ర చేస్తారు. పిల్లలు విజయాలు సాధిస్తారు.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం, ప్రాభవం బాగా పెరుగుతాయి. మీ పనితీరుతో అందరినీ ఆకట్టుకుం టారు. వ్యాపారాల్లో మీ వ్యూహాలు, నిర్ణయాలు సత్ఫలితాలనిస్తాయి. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. అదనపు ఆదాయానికి లోటుండదు. ఒకరిద్దరు బంధువులకు ఆర్థికంగా సహాయం చేస్తారు. ముఖ్యమైన ప్రయత్నాలన్నీ సఫలం అవుతాయి. మంచి పరిచయాలు ఏర్పడ తాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఆదాయానికి లోటుండదు కానీ, ఖర్చులు పెరుగుతాయి.

Follow Us